Begin typing your search above and press return to search.

మహేష్ తర్వాత ఆప్షన్ అతనే..?

పాన్ ఇండియా ఆడియన్స్ సైతం పుష్ప రాజ్ యాటిట్యూడ్ కి ఊగిపోయేలా చేశాడు మన లెక్కల మాష్టారు.

By:  Tupaki Desk   |   27 March 2024 3:58 AM GMT
మహేష్ తర్వాత ఆప్షన్ అతనే..?
X

తెలుగు సినిమా స్థాయిని ఇంటర్నేషనల్ లెవెల్ లో నిలబెట్టే బాధ్యత మీద వేసుకున్న రాజమౌళి తన నెక్స్ట్ సినిమాలో టాలీవుడ్ లో నెవర్ బిఫోర్ అన్న రేంజ్ లో మహేష్ సినిమా ఉండేలా ప్లాన్ చేస్తున్నాడు. అయితే రాజమౌళి చూపించిన బాటలో ఆయన తర్వాత స్థానంలో తెలుగు సినిమా స్థాయిని చాటి చెప్పే సినిమాలు చేస్తున్నాడు సుకుమార్. పుష్ప 1 రిలీజ్ వరకు అతనొక ప్రాంతీయ దర్శకుడే కానీ పుష్ప 1 రిలీజ్ తర్వాత సుకుమార్ డైరెక్షన్ స్టామినా ఏంటో తెలిసింది. పాన్ ఇండియా ఆడియన్స్ సైతం పుష్ప రాజ్ యాటిట్యూడ్ కి ఊగిపోయేలా చేశాడు మన లెక్కల మాష్టారు.


పుష్ప 2 తర్వాత మళ్లీ రంగస్థలం కాంబినేషన్ లోనే సినిమా ఫిక్స్ చేసుకుని సూపర్ అనిపించేశాడు సుకుమార్. అయితే రాజమౌళి తర్వాత మహేష్ చేసే సినిమా కూడా సుకుమార్ డైరెక్షన్ లోనే ఉంటుందని కొన్ని కాలిక్యులేషన్స్ చెబుతున్నాయి. సుకుమార్ తో చేసిన హీరోలకు అందరికీ హిట్ ఇచ్చాడు. అల్లు అర్జున్, ఎన్.టి.ఆర్, రాం చరణ్ ఇలా అందరికీ తనతో సక్సెస్ ఇచ్చాడు. కానీ మహేష్ కు మాత్రం ఫెయిల్యూర్ అందించాడు.

మహేష్ సుకుమార్ కాంబోలో వచ్చిన 1 నేనొక్కడినే సినిమా భారీ అంచనాలతో వచ్చి నిరాశపరచింది. ఆ సినిమాలో మహేష్ యాక్టింగ్ గురించి ఇప్పటికీ సూపర్ స్టార్ ఫ్యాన్స్ స్పెషల్ గా చెప్పుకుంటారు. మహేష్ తో రాజమౌళి సినిమా పూర్తి కాగానే తన నెక్స్ట్ సినిమా సుకుమార్ తోనే మహేష్ చేసే ఆలోచనలో ఉన్నాడట. అసలైతే పుష్ప సినిమా చేయాల్సిన ప్లేస్ లో మహేష్ తోనే సుకుమార్ ప్రాజెక్ట్ చేయాల్సి ఉండగా ఎందుకో వర్క్ అవుట్ కాలేదు.

పుష్ప 1 అండ్ 2 ఆ తర్వాత రామ్ చరణ్ సినిమా కూడా ఉంటుంది కాబట్టి ఆఫ్టర్ రాజమౌళి సుకుమార్ తోనే మహేష్ సినిమా అనేది బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. రాజమౌళి సినిమాతో పాన్ వరల్డ్ క్రేజ్ తెచ్చుకునే మహేష్ నెక్స్ట్ సుకుమార్ తో చేసే సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో ఊహించుకుంటేనే గూస్ బంప్స్ వచ్చేస్తాయని చెప్పొచ్చు. రాజమౌళి సినిమా కోసం మహేష్ దాదాపు 3 ఏళ్లు డేట్స్ ఇచ్చే ఛాన్స్ ఉంది. ఈలోగా సుకుమార్ సూపర్ స్టార్ కోసం ఒక అద్భుతమైన కథ రెడీ చేస్తే బాగుంటుందని అంటున్నారు ఆడియన్స్.