Begin typing your search above and press return to search.

బెంగళూరు రేవ్ పార్టీ.. హేమ మాస్ వార్నింగ్!

రేవ్ పార్టీకి టాలీవుడ్ కు చెందిన పలువురు సెలబ్రిటీలు హాజరయ్యారని వార్తలు రావడంతో ఇండస్ట్రీలో ఈ విషయం చర్చనీయాంశంగా మారింది.

By:  Tupaki Desk   |   22 May 2024 2:20 PM GMT
బెంగళూరు రేవ్ పార్టీ.. హేమ మాస్ వార్నింగ్!
X

బెంగుళూరు శివార్లలోని ఓ వ్యాపారవేత్తకు చెందిన ఫామ్‌ హౌస్‌ లో నిర్వహించిన రేవ్‌ పార్టీలో పలువురు టీవీ నటీనటులు, మోడళ్లు పట్టుబడిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ కేసు రెండు తెలుగు రాష్ట్రాలను కుదిపేస్తోంది. రేవ్ పార్టీకి టాలీవుడ్ కు చెందిన పలువురు సెలబ్రిటీలు హాజరయ్యారని వార్తలు రావడంతో ఇండస్ట్రీలో ఈ విషయం చర్చనీయాంశంగా మారింది. ఎక్కడ చూసినా ఇప్పుడు అదే చర్చ.

అయితే నటి హేమ.. ఆ రేవ్ పార్టీకి వెళ్లారా లేదా అన్నది మాత్రం ఇంకా తేలలేదు. ఆరోజు పార్టీలో హేమ ఉన్నారని తొలుత ప్రచారం జరిగింది . అయితే హేమ మాత్రం తాను రేవ్ పార్టీకి వెళ్లలేదని.. ఫామ్ హౌస్ లోనే ఉన్నానని వీడియో రిలీజ్ చేశారు. ఆ తర్వాత బిర్యానీ వండుతున్నట్టు మరొక వీడియో పోస్ట్ చేశారు. కానీ నిన్న బెంగళూరు పోలీస్ హేమ ఉన్నారని చెప్పారు అనే ప్రచారం కొత్తగా స్టార్ట్ అయ్యింది..నిజం ఏంటి అనేది తెలియలేదు ..

ఇప్పటికే రేవ్ పార్టీకి తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పేందుకు పలుమార్లు ప్రయత్నించిన హేమ.. తాజాగా మరోసారి స్పందించారు. ఈ విషయంలో ప్ర‌స్తుతం త‌న‌కు కాస్త స్పేస్ కావాలని హేమ కోరారు. రెండు రోజుల్లో తాను మీడియా ముందుకు వస్తానని చెప్పారు. భయంతో పారిపోయే మహిళ తాను కాదని తెలిపారు. తనపై జరుగుతున్న ప్రచారం వెనుక ఎవరున్నారో అన్నీ కనిపెట్టి వివరిస్తానని తెలిపారు.

ఈ పార్టీ గురించి కూడా అన్ని విషయాలు చెబుతానని హేమ అన్నారు. తానేం తప్పు చేయలేదని, ఈ విషయంపై ఇప్పటికే అందరికీ క్లారిటీ ఇచ్చానని తెలిపారు. తాను హైదరాబాద్ లోనే ఉన్నానని, కానీ బెంగళూరులో ఉన్నట్లు కొందరు ప్రచారం చేస్తున్నారని చెప్పారు. భయంతో పారిపోవాలనుకుంటే.. రెండు రోజుల్లో దాదాపు 500 కాల్స్ లిఫ్ట్ చేసి ఎందుకు అందరికీ క్లారిటీ ఇస్తానని హేమ ప్రశ్నించారు.

అంతేకాకుండా అందరి సంగతి చూస్తానని వార్నింగ్ కూడా ఇచ్చారు హేమ. దీంతో మీడియాకు ముందుకు వచ్చి ఆమె ఏం మాట్లాడుతారోనని అంతా అంటున్నారు. హేమకు కొందరిపై అనుమానం ఉన్నట్లు ఆమె వ్యాఖ్యల ద్వారా అర్థమవుతోందని చెబుతున్నారు. ఇప్పుడు హేమ వార్నింగ్ తో సోషల్ మీడియాలో బెంగళూరు రేవ్ పార్టీపై చర్చ మరింత ఊపందుకుంది. మరి చివరికి ఏం జరుగుతుందో చూడాలి.