Begin typing your search above and press return to search.

స‌ర‌దాగా ఉండే సినీజ‌ర్న‌లిస్టులు.. హీరో కాంప్లిమెంట్

తెలుగు ఫిలిం జర్నలిస్ట్ అసోసియేషన్ (TFJA) ఆధ్వర్యంలో స్టార్ హాస్పిటల్ సౌజన్యంతో మల్టీ సూపర్ స్పెషాలిటీ హెల్త్ క్యాంప్ ఈరోజు ఫిలిం ఛాంబర్ లో నిర్వహించారు.

By:  Tupaki Desk   |   1 Feb 2025 10:20 AM GMT
స‌ర‌దాగా ఉండే సినీజ‌ర్న‌లిస్టులు.. హీరో కాంప్లిమెంట్
X

తెలుగు ఫిలిం జర్నలిస్ట్ అసోసియేషన్ (TFJA) ఆధ్వర్యంలో స్టార్ హాస్పిటల్ సౌజన్యంతో మల్టీ సూపర్ స్పెషాలిటీ హెల్త్ క్యాంప్ ఈరోజు ఫిలిం ఛాంబర్ లో నిర్వహించారు. తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ (TFDC) చైర్మన్ దిల్ రాజు, ప్రముఖ హీరో విశ్వక్ సేన్ గారి చేతుల మీదుగా క్యాంప్ ప్రారంభమైంది..


టిఎఫ్‌డిసి ఛైర్మన్, ప్ర‌ముఖ నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ-``నిత్యం బిజీగా ఉండే ఫిలిం జర్నలిస్టులు ఆరోగ్యంపై అవగాహన , శ్రద్ధ అవసరం కాబట్టి ఇలాంటి క్యాంపులు వల్ల మరింత ఆరోగ్యంగా ఉండేందుకు ఉపయోగపడతాయ``ని అన్నారు. ప్రముఖ హీరో విశ్వక్ సేన్ మాట్లాడుతూ ''మా అందరితో సరదాగా ఉండే జర్నలిస్టులు ఎప్పుడు అదే విధంగా ఉండాలి అంటే దానికి హెల్త్ క్యాంపులు మరింత ఉపయోగపడతాయని అన్నారు''.


ఈ కార్యక్రమంలో స్టార్ హాస్పిటల్ సి.ఓ.ఓ భాస్కర్ రెడ్డి , తెలుగు ఫిలిం జర్నలిస్ట్ అసోసియేషన్ తో ఒక ఏం.ఓ.యు కుదుర్చుకున్నారు. కార్య‌క్ర‌మంలో తెలుగు సినీ జ‌ర్న‌లిస్టులు పాల్గొన్నారు.