Begin typing your search above and press return to search.

ఎర్రటి చీరలో కుమారి పాప.. స్టన్నింగ్!

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న నటి హెబ్బా పటేల్.

By:  Tupaki Desk   |   7 Sep 2024 2:30 PM GMT
ఎర్రటి చీరలో కుమారి పాప.. స్టన్నింగ్!
X

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న నటి హెబ్బా పటేల్. స్టార్ హీరోయిన్ ట్యాగ్ ను దక్కించుకోకపోయినా, యూత్ లో ఆమెకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కుమారి 21 ఎఫ్ సినిమాలో తన ఆకర్షణీయమైన అభినయంతో అందరినీ ఆకట్టుకుని, కుర్రకారును ఫిదా చేసింది. ఆ సినిమా తర్వాత వరుస ఆఫర్లు వచ్చినా, బిగ్ హిట్స్ సాధించడంలో తడబడింది.

అయితే ఈడో రకం ఆడో రకం, ఎక్కడికి పోతావు చిన్నవాడ, నాన్న నేను నా బాయ్‌ ఫ్రెండ్స్, అందగాడు, మిస్టర్, 24 కిస్సెస్ వంటి చిత్రాల్లో తన నటనలో ఉన్న వైవిధ్యాన్ని చూపించింది. ఇటీవల ఓదెల రైల్వే స్టేషన్ సినిమాతో మంచి హిట్ అందుకోవడంతో, ఆడియన్స్ మళ్లీ ఆమె వైపు చూస్తున్నారు. అలాగే, గీత, శాసనసభ, హనీమూన్ ఎక్స్‌ప్రెస్ సినిమాలతో కూడా మంచి గుర్తింపు పొందింది.

సినిమాలతో బిజీగా గడుపుతున్నా కూడా హెబ్బా సోషల్ మీడియాలో మరింత యాక్టివ్ గా ఉంటుంది. ప్రతి రోజూ తన పర్సనల్ లైఫ్, సినిమా అప్‌డేట్స్ పిక్స్, వీడియోలతో అభిమానులను ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా తన అందం, ఫ్యాషన్‌ స్టేట్మెంట్‌తో ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంది. రకరకాల డ్రెస్సుల్లో స్టైలిష్ ఫొటోషూట్స్ చేస్తూ, ఆ ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తుంది.

తాజాగా పంచుకున్న పిక్స్ తో మరోసారి నెటిజన్లను ఆకట్టుకుంది. ఎర్రటి చీరలో తన అందాన్ని నాజూకుగా ప్రదర్శిస్తూ, డీసెంట్ గా కనిపిస్తూ మైమరిపించింది. ఈ పిక్స్ క్షణాల్లో వైరల్ అవ్వడంతో అభిమానులు లైకులు కొడుతూ కామెంట్స్ పెడుతున్నారు. హెబ్బా ఇలాంటి పిక్ షేర్ చేసినప్పుడల్లా నెటిజన్లు, అభిమానులు తెగ హుషారుగా స్పందిస్తుంటారు. ఇలా సోషల్ మీడియాలో హెబ్బా పటేల్ తన స్టైలిష్ అవతారాలతో ఎప్పటికప్పుడు ఫాలోవర్స్ ను పెంచుకుంటోంది.