మహేష్ నే టార్గెట్ చేసిన వైజాగ్ బ్యూటీ!
ఈ మధ్య హీరోయిన్లు అంతా నాన్నలు నేవీలో పనిచేస్తుంటే? కూతుళ్లు హీరోయిన్లు అవుతున్నట్లే కనిపిస్తుంది.
By: Tupaki Desk | 6 Nov 2024 11:30 PM GMTఈ మధ్య హీరోయిన్లు అంతా నాన్నలు నేవీలో పనిచేస్తుంటే? కూతుళ్లు హీరోయిన్లు అవుతున్నట్లే కనిపిస్తుంది. ఇటీవలే శోభిత ధూళిపాళ బ్యాక్ గ్రౌండ్ అంతా బయట పడింది. అక్కినేని ఇంట కోడలిగా అడుగు పెడుతోన్న నేపథ్యంలో శోభిత కుటుంబ వివరాలన్నీ బయటకు వచ్చాయి. ఈ క్రమంలోనే తెనాలి లో పుట్టినా? పెరిగింది , చదివింది అంతా వైజాగ్ లోనేనని తేలింది. ఆమె తండ్రి వైజాగ్ లో నేవల్ ఉద్యోగి కావడం..అటుపై ముంబైకి వెళ్లడంతో? నార్త్ కల్చర్ కి అలవాటు పడిన నటిగా వెలుగులోకి వచ్చింది.
తాజాగా హేమలతా రెడ్డి అనే మరో బ్యూటీ కూడా వెలుగులోకి వస్తోంది. గ్లామర్ ఫీల్డ్ లో ఈ అమ్మడు కూడా పాదరసంలా దూసుకుపోతుంది. ఇప్పటికే బుల్లితెరపై సత్తా చాటింది. పలు ప్రముఖ తెలుగు టీవీ ఛానళ్లలో యాంకర్ గా పనిచేసింది. ఫ్యాషన్ రంగంలోనూ అనుభవం ఉంది. తాజాగా వైజాగ్ విచ్చేసిన సందర్భంగా ఇండస్ట్రీలో అమ్మడు టార్గెట్ గురించి రివీల్ చేసింది. `విశాఖలోనే నటన నేర్చుకున్నా. డాబాగార్డెన్స్ లో ఉంటాం.
నాన్న నేవీ ఎంప్లాయ్. అమ్మ పైనాన్స్ వ్యాపారం. స్కూలింగ్ సెయింట్ జోసెప్ లో చదివాను. అటుపై ఆంధ్రా యూనివర్శిటీలో ఎంఏ క్లాసికల్ చేసా. నాన్న నన్ను న్యూస్ రీడర్ గా చూడాలనుకున్నారు. ఆయన కోసం టీవీ-9, ఎన్టీవీల్లో పనిచేసా. ఆ తర్వాత కొన్ని సీరియల్స్ చేసాను. దాదాపు 20 సీరియల్స్ లో నటించాను. గతంలో వైజాగ్ బిగ్ ఎఫ్ ఎంలో జాబ్ కోసం ట్రై చేసా. ఇప్పుడు వారు నా ఇంటర్వ్యూ అడగడం ఎంతో సంతోషంగా ఉంది.
టాలీవుడ్ లో సూపర్ స్టార్ మహేష్ తో నటించాలన్నది నా డ్రీమ్. ఆ ఛాన్స్ కోసం ప్రయత్నాలు చేస్తున్నా. సౌందర్య, సమంతలను అభిమానిస్తా. తెలుగు హీరోయిన్లు అంజలి, వైష్ణవి ఇండస్ట్రీలో బాగా సక్సెస్ అయ్యారు. వారిలాగే నేను కూడా అవకాశాల కోసం ప్రయత్నిస్తున్నా. నాకు సొంతంగా వీరభద్ర క్రియేషన్స్ అనే బ్యానర్ కూడా ఉంది. 2017లో దాన్ని స్థాపించాను` అని అన్నారు.