బిగ్ బాస్ 8 : గంగవ్వకు హార్ట్ స్ట్రోక్.. అసలు నిజం ఇదేనా..?
ఐతే ఆ సీజన్ లో ఏ వారం బయటకు వచ్చిందో ఈ సీజన్ లో అప్పుడే హౌస్ లోకి వచ్చింది.
By: Tupaki Desk | 22 Oct 2024 12:22 PM GMTబిగ్ బాస్ సీజన్ 8 లో వన్ ఆఫ్ ది స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా కొనసాగుతున్న గంగవ్వ హెల్త్ ఇష్యూపై ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద చర్చ నడుస్తుంది. బిగ్ బాస్ సీజన్ 8 లో వైల్డ్ కార్డ్ ఎంట్రీగా ఐదు వారాల తర్వాత హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చింది గంగవ్వ. అంతకుముందు ఆమె బిగ్ బాస్ సీజన్ 4లో ఒక కంటెస్టెంట్ గా వచ్చింది. ఐతే అప్పుడు ఐదు వారాల తర్వాత హౌస్ నుంచి స్వయంగా తనంతట తానే బయటకు వచ్చేసింది. ఐతే ఆ సీజన్ లో ఏ వారం బయటకు వచ్చిందో ఈ సీజన్ లో అప్పుడే హౌస్ లోకి వచ్చింది.
బిగ్ బాస్ సీజన్ 8 లో గంగవ్వ ఎంట్రీ ఆడియన్స్ కు షాక్ ఇచ్చింది. 70 ప్లస్ ఏజ్ లో ఆమె బిగ్గెస్ట్ రియాలిటీ షోలో రెండోసారి వచ్చినందుకు అందరు సర్ ప్రైజ్ అవుతున్నారు. ఈ ఏజ్ లో ఆమె పెడుతున్న ఎఫర్ట్ చూసి అందరు అవాక్కవుతున్నారు. ఇక ఈ సీజన్ లో ఐదో వారం బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చిన గంగవ్వ టాస్కులు పెద్దగా ఆడకపోయినా జనాలు ఆమెను సేవ్ చేస్తూ వస్తున్నారు.
ఆమె హౌస్ లోకి వచ్చి 3 వారాలు అవుతుంటే ఒకసారి మాత్రమే నామినేషన్స్ లో ఉంది. ఐతే లేటెస్ట్ గా గంగవ్వ హెల్త్ బాగాలేదని ఆమెకు హౌస్ లో హార్ట్ స్ట్రోక్ వచ్చిందని సోషల్ మీడియాలో హడావిడి జరుగుతుంది. కొందరు గంగవ్వ హెల్త్ ఇష్యూ అంతా ఒక టాస్క్ లో భాగమని అంటున్నారు. ఐతే ఈ ఇష్యూపై గంగవ్వ మై విలేజ్ షో టీం సభ్యులను సంప్రదిస్తే అలాంటిది ఏమి లేదని క్లారిటీ ఇచ్చారు.
సో హౌస్ లో గంగవ్వ తన మార్క్ ఆట ఆడుతుంది. ఐతే తన గురించి ఇలాంటి నెగిటివ్ ప్రచారం చేయడం వల్ల ఎవరికి ఏం వతుందో తెలియదు కానీ ఈ వయసులో బిగ్ బాస్ హౌస్ లో ఆమె పెడుతున్న ఎఫర్ట్స్ కి సూపర్ అనేయాల్సిందే. గంగవ్వ కి హార్ట్ స్ట్రోక్ అన్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని అదీగాక హౌస్ లో ఉన్న వారంతా కూడా గంగవ్వను చాలా ప్రేమగా చూసుకుంటున్నారు. బిగ్ బాస్ ఇంట్లో అన్ని కెమెరాలను టీం అంతా ఎప్పటికప్పుడు చూస్తూనే ఉంటారు. కాబట్టి గంగవ్వకు ఏమాత్రం ఇబ్బంది కలిగినా వెంటనే అక్కడ టీం అలర్ట్ అవుతుందని తెలుస్తుంది.