Begin typing your search above and press return to search.

క్రిటిక్స్ పై మరో హీరో గరంగరం..

ఇటీవల సొంతం ప్రొడక్షన్ హౌస్ లోనే ఎక్కువ సినిమాలు చేయడం మొదలు పెట్టాడు.

By:  Tupaki Desk   |   20 April 2024 1:32 PM GMT
క్రిటిక్స్ పై మరో హీరో గరంగరం..
X

కోలీవుడ్ లో హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకుంటూ వరుస మూవీస్ తో దూసుకుపోతున్న నటుడు విజయ్ ఆంటోనీ. మ్యూజిక్ డైరెక్టర్ గా కెరియర్ స్టార్ట్ చేసిన విజయ్ ఆంటోనీ తరువాత హీరోగా మారి సినిమాలు చేస్తున్నాడు. ఇటీవల సొంతం ప్రొడక్షన్ హౌస్ లోనే ఎక్కువ సినిమాలు చేయడం మొదలు పెట్టాడు. విజయ్ ఆంటోనీ కెరియర్ లో బెస్ట్ మూవీ అంటే బిచ్చగాడు. ఈ సినిమా అతని ఇమేజ్ ని అమాంతం పెంచేసింది.


బిచ్చగాడు 2 కూడా కమర్షియల్ హిట్ అయ్యింది. ఆ సినిమా తర్వాత విజయ్ ఆంటోనీ మరో రెండు డిఫరెంట్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకి వచ్చాడు. అయితే ఆ రెండు బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయ్యాయి. ఇక రీసెంట్ గా రోమియో అనే సినిమాతో ఫ్యామిలీ ఎంటర్టైనర్ కథ చేశాడు. ఈ సినిమా థియేటర్స్ లో రిలీజ్ అయ్యి యావరేజ్ టాక్ సొంతం చేసుకుంది. తెలుగులో లవ్ గురు టైటిల్ తో ఈ మూవీ రిలీజ్ అయ్యింది.

ఇదిలా ఉంటే సినిమాకి సినీ క్రిటిక్స్ నుంచి కూడా మిక్స్ డ్ రివ్యూలు వచ్చాయి. దీంతో విజయ్ ఆంటోనీ రివ్యూలు రాసేవారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. ప్రేక్షకులని తప్పుదోవ పట్టించే విధంగా రివ్యూలు రాయడం కరెక్ట్ పద్ధతి కాదని విజయ్ ఆంటోనీ పేర్కొన్నారు. సినిమా చూసిన తర్వాత ప్రేక్షకులు వారికి వారుగా సొంత అభిప్రాయాలు కలిగి ఉండేలా ప్రోత్సహించాలని, నెగిటివ్ రివ్యూలు ఇచ్చి మంచి సినిమాలని నాశనం చేయకూడదని అన్నారు.

గతంలో కమల్ హాసన్, మాధవన్ కాంబినేషన్ లో వచ్చిన అవనే శివమ్ కమర్షియల్ గా ఫ్లాప్ అయిన విమర్శకుల ప్రశంసలు సొంతం చేసుకుంది. ఆ సినిమా తరహాలోనే రోమియో సినిమాని నాశనం చేయొద్దని పేర్కొన్నారు. రోమియో మూవీ అన్ని వర్గాలకి నచ్చే సినిమా అని, కచ్చితంగా ప్రతి ఒక్కరు థియేటర్స్ కి వెళ్లి చూడాలని ఆడియన్స్ కి విజయ్ ఆంటోనీ రిక్వెస్ట్ చేశారు. రివ్యూలు చూసి మోసపోవద్దు అంటూ సూచించారు.

ఈ మధ్యకాలంలో సినీ హీరోలు, దర్శక, నిర్మాతలు క్రిటిక్స్ పై విభిన్నమైన అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు పాజిటివ్ గా కూడా కూడా రియాక్ట్ అవుతున్నారు. కొన్నిసార్లు రివ్యూల ద్వారా కూడా సినిమాలకు మంచి జరుగుతుందను మంచి సినిమాలకు సపోర్ట్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయని అంటున్నారు. సోషల్ మీడియాలో నెటిజన్ల నుంచి కూడా రివ్యూలపై వివిధ రకాల అభిప్రాయాలు వస్తున్నాయి. ఒక చెడ్డ సినిమాకు 100 పాజిటివ్ రివ్యూలు వచ్చిన అది సక్సెస్ కాలేదు.. అలాగే ఒక మంచి సినిమాకు 1000 నెగిటివ్ రివ్యూలు వచ్చినా కూడా దాని సక్సెస్ ను ఎవరు ఆపలేరు.. అని మరి కొందరు కామెంట్ చేస్తున్నారు.