హిట్టైన వెబ్ సిరీస్ పై నెగిటివ్ ప్రచారం!
సంజయ్ లీలా భన్సాలీ వెబ్ సిరీస్ 'హీరమండి ది డైమండ్ బజార్' తో భారీ సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే
By: Tupaki Desk | 9 May 2024 6:12 AM GMTసంజయ్ లీలా భన్సాలీ వెబ్ సిరీస్ 'హీరమండి ది డైమండ్ బజార్' తో భారీ సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. తొలి సిరిస్ తోనే బన్సాలీ మార్క్ వెబ్ సిరీస్ లపై పడింది. కళాత్మకత చిత్రాల దర్శకుడు అన్నందుకు అందుకు ఏ మాత్రం తగ్గకుండానే సిరీస్ ఉంది. నెట్ ప్లిక్స్ సిరీస్ లలో ఇప్పుడిది ట్రెండింగ్ లో నిలిచింది. అతి తక్కువ సమయంలోనే అగ్ర స్థానానికి చేరుకున్న సిరీస్ గా రికార్డు సృష్టించింది. 200 కోట్ల పెట్టుబడి ఏమాత్రం ఎక్కువ కాదని బన్సాలీ తన మార్క్ మేకింగ్ తో ప్రూవ్ చేసారు.
మొదటి వారంలో నెట్‌ఫ్లిక్స్‌లో అత్యధికంగా వీక్షించబడిన భారతీయ సిరీస్ గా రికార్డు సృష్టించింది. 43 దేశాలలో టాప్ 10 వెబ్ సిరీస్ లలో ఒకటిగా నిలిచింది. అంతేకాదు ఆంగ్లేతర టీవీ జాబితాలో రెండవ స్థానంలో నిలిచింది. వరల్డ్ వెబ్ సిరీస్ లతో 'హీరమండి' పోటీలో నిలిచింది. తొలి వారంలో 'ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో' వంటి ప్రముఖ షోలను మరియు అంతర్జాతీయ నెట్‌ఫ్లిక్స్ ప్రొడక్షన్‌ల సిరీస్ లను సైతం అధిగమించగలిగింది.
ఇదంతా ఒకవైపు అయితే ఇదే సిరీస్ పై సోషల్ మీడియాలో నెగివిటీ కూడా అలాగే స్ప్రెడ్ అవుతుంది. నెట్టింట జరుగుతోన్న నెగిటివ్ ప్రచారానికి-వెబ్ సిరీస్ సక్సెస్ కి ఏమాత్రం సంబంధం లేకుండా సన్నివేశం కనిపిస్తుంది. ఈ సిరీస్ పై కావాలనే పనిగట్టుకుని నెగిటివ్ చేస్తున్నట్లు తెలుస్తుంది. స్క్రీన్ ప్లే లోపాలు లేకపోయినా ఉన్నట్లు తప్పుడు ప్రచారం జరుగుతోంది. వెబ్ సిరీస్‌పై నెగిటివిటీని వ్యాప్తి చేయడానికి ఏదో ఎజెండా ఉన్నట్లు తెలుస్తోంది.
అలాగే ఈ సిరీస్‌తో పాకిస్తాన్ వేశ్యలను కీర్తిస్తున్నారనే కారణంతో కొందరు సిరీస్‌పై వ్యక్తిగత ద్వేషాన్ని వ్యాప్తి చేస్తున్నట్లు మీడియా కథనాలు వెడెక్కిస్తున్నాయి. ఓవెబ్ సిరీస్ కి 200 కోట్లు పెట్టడం అన్నది వృద్దా ప్రయత్నంగా చెబుతున్నారు. ఈ సిరీస్ కి 200 కోట్లు అవసరమా? అంటూ హేళనగానూ మాట్లాడుతున్నారు. అయితే ఈ రకమైన నెగిటివిటీ భవిష్యత్ లో భారీ బడ్జెట్ వెబ్ సిరీస్ లపై ప్రతికూల ప్రభావం చూపిస్తుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇండియన్ ఓటీటీ మార్కెట్ ని దెబ్బ తీసేలా కొందరు కావాలనే పనిగట్టుకుని చేస్తున్నట్లు హీరమండి యూనిట్ భావిస్తోంది. నెగిటివ్ ప్రచారంతో మీరు సాధించేది ఏమి ఉండదంటూ బధులిచ్చింది.