'ఖుషీ' కోసం రెండేళ్లు ..ఇది శివ పనేనా?
సంగీతానికి ఎక్కువగా ప్రాధాన్యం ఉన్న సినిమా అని శివ చెప్పడంతో ఎక్కువ ఎఫెర్ట్ పెట్టి పనిచేసినట్లు తెలిపారు.
By: Tupaki Desk | 28 Aug 2023 6:12 AM GMTవిజయ్ దేవరకొండ -సమంత జంటగా నటిస్తోన్న 'ఖుషీ' సినిమా పాటలు శ్రోతల్ని అలరిస్తోన్న సంగతి తెలిసిందే. అన్ని మెలోడీలకు సంగీత ప్రియులు కనెక్ట్ అయ్యారు. ఇక ఈ సినిమాలో పాటలన్నీ కూడా చిత్ర దర్వకుడు శివ నిర్వాణ రాసాడు. సాహిత్య పరంగా పాటలు హైలైట్ అవుతున్నాయి. దీంతో శివ మంచి దర్శకుడే కాదు...అంతకు మించి గొప్ప సాహిత్యకారుడిగానూ నీరాజనాలు అందుకుంటున్నాడు.
ఆయన గత సినిమాలు కూడా మ్యూజికల్ గా మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే. 'నిన్నుకోరి'..'మజిలీ' మ్యూజికల్ రిలీజ్ కి ముందే బ్లాక్ బస్టర్. తాజాగా ఖుషీ విషయంలోనూ అదే రిపీట్ అయింది. ఇక ఈ సినిమాకి సంగీతాన్ని మలయాళ దర్శకుడు హిషమ్ అబ్దుల్లా వహబ్ అందించారు. మలయాళంలో 'సాల్ట్ మ్యాంగో ట్రీ' అనే సినిమాకి తొలిసారి మ్యూజిక్ అందించాడు.
ఆ తర్వాత అక్కడే కొన్ని సినిమాలకు పనిచేసాడు. దీంతో అతను శివ దృష్టిలో పడ్డాడు. హిషమ్ లో విషయం గ్రహించా టాలీవుడ్ కి తెచ్చాడు. అయితే ఖుషీ లో ఇన్ని మంచి పాటలు వచ్చాయంటే? హిషమ్ చాలా కష్టపడినట్లు తెలుస్తోంది. ఈ సినిమా కోసం ఏకంగా రెండేళ్లు కేటాయించారుట. ఇప్పటివరకూ ఏ సినిమాకు ఇలా పనిచేయలేదని.. సంగీతానికి ఎక్కువగా ప్రాధాన్యం ఉన్న సినిమా అని శివ చెప్పడంతో ఎక్కువ ఎఫెర్ట్ పెట్టి పనిచేసినట్లు తెలిపారు.
హీరో మణిరత్నం అభిమాని కావడంతో 'రోజా' సినిమాలో నా రోజా నువ్వు పాటలో మణిరత్నం టైటిల్స్ అన్ని వాడేసారుట. ఈ ఐడియా కూడా శివదేనట. ట్యూన్స్ క్యాచీగా వచ్చాయంటే దానికి కారణం శివ. అతను పాటలు చక్కగా రాయడంతో ఇలాంటి ఔట్ ఫుట్ వచ్చిందని తెలిపారు. యువత పల్స్ పట్టుకుని విజయ్-శివ ట్యూన్స్ చేయించుకున్నారు. వాళ్ల వల్ల మంచి సంగీతం కుదిరింది' అని అన్నారు.
ఇక సినిమా కూడా హిట్ అయితే హిషమ్ అబ్దుల్లా ఇక్కడ బిజీ సంగీత దర్శకుడు అవుతాడు అనడంలో డౌట్ లేదు. మెలోడీ పాటలకు టాలీవుడ్ ఎప్పుడూ ఫిదా అవుతుంది. గోపీ సుందర్ లాంటి వాళ్లు అలా వచ్చి సక్సెస్ అయినవాళ్లే. ఇక్కడ మెలోడీ మ్యూజిక్ డైరెక్టర్ల కొరత ఎలాగూ ఉంది. మంచి ప్రేమ కథలకి హృదయాన్ని హత్తుకునే సంగీతం ఇవ్వడం అన్నది కష్టంగానే ఉంది.