కిమ్ కర్దాషియాన్ ఇండియా వెర్షన్ ఇదిగో
ముఖ్యంగా మలైకా బోల్డ్ అండ్ డేరింగ్ ఫ్యాషన్ ఎంపికల గురించి ఎప్పుడూ అభిమానుల్లో చర్చ సాగుతూనే ఉంటుంది.
By: Tupaki Desk | 20 Oct 2023 9:56 AM GMTబోల్డ్ డిజైనర్ లుక్ అయినా .. సాంప్రదాయ చీర అయినా మలైకా అరోరా ఒదిగిపోయే తీరు వేరు. పర్ఫెక్ట్ ఫ్యాషనిస్టాగా నేటితారానికి మలైకా గోల్స్ సెట్ చేస్తుందనడంలో సందేహం లేదు. వేషధారణ ఏదైనా తన రూపాన్ని పరిపూర్ణంగా ఆవిష్కరించుకోవడంలో మల్లా నిజమైన ఫ్యాషనిస్టా. ముఖ్యంగా మలైకా బోల్డ్ అండ్ డేరింగ్ ఫ్యాషన్ ఎంపికల గురించి ఎప్పుడూ అభిమానుల్లో చర్చ సాగుతూనే ఉంటుంది.
ఇంతకుముందు మలైకా బికినీ ఫెస్టివల్ గురించి చర్చ సాగింది. ఇప్పుడు మరో డిఫరెంట్ గెటప్ తో కుర్రకారు హృదయాలను కొల్లగొట్టింది. మున్ని బద్నామ్ హుయ్... అంటూ యూత్ మరోసారి చెలరేగిపోతున్నారు. ఈసారి క్లాసీ షీర్ గౌను ధరించి రెడ్ కార్పెట్‌పై పోజులిచ్చిన మలైకా హెడ్ టర్నర్ గా మారింది. షీర్ బ్లూ గౌన్ తన ఫ్యాషన్ గేమ్‌ను అభిమానులు అదే పనిగా మెచ్చుకోవడం ఇక్కడ ట్విస్టు. నిజానికి మలైకా ప్రతిసారీ తన ఫ్యాషన్ సెన్స్ విషయంలో కొన్ని విమర్శల్ని ఎదుర్కొంటోంది. కానీ ఈసారి ఫ్యాషన్ ప్రియులు ఎవరూ స్పందించకపోవడం ఆశ్చర్యపరిచింది. చాలా తక్కువ మంది మాత్రం ట్రోల్ చేసారు.
గురువారం రాత్రి ముంబైలో జరిగిన ఈవెంట్లో మలైకా షో స్టాపర్ గా నిలవడానికి ప్రత్యేక కారణాలున్నాయి. గొలుసులు రింగులు వంటి అలంకారాలతో డిజైన్ చేసిన అంచులతొ సరికొత్త డిజైనర్ వేర్ ఎంతో ఆకర్షించాయి. వన్-షోల్డర్, హాల్టర్-నెక్-స్టైల్ స్లీవ్‌లను కలిగి ఉన్న దుస్తులలో అల్ట్రా స్టైలిష్ గా కనిపించింది. మలైకా చేతిలో పింక్ బ్యాండ్ కూడా ఉంది. అయితే మలైకా కొత్త లుక్ కొందరికి మాత్రం నచ్చలేదు. ఈ దుస్తులపై ఒక సెక్షన్ నుంచి భారీ విమర్శలను ఎదుర్కొంది. దుస్తులను అసభ్యకరంగా చూపించారంటూ చాలా మంది ఆమెను ట్రోల్ చేశారు. ఒకరు, `ఉర్ఫీ కో టక్కర్` అని వ్యాఖ్యానించగా, మరొకరు ``చలో మన ఫిగర్ అచీ హై కానీ యే ఐసే కప్డే పహేనే అచా హై ఆప్ ఫుల్ కప్డే మే భీ అచే హై లగోగే`` అని వ్యాఖ్యానించారు.
కెరీర్ మ్యాటర్ కి వస్తే.. . మలైకా అరోరా చివరిగా తేరా హి ఖయల్ మ్యూజిక్ వీడియోలో కనిపించారు. ఆమె తదుపరి సెలబ్రిటీ డ్యాన్స్ రియాలిటీ షో ఝలక్ దిఖ్లా జా కొత్త సీజన్‌కు న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తుంది. పలు టీవీ రియాలిటీ షోలతో ఆర్జిస్తున్న మలైకా అరోరాఖాన్, త్వరలో తనయుడిని హీరోగా తెచ్చేందుకు ప్రయత్నిస్తోందని సమాచారం.