Begin typing your search above and press return to search.

లడ్డు గురించి ఇప్పుడొద్దు - కార్తీ

ఇక ఆ మీమ్ పై హీరో కార్తి సరదాగా రియాక్ట్ అయ్యారు. 'ఇప్పుడు లడ్డు గురించి మాట్లాడకూడదు. సెన్సిటివ్ టాపిక్.

By:  Tupaki Desk   |   24 Sep 2024 4:25 AM GMT
లడ్డు గురించి ఇప్పుడొద్దు - కార్తీ
X

తిరుమలలో శ్రీవారి లడ్డు ప్రసాదం కల్తీ ఇష్యూ ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. హిందూ సంఘాలు లడ్డు కల్తీ వ్యవహారంపై పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇది చర్చనీయాంశంగా మారింది. హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా వ్యవహరించారనే విమర్శలు వస్తున్నాయి. దీనిపై సీబీఐ ఎంక్వయిరీ వేయాలని డిమాండ్ పెరుగుతోంది. మరో వైపు సుప్రీం కోర్టులో తిరుమల లడ్డు కల్తీ వ్యవహారంపై కొంతమంది పిటిషన్ లు వేశారు.

అలాగే దేశ వ్యాప్తంగా దీనిపై పెద్ద ఎత్తున రాజకీయ వర్గాల మధ్యలో చర్చ నడుస్తోంది. ఏపీలో కూటమి సర్కార్ కావాలని దీనిని రాజకీయం చేస్తుందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే ఈ లడ్డు కల్తీ వ్యవహారంపై ఎవరి వాదనలు వారికి ఉన్నాయి. అయితే లడ్డు కాంట్రవర్సీలో సెలబ్రెటీలు వేలుపెట్టే ప్రయత్నం చేయడం లేదు. కార్తీ, అరవింద్ స్వామి కాంబినేషన్ లో తెరకెక్కిన తమిళ్ మూవీ ‘సత్యం సుందరం’ టైటిల్ తో తెలుగులో డబ్బింగ్ అయ్యి రిలీజ్ కాబోతోంది.

సెప్టెంబర్ 27న ఈ మూవీ తమిళ్, తెలుగు భాషలలో ఏక కాలంలో రాబోతోంది. ఈ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ తాజాగా హైదరాబాద్ లో జరిగింది. ఇందులో యాంకర్ సరదాగా లడ్డు కావాలా నాయనా అనే మీమ్ డైలాగ్ ని ఉపయోగించింది. ఇక ఆ మీమ్ పై హీరో కార్తి సరదాగా రియాక్ట్ అయ్యారు. 'ఇప్పుడు లడ్డు గురించి మాట్లాడకూడదు. సెన్సిటివ్ టాపిక్. దీని గురించి ఇప్పుడు మాట్లాడటం బాగోదు..' అంటూ సరదాగా నవ్వుతూ రియాక్ట్ అయ్యాడు..' కార్తీ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

మొత్తానికి తిరుపతి లడ్డు వివాదం ఏమో కానీ ఆ మాట కూడా ఇప్పుడు అందరిని భయపెడుతుంది అంటూ సోషల్ మీడియాలో ఫన్నీ కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే ‘సత్యం సుందరం’ మూవీ పూర్తిస్థాయిలో కామెడీ అండ్ ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కింది. ప్రేమ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాని 2D ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్య నిర్మించారు. కార్తీ కామెడీ టైమింగ్, పెర్ఫార్మెన్స్ ని ఇష్టపడే తెలుగు ఆడియన్స్ చాలా మంది ఉన్నారు.

ఈ నేపథ్యంలో ‘సత్యం సుందరం’ సినిమాకి తెలుగులో మంచి ఆదరణ వస్తుందని అంచనా వేస్తున్నారు. అయితే ‘దేవర’కి పోటీగా రిలీజ్ అవుతోన్న నేపథ్యంలో ఏ మాత్రం తట్టుకొని ఆడియన్స్ ని థియేటర్స్ వరకు రప్పించగలుగుతుంది అనేది వేచి చూడాలి.