Begin typing your search above and press return to search.

SSMB29 టీమ్‌కి ప్ర‌ధాన బ‌లం ఇత‌డే

ఒక హాలీవుడ్ సినిమాకి ఎంత‌మాత్రం త‌గ్గ‌కుండా బిజినెస్ రేంజ్ ఉండాల‌ని ప్లాన్ చేస్తున్నార‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.

By:  Tupaki Desk   |   17 Sep 2024 4:05 PM GMT
SSMB29 టీమ్‌కి ప్ర‌ధాన బ‌లం ఇత‌డే
X

మహేష్ బాబు తన తదుపరి చిత్రం షూటింగ్ ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నారు. దీనిని తాత్కాలికంగా SSMB29 అని టైటిల్ ని ఎంపిక చేసారు. ఈ చిత్రానికి సంబంధించిన అప్‌డేట్ ప్రకారం.. ఎస్ఎస్ రాజమౌళి ఈ చిత్రాన్ని పాన్ వ‌ర‌ల్డ్ సినిమాగా మ‌ల‌చాల‌ని ప్లాన్ చేస్తున్నారు. ఒక హాలీవుడ్ సినిమాకి ఎంత‌మాత్రం త‌గ్గ‌కుండా బిజినెస్ రేంజ్ ఉండాల‌ని ప్లాన్ చేస్తున్నార‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.

ఇది కేవ‌లం పాన్ ఇండియా వ‌ర‌కే ప‌రిమితం కాదు.. పాన్ వ‌ర‌ల్డ్ ని దృష్టిలో పెట్టుకుని రాజమౌళి ప్ర‌తిదీ ప్లాన్ చేస్తున్నారు! అంటూ ప‌లు మీడియా క‌థ‌నాలు వ‌చ్చిన‌ సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రం గ్లోబల్ ఫిల్మ్ అవుతుందని పేర్కొంటూ తెలుగు మీడియాలు క‌థ‌నాలు అల్లాయి. అయితే ఇది నిజ‌మే అనేందుకు మునుముందు ఈ సినిమా కోసం ఎంపిక చేసే సాంకేతిక నిపుణులు వెల్ల‌డించే అవ‌కాశం ఉంది.

తాజాగా అందిన స‌మాచారం మేర‌కు.. ఈ భారీ చిత్రానికి పిఎస్ వినోద్ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తారని తెలుస్తోంది. గ‌తంలో అల వైకుంఠ‌పుర‌ములో, విక్ర‌మ వేద‌, సీతారామం, గుంటూరు కారం వంటి క్లాసిక్ హిట్ చిత్రాల‌కు ఆయ‌న సినిమాటోగ్రాఫ‌ర్ గా ప‌ని చేసారు. తెలుగు-హిందీ ప‌రిశ్ర‌మ‌ల‌తో గొప్ప అనుబంధం కలిగి ఉన్న సినిమాటోగ్రాఫ‌ర్ అత‌డు. వినోద్ చేరిక‌తో మ‌హేష్ - రాజ‌మౌళి టీమ్‌కి బ‌లం పెరిగింది. ఈ సినిమా వీఎఫ్ఎక్స్- గ్రాఫిక్స్ కోసం అంత‌ర్జాతీయ నిపుణులు ప‌ని చేస్తార‌ని కూడా తెలుస్తోంది.

అలాగే ఈ చిత్రం క‌థాంశం ఆస‌క్తిక‌రంగా ఉంటుంద‌ని స‌మాచారం. ప్రపంచాన్ని కదిలించే అద్భుత‌మైన జంగిల్ అడ్వెంచ‌ర్ నేప‌థ్యంలో ఇది తెర‌కెక్క‌నుంది. మ‌హేష్ పాత్ర‌ హిందూ పురాణాలలోని హనుమంతుని పాత్ర నుంచి స్ఫూర్తి పొందిన‌ది అని కూడా టాక్ ఉంది. ఇప్ప‌టికే ఈ చిత్రానికి రాజ‌మౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ కథను సిద్ధం చేసారు. అంతేకాకుండా నటీనటుల ఎంపిక ఇంకా కొనసాగుతోంది. మలయాళ సూపర్ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన ప్రతినాయకుడిగా నటించే అవకాశం ఉందని పుకార్లు ఉన్నాయి. అయితే ఈ చిత్రానికి సంబంధించిన నటీనటుల ఎంపికపై అధికారిక ధృవీకరణ ఇంకా మిగిలి ఉంది.