Begin typing your search above and press return to search.

శర్వానంద్.. టైర్ 2 ట్యాగ్ కోల్పోయాడా?

టాలీవుడ్‌లో ఓ టైమ్‌లో తనదైన స్టైల్‌తో అలరించిన హీరో శర్వానంద్, ప్రస్తుతం వరుస ఫ్లాప్స్ తో మార్కెట్ విషయంలో సంక్షోభంలో ఉన్నాడు.

By:  Tupaki Desk   |   8 March 2025 12:45 PM
శర్వానంద్.. టైర్ 2 ట్యాగ్ కోల్పోయాడా?
X

టాలీవుడ్‌లో ఓ టైమ్‌లో తనదైన స్టైల్‌తో అలరించిన హీరో శర్వానంద్, ప్రస్తుతం వరుస ఫ్లాప్స్ తో మార్కెట్ విషయంలో సంక్షోభంలో ఉన్నాడు. 2017లో వచ్చిన మహానుభావుడు తర్వాత అతను గట్టి హిట్ చూసిన దాఖలాలు లేవు. అంతకు ముందే శతమానం భవతి, ఎక్స్‌ప్రెస్ రాజా వంటి సినిమాలతో టైర్ 2 హీరోగా నిలిచాడు. అయితే ఆ స్థాయిని కొనసాగించడంలో విఫలమయ్యాడు. గత ఆరు సంవత్సరాలుగా చేస్తున్న సినిమాల్లో ఒక్కటీ ఆయన కెరీర్‌ను నిలబెట్టే స్థాయిలో విజయాన్ని సాధించలేకపోయింది.

గత ఆరు సినిమాల ట్రాక్‌ రికార్డ్ చూస్తే స్పష్టంగా కనిపిస్తుందీ విషయం. పడి పడి లేచే మనసు, రణరంగం, జాను, శ్రీకారం, మహా సముద్రం, ఆడవాళ్లు మీకు జోహార్లు వరుసగా ఫ్లాప్ అయ్యాయి. అసలే మార్కెట్ తక్కువగా ఉన్న హీరో, ఇంత వరుసగా డిజాస్టర్లు చూస్తే పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఈ సినిమా తర్వాత వచ్చిన ఒకే ఒక జీవితం టాక్ పరంగా మెచ్చుకోదగ్గదే అయినా, కలెక్షన్లు మాత్రం నిర్మాతలకు లాభం తేల్చలేదు.

ఇటీవలే థియేటర్లలో విడుదలైన మనమే సినిమా కూడా పెద్దగా ఆడలేదు. ఇక ఓటీటీలో అమెజాన్ ప్రైమ్‌లో విడుదలైనప్పటికీ, ప్రేక్షకుల నుంచి ఆశించిన స్థాయిలో రెస్పాన్స్ వస్తున్నట్టు కనపడటం లేదు. శర్వా కాస్త కొత్త కంటెంట్ తో వస్తున్నా అవి ప్రేక్షకులను థియేటర్ వరకు రప్పించడం లేదు.

ఇలా వరుసగా ఫ్లాప్‌లతో ఆయన టైర్ 2 హీరో ట్యాగ్‌ను పూర్తిగా కోల్పోయినట్లే అనిపిస్తోంది. ఇప్పటికే ఈ స్థాయిలో కొనసాగుతున్న హీరోలలో నితిన్ వంటి వారు తమ మార్కెట్‌ను నిలబెట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ శర్వానంద్ మాత్రం ఈ రేసులో పూర్తిగా వెనకబడిపోయాడు. ఇప్పటివరకు ఓటీటీ వేదిక కూడా అతనికి క్రేజ్ తీసుకురాలేకపోయింది. దీంతో, నెక్స్ట్ సినిమాలు తప్పక విజయాన్ని అందుకోవాలి.

ప్రస్తుతం శర్వా 36 అనే డర్ట్ బైక్ అడ్వెంచర్ థ్రిల్లర్‌ లో నటిస్తున్నాడు. అలాగే మరో కామెడీ డ్రామా సినిమాను లైనప్‌లో పెట్టుకున్నాడు. ఈ రెండు సినిమాలు కూడా ఫెయిలయితే, ఇక టాలీవుడ్‌లో తిరిగి నిలదొక్కుకోవడం అతనికి చాలా కష్టమైపోవచ్చు. మొత్తానికి, శర్వా వరుసగా చేస్తున్న ప్రయోగాలు, కథల ఎంపిక అభిమానులను నిరాశపరిచాయి. కెరీర్ తిరిగి ట్రాక్‌లోకి రావాలంటే కనీసం రెండు బ్యాక్‌ టు బ్యాక్ హిట్ సినిమాలు అందుకోవాల్సిందే. లేదంటే, ప్రస్తుతం అతను ఎదుర్కొంటున్న సంక్షోభం మరింత తీవ్రంగా మారనుందనడంలో ఎలాంటి సందేహం లేదు.