Begin typing your search above and press return to search.

'మా'కి హేమ రిక్వెస్ట్‌

సినీ నటి హేమను కొన్ని రోజుల క్రితం బెంగళూరు పోలీసులు డ్రగ్స్ కేసులో అరెస్ట్‌ చేసిన విషయం తెల్సిందే.

By:  Tupaki Desk   |   8 July 2024 9:55 AM GMT
మాకి హేమ రిక్వెస్ట్‌
X

సినీ నటి హేమను కొన్ని రోజుల క్రితం బెంగళూరు పోలీసులు డ్రగ్స్ కేసులో అరెస్ట్‌ చేసిన విషయం తెల్సిందే. డ్రగ్స్ ఆరోపణలు ఎదుర్కొంటున్న హేమను మూవీ ఆర్టిస్టు అసోషియేషన్‌ నుంచి తొలగించాంటూ పలువురు డిమాండ్‌ చేయడంతో ఆ సమయంలో మా అధ్యక్షుడు మంచు విష్ణు ఆమె సభ్యత్వం ను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నాడు.

మా నుంచి సస్పెండ్‌ చేయడం పట్ల హేమ ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల బెయిల్‌ పై విడుదల అయిన హేమ 'మా' అధ్యక్షుడు మంచు విష్ణు ను కలిసింది. తనపై మీడియా నిరాధారమైన ఆరోపణలు చేసిందని, నేను దేశంలోనే అత్యున్నత ల్యాబ్స్ లో పరీక్షలు చేయించుకున్నాను. అందులో నేను డ్రగ్స్ తీసుకోలేదని వెల్లడి అయింది.

పోలీసు కేసు నుంచి కూడా నేను నిర్దోషి గా బయట పడుతాను అనే నమ్మకం ఉంది. కనుక నా సభ్యత్వం ను పునరుద్దరించాలి అంటూ లేఖ రాయడంతో పాటు మంచు విష్ణు ను స్వయంగా కలిసి ఆ లేఖ ను అందించడం జరిగింది. మా అసోషియేషన్‌ లోకి హేమను తిరిగి తీసుకునే విషయమై చర్చిస్తామని మంచు విష్ణు అన్నట్లుగా తెలుస్తోంది.

గత కొన్ని రోజులుగా నాపై మానసికంగా మీడియా వారు దాడి చేస్తున్నారని, ఈ సమయంలో మా నాకు మద్దతుగా ఉండాలంటూ హేమ విజ్ఞప్తి చేశారు. సుదీర్ఘ కాలంగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నాను. ఎంతో మంది అభిమానం దక్కించుకున్నాను.

నాపై వచ్చిన ఆరోపణలు నిజం కాదని గుర్తించి తన సభ్యత్వం విషయంలో పునరాలోచించాలని హేమ లేఖలో పేర్కొన్నారు. మరి మంచు విష్ణు అండ్‌ మా టీం ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తోంది.