Begin typing your search above and press return to search.

హ‌లో ఇండియాపై హీటెక్కిస్తోన్న ఐదుగురు భామ‌లు!

ఇంత‌కీ ఎవ‌రా ఐదుగురు భామ‌లు? ఏ క‌వ‌ర్ పేజీ కోసం ఇంత‌గా హోయ‌లు పోయారు? అంటే వివ‌రాల్లోకి వెళ్లాల్సిందే.

By:  Tupaki Desk   |   24 Nov 2023 2:30 PM GMT
హ‌లో ఇండియాపై హీటెక్కిస్తోన్న ఐదుగురు భామ‌లు!
X

వెండి తెర‌ను మించిన బ్యూటీని ఆవిష్క‌రించ‌డం క‌వ‌ర్ పేజీల సొంతం. ప్ర‌ఖ్యాత మ్యాగ‌జైన్ల కోసం బాలీవుడ్ భామ‌లు పోటీ ప‌డే స‌న్నివేశం అంకంత‌కు హీటెక్కిస్తుంటుంది. ఒకర్ని మించి ఒక‌రు గ్లామ‌ర్ ఎలివేష‌న్ లో త‌మ‌దైన మార్క్ వేస్తుంటారు. తాజాగా ఒకే క‌వ‌ర్ పేజీ కోసం ఏకంగా ఐదుగురు భామ‌లు పోటీ ప‌డి మ‌రీ ఎవ‌రి ప్ర‌త్యేక‌త‌ను వారు చాటారు. ఇంత‌కీ ఎవ‌రా ఐదుగురు భామ‌లు? ఏ క‌వ‌ర్ పేజీ కోసం ఇంత‌గా హోయ‌లు పోయారు? అంటే వివ‌రాల్లోకి వెళ్లాల్సిందే.


ప్ర‌ఖ్యాత హ‌లో ఇండియా మ్యాగ‌జైన్ కోసం అలియాభ‌ట్..క‌రీనా క‌పూర్..ర‌కుల్ ప్రీత్ సింగ్..ప్రియాంక చోప్రా..పూజాహెగ్డే త‌మ‌దైన శైలిలో అందాల్ని ఆవిష్క రిం చారు. అలియాభ‌ట్ డార్క్ రెడ్ క‌ల‌ర్ ఔట్ ఫిట్ లో మిరుమిట్లు గొలిపింది. షోల్డ‌ర్ లెస్ డిజైన్ లో ప‌ర్పెక్ట్ క్లీవేజ్ షోతో ఆక‌ట్టుకుంది. అమ్మ‌డి మ్యాక‌ప్ అయిన విధానం... స్కిన్ టోన్..బ్యాక్ గ్రౌండ్ ప్ర‌తీది అలియాని సంథింగ్ స్పెష‌ల్ గా హైలైట్ చేస్తుంది.


ఇక సీనియ‌ర్ నాయిక క‌రీనా క‌పూర్ ఖాన్ కూడా న‌వ నాయిక‌కు ఏమాత్రం త‌క్కువ కాద‌ని మ‌రోసారి ప్రూవ్ చేసింది. ఇన్న‌ర్ పింక్ పై బ్లాక్ క‌ల‌ర్ టాప్ టూ బాట‌మ్ డిజైన్ లో ఆక‌ర్ష‌ణీయంగా క‌నిపిస్తుంది. అలియా ధ‌రించిన డైజ‌న్ కి సమీపంగా..ఎద అందాల వ‌డ్డ‌న మాత్రం సేమ్ టూ సేమ్ అనిపించింది. అలాగే ప్రియాంక చోప్రా కూడామెరిసిపోతున్న డిజైన్ లో అంతే అందంగా ప్రొజెక్ట్ అవుతుంది. సొగ‌స‌రి మ్యాక‌ప్ అయిన విధానం..ఎంపిక చేసుకు యాక్స‌ర‌సీస్ ప్ర‌తీది పీసీని ఎంతో అందంగా తీర్చిదిద్దాయి.


మ‌రో న‌వ నాయిక ర‌కుల్ ప్రీత్ సింగ్ మాత్రం అంద‌రికంటే స్పెష‌ల్ గా ఫోక‌స్ అవుతుంది. స్లీవ్ లెస్ పోలిన డిజైన్ లో అమ్మ‌డు రంజు రంజుగా ముస్తాబైంది. అమ్మ‌డి బాడీకి ఔట్ ఫిట్ ప‌క్కాగా ఫిట్ అయింది. డిజైన్ ని మ్యాచ్ చేస్తూ నెక్ పై స‌న్న‌ని గొలుసు..క్లీవేజ్ వ‌ర‌కూ జారిన వైనం వావ్ అనిపిస్తుంది. ర‌కుల్ ముస్తాబైన విధానం..హెయిర్ స్టైల్ ప్ర‌తీది మ‌రింత అందంగా మ‌లిచాయి.


ఇదే సిరీస్ నుంచి నెటి జ‌నుల ముందు కొచ్చిన పూజాహెగ్డే స్టైలిష్ భంగిమ ఆక‌ట్టుకుంటుంది. లో దుస్తులు లేని శ‌రీరంపై కోట్ కాపీ రంగు కోట్ ధ‌రించి సైజ్ జీరో బ్యూటీని ప‌ర్పెక్ట్ గా లాంచ్ చేసింది. ప్ర‌స్తుతం ఈ ఫోటోలు ఇన్ స్టాలో వైర‌ల్ గా మారాయి. అందాల‌న్నీ ఒకే చోట చేసే స‌రికి కుర్రాళ్లు క‌న్ప్యూజ్ అవుతున్నారు.