హేమ కమిటీ నివేదికపై టాలీవుడ్ మౌనం!
జస్టిస్ హేమ కమిటీ నివేదిక తో మాలీవుడ్ లో ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయో తెలిసిందే. దేశ వ్యాప్తంగా నివేదికపై చర్చ జరుగుతోంది.
By: Tupaki Desk | 30 Aug 2024 4:06 AM GMTజస్టిస్ హేమ కమిటీ నివేదిక తో మాలీవుడ్ లో ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయో తెలిసిందే. దేశ వ్యాప్తంగా నివేదికపై చర్చ జరుగుతోంది. మాలీవుడ్ నటీనటులపై తీవ్రమైన ఆరోపణలు తెరపైకి వచ్చాయి. దీంతో `అమ్మ`(మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్) సంఘం రద్దైంది. కొందరు నటీనటులపై నటీమణులు ఆరోపణలు చేయడంతో రాజీనామా చేసారు. మరికొంత మంది స్వచ్ఛందంగా ముందుకొచ్చి రాజీనామాలు చేసారు.
ఇదంతా పక్కనబెడితే లైంగికంగా వేధింపబడ్డ వారంతా మీడియా ముందుకొచ్చి తమ గోడును వినిపి స్తున్నారు. తమైన ఎవరెవరు? ఎలాంటి దాడులకు పాల్పడ్డారు? అన్నది పూస గుచ్చినట్లు చెబుతున్నారు. ఈ సందర్భంగా ఒకప్పటి స్టార్ హీరోయిన్లు సైతం బాల్యంలో తమకెదురైన అనుభవాలు సైతం మీడియా ముందుంచుతున్నారు. ఆరోపణలు నిజంగా ప్రూవ్ అయితే కఠినమైన శిక్షలు అమలు చేయాలంటూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.
ప్రస్తుతానికి ఈ అంశం కోర్టు ఫరిదిలో ఉంది. నిజ నిర్దారణ అవ్వాల్సి ఉంది. ఇలాంటి సమయంలో నటి ఖుష్బూ ప్రతీ పౌరుడు బాధితులకు అండగా నిలవాలని విజ్ఞప్తి చేసారు. అయితే ఈ ఆరోపణలపై ఇంత వరకూ టాలీవుడ్ మాత్రం స్పందించలేదు. ఏ ఒక్కరూ కూడా నోరు మెదపలేదు. కోలీవుడ్..శాండిల్ వుడ్ నుంచి కొంత మంది సినీ ప్రముఖులు స్పందించినా టాలీవుడ్ నుంచి ఏ ప్రముఖుడు కూడా సోషల్ మీడియా వేదికగా ఎలాంటి పోస్ట్ పెట్టలేదు.
త్రిష-మన్సూర్ అలీఖాన్ విషయంలో కొంత మంది ప్రముఖులు స్పందించినా..దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతోన్న నివేదికపై స్పందించకపోవడం శోచనీయమని పరిశ్రమలో కొంత మంది వ్యక్తులు మాట్లాడు కుంటున్నారు. మాబోటు వాళ్లు స్పందించినా..దానికి ఎలాంటి గుర్తింపు ఉండదని స్పందిచా ల్సిన వ్యక్తులు స్పందిస్తే దానికో గుర్తింపు ఉంటుందని, మనము వాళ్లకు అండగా నిలబడ్డాం? అన్న భరోసా కల్పించిన వాళ్లం అవుతామని అభిప్రాయపడ్డారు.అయితే ఇలాంటి మౌనం టాలీవుడ్ నుంచి కొత్తేం కాదు. గతంలో బాలీవుడ్ లో మీటూ ఉద్యమం జరిగిన సమయంలోనూ టాలీవుడ్ ఇదే మౌనాన్ని వహించింది. ఈ విషయంలో టాలీవుడ్ ..బాలీవుడ్ నే అనుసరిస్తుంది.