Begin typing your search above and press return to search.

చ‌రిత్ర‌ని భ‌న్సాలీ లోతుగానే త‌వ్వాడే!

సిరీస్ లో ఆర్ట్ వ‌ర్క్ ఎంతో గొప్ప‌గా క‌నిపిస్తుంది. స్టోరీలో డ్రామా ఎంత‌గా హైలైట్ అవుతుంద‌న్న‌ది తెలియ‌దుగానీ.. ఇదొక గొప్ప స‌క్సెస్ ఫుల్ సిరీస్ గా నిలుస్తుంద‌ని గెస్సింగ్స్ మాత్రం బ‌లంగానే క‌నిపిస్తు న్నాయి.

By:  Tupaki Desk   |   1 Feb 2024 1:29 PM GMT
చ‌రిత్ర‌ని భ‌న్సాలీ లోతుగానే త‌వ్వాడే!
X

క‌ళాత్మక చిత్రాల ద‌ర్శ‌కుడు సంజయ్ లీలా భ‌న్సాలీ నుంచి సినిమా రిలీజ్ అయి రెండేళ్లు స‌మీపిస్తుంది. 'గంగూబాయి క‌తియావాడి' త‌ర్వాత భ‌న్సాలీ నుంచి మ‌రో సినిమా రాలేదు. ఎలాంటి సినిమా ప్ర‌క‌ట‌న కూడా రాలేదు. అప్పటి నుంచి రిలీజ్ వ‌ర‌కూ నెట్ ప్లిక్స్ సిరీస్ 'హిరామండి'ప‌నుల్లోనే బిజీ అయ్యారు. అదితిరావు హైద‌రీ..సోనాక్షి సిన్హా.. మ‌నీషా కోయిరాలా.. రిచా చ‌ద్దా..ష‌ర్మిన్ ప్ర‌ధాన పాత్ర‌లు పోషిస్తున్న సిరీస్ ను భ‌న్సాలీ శిల్పంలా చెక్కుతున్న‌ట్లే క‌నిపిస్తుంది. ఇప్ప‌టికే రిలీజ్ అయిన ప్ర‌చార చిత్రాల‌తో సిరీస్ కి మంచి బ‌జ్ క్రియేట్ అయింది.

సిరీస్ లో ఆర్ట్ వ‌ర్క్ ఎంతో గొప్ప‌గా క‌నిపిస్తుంది. స్టోరీలో డ్రామా ఎంత‌గా హైలైట్ అవుతుంద‌న్న‌ది తెలియ‌దుగానీ.. ఇదొక గొప్ప స‌క్సెస్ ఫుల్ సిరీస్ గా నిలుస్తుంద‌ని గెస్సింగ్స్ మాత్రం బ‌లంగానే క‌నిపిస్తు న్నాయి. హీరామండి అంటే వేశ్య‌నాటిక‌. పాకిస్తాన్ లాహోర్ అందుకు ప్ర‌సిద్ది చెందిన న‌గ‌రం. వజ్రాల వ్యాపారానికి ప్రసిద్ధి చెందిన ప్రాంతంలో ప‌డుపు వృత్తి ఎలా జ‌రిగేది అనేది దానికి చాలా చ‌రిత్ర ఉంది. 16వ శ‌తాబ్ధం త‌ర్వాత అహ్మద్ షా అబ్దాలా హయాంలో అమ్మాయిలను వృత్తిలోకి దింపిన‌ట్లు చారిత్మాత్మ‌క ఆధారాలున్నాయి.

క్ర‌మంగా ఆ వ్యాపారం ఎలా వృద్ది చెందింది? కోట్ల‌కు ఎలా ప‌డగెత్తిందో? నేటి స‌న్నివేశాల్ని చూస్తేనే ఆనాడు ఆ వృత్తికి ఎంత‌గా పునాది ప‌డింద‌న్న‌ది అద్దం ప‌డుతుంది. ఈ క‌థ‌కి భ‌న్సాలీ క్రియేటివిటీని అద్ది ఎంతో అద్భుతంగా చూపించ‌డానికి రెడీ అవుతున్నాడు. విజువ‌ల్ గానూ హైలైట్ చేస్తున్న‌ట్లు తెలుస్తుంది. ఈ క‌థ కోసం భ‌న్సాలీ చాలా కాలం పాటు రీసెర్చ్ చేసి రాసుకున్న క‌థ‌లా బాలీవుడ్ వ‌ర్గాలు పేర్కోటున్నాయి. దాదాపు 15 ఏళ్ల‌గా ఆ క‌థ‌పై క‌స‌రత్తులు చేసి చివ‌రికి ఓ వెబ్ సిరీస్ గా తీసుకొస్తున్న‌ట్లు తెలుస్తుంది.

హీరామండి ఆరుగురు వేశ్యల చుట్టు తిరిగే కథ. భార‌త్-పాకిస్తాన్ ఏర్ప‌డ‌క ముందు క‌థ‌ని నేటి జ‌న‌రేష‌న్ కి చెప్ప‌డం గొప్ప విశేషం. అప్పుడు రెండు దేశాలు ఎలా క‌లిసి ఉండేయి? అన్న‌ది కూడా ఇందులో చ‌ర్చించే అవ‌కాశం ఉంది. భ‌న్సాలీ రీసెర్చ్ ని బ‌ట్టి చూస్తుంటే తొలుత ఈ క‌థ‌ని సినిమాగా తీసుకురావా ల‌ని భావించిన‌ట్లు తెలుస్తుంది. కానీ మూడు గంటల్లో చెప్ప‌డానికి వీలున్న క‌థ కాక‌పోవ‌డంతో వెబ్ సిరీస్ గా మలుస్తున్న‌ట్లు తెలుస్తోంది.