Begin typing your search above and press return to search.

నాక్కావాల్సింది లాక్కొని తెచ్చుకుంటా..!

టీజర్ రిలీజ్ ఈవెంట్ లో రోషన్ కాన్ఫిడెన్స్ కూడా బాగుంది. టీజర్ రిలీజ్ ఈవెంట్ లో మీడియా అన్నయ్యలు, బాబాయ్ లు నమస్కారం అన్నాడు రోషన్

By:  Tupaki Desk   |   10 Oct 2023 11:21 AM GMT
నాక్కావాల్సింది లాక్కొని తెచ్చుకుంటా..!
X

రాజీవ్ కనకాల, సుమ కుమారుడు రోషన్ హీరోగా రవికాంత్ పేరేపు దర్శకత్వంలో వస్తున్న సినిమా బబుల్ గం. ఈ సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తుంది. సినిమా టీజర్ దర్శకధీరుడు ఎస్.ఎస్ రాజమౌళి చేతుల మీదుగా రిలీజ్ చేశారు. టీజర్ రిలీజ్ ఈవెంట్ కార్యక్రమంలో న్యాచురల్ స్టార్ నాని చీఫ్ గెస్ట్ గా వచ్చారు. క్షణం, కృష్ణ అండ్ హిస్ లీల సినిమాలతో రవికాంత్ పేరేపు దర్శకుడిగా తన మార్క్ చూపించాడు. కొద్దిపాటి గ్యాప్ తర్వాత రోషన్ తో బబుల్ గమ్ చేస్తున్నాడు.

ఈ సినిమా టీజర్ చూస్తే పక్కా యూత్ ఎంటర్టైనర్ గా రాబోతుందని అర్ధమవుతుంది. టీజర్ రిలీజ్ ఈవెంట్ లో రోషన్ కాన్ఫిడెన్స్ కూడా బాగుంది. టీజర్ రిలీజ్ ఈవెంట్ లో మీడియా అన్నయ్యలు, బాబాయ్ లు నమస్కారం అన్నాడు రోషన్. తను చిన్నప్పటి నుంచి దగ్గరగా చూశా కాబట్టి మీడియా వాళ్లంతా తనకు అన్నయ్యలు, బాబాయ్ లని అన్నాడు. ఎలా మాట్లాడినా బాగా మాట్లాడా అని రాయడని జోక్ చేశాడు.

టీజర్ రిలీజ్ ఈవెంట్ కి వచ్చిన నాని అన్నకు థాంక్స్. మాలాంటి వారికి ఎంతోమందికి నాని అన్న స్పూర్తిగా నిలిచారని అన్నాడు రోషన్. ప్రైడ్ ఆఫ్ ఇండియన్ సినిమా రాజమౌళి గారు టీజర్ రిలీజ్ చేయడం సంతోషంగా ఉంది. ఆయన సినిమాల ఇంప్యాక్ట్ తనపై చాలా ఉందని అన్నారు. ఈరోజు బర్త్ డే జరుపుకుంటున్న రాజమౌళి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపాడు రోషన్.

ఈ సినిమా నిర్మాతలు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారికి థాంక్స్. సినిమాపై నమ్మకం పెట్టి బాగా సపోర్ట్ చేశారని అన్నాడు రోషన్. ఇక బ్రదర్, లవర్ డైరెక్టర్ రవికాంత్ పేరేపు వల్లే ఇదంతా సాధ్యమైందని. టీజర్ లోని డైలాగ్స్ కూడా అతను నా చేత చెప్పించాడని అన్నారు. వైజాగ్ లో అలలు ఆని వెనక రవికాంత్ కథలు అని అన్నారు. నాతో ఈ సినిమా చేసినందుకు థాంక్స్ అని అన్నారు. శ్రీ చరణ్ పాకాల మ్యూజిక్ చితక్కొట్టేశాడని అన్నారు.

హీరోయిన్ మానస సినిమాలో జాన్వి పాత్రలో నటించింది. ఆది లానే జాన్వి పాత్రకు మీరంతా లవ్ లో పడిపోతారని అన్నాడు రోషన్. తన వెనక ఉండి ప్రోత్సహించిన అమ్మ నాన్నకు థాంక్స్ చెప్పాడు రోషన్. తాతయ్య ఆశీర్వాదం తనతో ఎప్పుడు ఉంటుందని అన్నారు. ఇక సినిమా ఆడాలన్నీ.. చేయాలన్నా అది ప్రేక్షకుల వల్లే జరుగుతుందని ప్రేక్షక దేవుళ్లకు థాంక్స్ అని అన్నారు. ఫైనల్ గా సినిమాలోని డైలాగ్ నాక్కావాల్సింది లాక్కొని తెచ్చుకుంటా అది ఇజ్జత్ అయినా ఔకత్ అయినా అని చెబుతాడు. మొదటి సినిమానే అయినా రోషన్ స్టేజి మీద మాట్లాడిన తీరు ఇంప్రెస్ చేసింది.