ట్రీట్ ఇవ్వడానికి ఆయన రెడీ..మీరు సిద్దమేనా?
నవంబర్ 2న షారుక్ పుట్టిన రోజు సందర్భంగా అభిమానులకు హిరాణీ బిగ్ ట్రీట్ ఇవ్వబోతున్నారు.
By: Tupaki Desk | 2 Nov 2023 12:30 AM GMT'పఠాన్'..'జవాన్' లతో షారుక్ ఖాన్ పుల్ స్వింగ్ లో ఉన్నాడు. `డంకీ`తో హ్యాట్రిక్ అందుకుని 2023 లో రికార్డు సృష్టించాలని చూస్తున్నాడు. అదే జరిగితే బాలీవుడ్ లో సంచలనమే. వరుస విజయాలు షారుక్ రేంజ్ ని మరోసారి పతాక స్థాయికి చేర్చినట్లు అవుతుంది. అందుకు తగ్గట్టే డంకీని కూడా ఆషామాషీ దర్శకుడు తెరకెక్కించడం లేదు. బాలీవుడ్ మెస్ట్ వాంటెడ్ డైరెక్టర్ గా పేరుగాంచిన రాజ్ కుమార్ హీరాణి ఆ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు.
ఆయన సినిమా వసూళ్లలో బాలీవుడ్ నే షేక్ చేసిన గ్రేట్ మేకర్. దీంతో డంకీ పై అంచనాలు భారీగానే ఉన్నాయి. అయితే ఈ సినిమా ప్రారంభం నుంచి నేటి వరకూ పెద్దగా ఎలాంటి అప్ డేట్స్ ఇవ్వడం లేదు. షారుక్ కూడా దీని గురించి మాట్లాడింది చాలా తక్కువ సందర్భాల్లోనే. డంకీ రిలీజ్ కి రెడీ అవుతున్నా? టీమ్ ఎందుకు హైలైట్ చేయడం లేదు అన్నది మరో ప్రశ్న. అయితే అన్ని ప్రశ్నలకు మరికొన్ని గంటల్లో సమాధానం దొరకబోతుంది.
నవంబర్ 2న షారుక్ పుట్టిన రోజు సందర్భంగా అభిమానులకు హిరాణీ బిగ్ ట్రీట్ ఇవ్వబోతున్నారు. ఈ చిత్రం టీజర్..గ్లింప్స్ ని రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్బంగా డంకీకి సంబంధించి చాలా విషయాలు అభిమానులతో షారుక్ పంచుకోనున్నారు. అలాగే ఇదే రోజున అభిమానుల కోసం ముంబైలో ప్రత్యేకంగా జన్మదిన వేడుకల్ని ప్లాన్ చేసారు. ఆ కార్యక్రమంలోనే టీజర్ రిలీజ్ అవుతుంది.
ఈ ప్రకటనతో అభిమానుల్లో జోష్ నిండింది. ఇంతవరకూ ఎలాంటి అప్ డేట్ లేదని నిరుత్సాహ పడిన షారుక్ అభిమానులు ఖుషీ అవుతున్నారు. టీజర్ ఎలా ఉండబోతుంది? అన్న ఉత్సాహం అభిమానుల్లో కనిపిస్తుంది. ఈ రాత్రికి షారుక్ స్నేహితులకు...సన్నిహితులకు గ్రాండ్ గా బర్త్ డే పార్టీ కూడా ఇస్తున్నట్లు సమాచారం.