డైరెక్టర్ గా హిట్.. ప్రొడ్యూసర్ గా ఫెయిల్..!
దీపావళి కానుకగా తమిళ్ లో కూడా భారీగా సినిమాలు రిలీజ్ అయ్యాయి.
By: Tupaki Desk | 14 Nov 2024 7:30 PM GMTసూపర్ స్టార్ రజినికాంత్ కి జైలర్ లాంటి హిట్ ఇచ్చిన నెల్సన్ దిలీప్ కుమార్ సడెన్ గా ప్రొడ్యూసర్ గా మారి ఒక సినిమా చేశాడు. కవిన్ హీరోగా తెరకెక్కిన బ్లడీ బెగ్గర్ సినిమాను నిర్మించాడు నెల్సన్. అక్టోబర్ 31న రిలీజైన ఈ సినిమా తీవ్ర పోటీ మధ్య డిజాస్టర్ గా నిలిచింది. దీపావళి కానుకగా తమిళ్ లో కూడా భారీగా సినిమాలు రిలీజ్ అయ్యాయి. అక్కడ దీవాళి రేసులో శివ కార్తికేయన్ అమరన్, దుల్కర్ సల్మాన్ లక్కీ భాస్కర్, జయం రవి బ్రదర్ తో పాటు కవిన్ బ్లడీ బెగ్గర్ రిలీజ్ చేశారు.
ఐతే బ్లడీ బెగ్గర్, బ్రదర్ సినిమాలకు అంత గొప్ప టాక్ రాలేదు. దుల్కర్ సల్మాన్ సినిమా పాన్ ఇండియా వైడ్ రిలీజై మంచి టాక్ తెచ్చుకుంది. ఇక అమరన్ విషయానికి వస్తే శివ కార్తికేయన్ బాక్సాఫీస్ స్టామినా ఏంటన్నది ఆ సినిమా ప్రూవ్ చేసింది. ఈ పోటీలో కవిన్ సినిమా డిజాస్టర్ గా నిలిచింది. సినిమాను 5 కోట్ల రూపాయల దాకా డిస్ట్రిబ్యూట్ చేయగా 2 కోట్ల దాకా లాస్ తెచ్చినట్టు తెలుస్తుంది.
డైరెక్టర్ గా నెల్సన్ సూపర్ హిట్ కాగా నిర్మాతగా అతని టేస్ట్ ఫెయిల్ అయ్యింది. ఐతే నెల్సన్ నిర్మాతగా కొనసాగించడం కన్నా క్రేజీ కాంబినేషన్స్ సెట్ చేసుకుంటే బెటర్ అని ఆడియన్స్ భావిస్తున్నారు. ప్రస్తుతం జైలర్ 2 డిస్కషన్స్ లో ఉంది. త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లబోతున్నట్టు తెలుస్తుంది. మరోపక్క ఎన్ టీ ఆర్ తో కూడా నెల్సన్ సినిమా చర్చల్లో ఉందని తెలుస్తుంది. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్స్ తెలుగు హీరోలపై ఎప్పుడు కన్నేసి ఉంటారు. ఐతే సరైన కథ పడితే మన స్టార్స్ కూడా వారితో చేసేందుకు రెడీ అనేలా ఉన్నారు.
తారక్ ప్రస్తుతం వార్ 2 షూటింగ్ లో ఉన్నాడు. త్వరలోనే ప్రశాంత్ నీల్ తో సినిమా స్టార్ట్ చేయనున్నాడు. ఇక దేవర 2 లైన్ లో ఉంది. నెల్సన్ తో సినిమా కన్ ఫర్మ్ అయితే మాత్రం ఆ ప్రాజెక్ట్ కి భారీ క్రేజ్ ఏర్పడే ఛాన్స్ ఉంటుంది. నెల్సన్ లాంటి యంగ్ డైరెక్టర్ తో ఎన్ టీ ఆర్ లాంటి స్టార్ పనిచేస్తే మంచి సినిమా బయటకు వస్తుందని చెప్పొచ్చు. మరి నెల్సన్ తో ఎన్ టీ ఆర్ సినిమా ఉంటుందా లేదా అన్నది చూడాలి.