Begin typing your search above and press return to search.

వేధించిన హీరోతో కౌగిలింత సీన్ 17 టేకులు?

ఆ స‌మ‌యంలో తాను పడుతున్న మానసిక క్షోభను అర్థం చేసుకోకుండా ఆమె నటనను నిర్మాత కూడా తీవ్రంగా విమర్శించాడు.

By:  Tupaki Desk   |   20 Aug 2024 12:42 PM GMT
వేధించిన హీరోతో కౌగిలింత సీన్ 17 టేకులు?
X

'మాలీవుడ్ లైంగిక వేధింపుల'పై జస్టిస్ హేమ కమిటీ నివేదిక సంచ‌ల‌నంగా మారింది. తనపై లైంగిక వేధింపులకు పాల్పడిన నటుడితో కౌగిలింత‌ సన్నివేశం కోసం ప్ర‌ముఖ నటి 17 టేక్‌లు తీసుకోవాల్సి వచ్చిందని ఈ నివేదిక వెల్ల‌డించింది. గతంలో తనను వేధించిన వ్యక్తితో మ‌ళ్లీ కలిసి నటించాల్సి వచ్చింది. ఆ స‌మ‌యంలో తాను పడుతున్న మానసిక క్షోభను అర్థం చేసుకోకుండా ఆమె నటనను నిర్మాత కూడా తీవ్రంగా విమర్శించాడు. పూర్తి వివ‌రాల్లోకి వెళితే..

2017లో మలయాళంలో ప్రముఖ నటిపై లైంగిక దాడి జరిగిన వెంటనే జస్టిస్ కె హేమ (రిటైర్డ్) నేతృత్వంలో మాజీ బ్యూరోక్రాట్ కెబి వల్సలకుమారి , ప్రముఖ నటి శారద సభ్యులుగా ముగ్గురు సభ్యుల కమిషన్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ క‌మిటీ తీవ్రంగా ప‌రిశోధించాక‌ డిసెంబర్ 2019లో కేరళ ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. నాలుగున్నరేళ్ల తర్వాత ఈ నివేదికను ప్రజల కోసం ఓపెన్ గా విడుదల చేశారు. మలయాళ చిత్ర పరిశ్రమలో పనిచేస్తున్న మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై జస్టిస్ హేమ కమిటీ నివేదిక స‌ర్వ‌త్రా చ‌ర్చ‌నీయంశంగా మారింది. త్రిసభ్య కమిటీ దర్యాప్తు చేసిన వివిధ సంఘటనలలో ఒకదానిలో తనపై లైంగిక వేధింపులకు పాల్పడిన నటుడితో కలిసి పని చేయవలసి రావడం గురించి నటి ఒకరు షాకింగ్ విష‌యాన్ని చెప్పారు.

గతంలో తనను వేధించిన వ్యక్తితో తిరిగి నటించాల్సి వచ్చిందని `సాక్షి ఖాతా`(ఆన్ లైన్ నివేదిక‌)లో వెల్లడైంది. తాము పెళ్ల‌యిన జంటగా నటిస్తున్నారు.. కెమెరా ముందు అతడిని కౌగిలించుకోవలసి వచ్చింది. అయితే అప్ప‌టికే తీవ్ర‌మైన‌ మానసిక, శారీరక ఒత్తిడి కారణంగా ఆ సన్నివేశంలో న‌టించ‌లేక‌పోయింది. మరుసటి రోజు కూడా భార్యాభర్తలు ఒకరినొకరు కౌగిలించుకునే సీన్‌లో అదే వ్యక్తితో కలిసి పని చేయాల్సి వచ్చింది. ఒక‌టికి 17 టేకులు తీసుకోవాల్సి వ‌చ్చింది. షూటింగ్ సమయంలో ఆమెకు చేసిన దాని వల్ల అది భయంకరంగా అనిపించింది. షూటింగ్ సమయంలో త‌న‌లో ఆగ్రహం పెల్లుబికింది. అయితే ఆ న‌టుడు ఈ మల్టిపుల్ టేక్‌లను ఎందుకు తీసుకుంటున్నాడో అర్థం చేసుకోకుండా ఆ సినిమా నిర్మాత అన్యాయంగా నటిని విమర్శించాడు. ఆ న‌టుడిని నిర్మాత ఏ విష‌యంలోను ప్ర‌శ్నంచ‌లేదు.

క‌మిటీ నివేదిక‌లో ఇంకా చాలా విష‌యాలు బ‌య‌ట‌ప‌డ్డాయి. మహిళలు డబ్బు సంపాదించడానికి సినిమాలకు వస్తారు. దేనికైనా లొంగిపోతుందనే సాధారణ ఊహలో మృగాళ్లు జీవిస్తారు. కళపై, నటనపై ఉన్న మక్కువ వల్లనే ఓ మహిళ సినిమాల్లోకి వస్తుందని సినిమాలోని మగవాళ్లు ఊహించలేరు. కానీ వారు పేరు ప్రఖ్యాతులు, డబ్బు కోసం వస్తున్నారనే అభిప్రాయం ఉంది. సినిమాల్లో అవకాశం పొందడానికి వారు ఏ వ్యక్తితోనైనా పడుకుంటారనే భావ‌న ఉంది.

ప్రాణాలతో బయటపడిన వ్యక్తిని `సమస్యలు కలిగించే వ్యక్తి`గా పేర్కొనడం .. పరిశ్రమ నుండి తరచుగా బహిష్కరించబడటం వలన ఇటువంటి ఫిర్యాదులు ఎలా ప‌లుచ‌న అయిపోతాయో నివేదిక‌లో పేర్కొన్నారు. నటనపై మక్కువ ఉన్న మహిళలు అన్ని అకృత్యాలను మౌనంగా అనుభవిస్తారు. సినిమాల్లోని ఇతర మహిళలకు కూడా ఇలాంటి అనుభవం ఉందా? అని ఈ సాక్షి(ఒక న‌టీమ‌ణి)కి కమిటీ వేసిన ప్రశ్నకు.. వారికి వేధింపులు ఉండవచ్చు.. కానీ వారు తమ సమస్యలను బహిరంగంగా చెప్పడానికి భయపడుతున్నారని ఆమె అన్నారు.

లైంగిక వేధింపులు, మహిళల మరుగుదొడ్లు, దుస్తులు మార్చుకునే గదులు వంటి ప్రాథమిక సౌకర్యాల కొరత, లింగ పక్షపాతం, వివక్ష, వేతనంలో అసమానత.. వారి సమస్యలను పరిష్కరించడానికి చట్టబద్ధమైన అధికారం లేకపోవడం వంటి వివిధ అంశాలను ఈ నివేదిక బ‌హిర్గ‌తం చేసింది.