Begin typing your search above and press return to search.

హిట్‌ బొమ్మ కి సీక్వెల్‌ ప్రకటన వచ్చింది!

నెట్‌ఫ్లిక్స్‌ లో స్ట్రీమింగ్‌ అవుతున్న హీరామండి ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో ట్రెండ్‌ లో టాప్‌ లో నిలిచింది.

By:  Tupaki Desk   |   3 Jun 2024 10:38 AM GMT
హిట్‌ బొమ్మ కి సీక్వెల్‌ ప్రకటన వచ్చింది!
X

హిందీ ప్రేక్షకులతో పాటు మొత్తం ఇండియన్ సినీ మరియు ఓటీటీ ప్రేక్షకులు గత నెల రోజులుగా దిగ్గజ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో రూపొంది స్ట్రీమింగ్‌ అవుతున్న హీరామండి వెబ్ సిరీస్ గురించి మాట్లాడుకుంటున్నారు. భన్సాలీ సినిమా అంటే భారీతనం కు పెట్టింది పేరు అనే విషయం తెల్సిందే.

తన వెబ్‌ సిరీస్‌ కూడా అందుకు మినహాయింపు కాదు అన్నట్లుగా సొంత బ్యానర్‌ లో సంజయ్ లీలా భన్సాలీ ఏకంగా రూ.200 కోట్లు ఖర్చు చేసి హీరామండి సినిమాను రూపొందించిన విషయం తెల్సిందే. నెట్‌ఫ్లిక్స్‌ లో స్ట్రీమింగ్‌ అవుతున్న హీరామండి ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో ట్రెండ్‌ లో టాప్‌ లో నిలిచింది.

హీరామండి సూపర్‌ హిట్‌ నేపథ్యంలో మేకర్స్ నుండి సీజన్ 2 కి ప్రకటన వచ్చింది. సీజన్‌ 2 లో కొన్ని కొత్త పాత్రలు ఉంటాయి తప్ప మిగిలిన కథ మొత్తం కూడా సీజన్‌ 1 లో ఉన్న పాత్రధారుల చుట్టూ తిరుగుతూ ఉంటుందని మేకర్స్‌ అనఫిషియల్‌ గా చెబుతున్నారు.

సీజన్ 2 కి సంబంధించిన ప్రకటన కోసం విడుదల చేసిన పోస్టర్ అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. పోస్టర్‌ లో ప్రధాన తారాగణం గా కనిపించబోతున్న హీరోయిన్స్ అంతా కూడా ఉన్నారు. ఈ ముద్దుగుమ్మలతో మరోసారి సీజన్‌ 2 ఖచ్చితంగా సూపర్‌ హిట్‌ కొట్టడం ఖాయంగా ఉంది.

సాధారణంగా సినిమా హిట్ అయితే ఈ మధ్య కాలంలో సీక్వెల్‌ తీస్తున్నారు. అలాగే హిట్‌ బొమ్మగా నిలిచిన హీరామండి కి సీక్వెల్‌ గా ఓటీటీ సీజన్ 2 రాబోతున్న నేపథ్యంలో అంచనాలు భారీగా ఉన్నాయి. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా భన్సాలీ హీరామండి 2 ను తీసుకు వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.