Begin typing your search above and press return to search.

కథ చెప్పాలి లేదా క్యారెక్టర్ రాయాలి..!

200, 300 ఖర్చు పెట్టి సినిమా చూసే ఆడియన్స్ కు రెగ్యులర్ రొటీన్ కథ చెబితే ఒప్పుకునే పరిస్థితి లేదు

By:  Tupaki Desk   |   26 Feb 2024 5:30 PM GMT
కథ చెప్పాలి లేదా క్యారెక్టర్ రాయాలి..!
X

200, 300 ఖర్చు పెట్టి సినిమా చూసే ఆడియన్స్ కు రెగ్యులర్ రొటీన్ కథ చెబితే ఒప్పుకునే పరిస్థితి లేదు. అందుకే స్టార్ సినిమాల నుంచి లో బడ్జెట్ సినిమాల వరకు కొత్త ప్రయత్నాలు.. సరికొత్త ప్రయోగాలు చేస్తున్నారు. అయితే ఈమధ్య సినిమాల పంథా చూస్తే.. సక్సెస్ అయిన చాలా సినిమాలు అయితే కొత్త కథతో వచ్చి హిట్ అందుకుంటున్నారు. లేద కొత్త క్యారెక్టరైజేషన్ తో వచ్చి బ్లాక్ బస్టర్ అందుకుంటున్నారు.

స్టార్ సినిమా అంటే కావాల్సినంత కమర్షియాలిటీ ఉంటూ కథ కూడా కొత్తగా ఉండేలా చూసుకుంటున్నారు. అలా కాకుండా కథ రొటీన్ గా ఎంచుకున్నా క్యారెక్టరైజేషన్ లో కాస్త కొత్తదనం చూపిస్తున్నారు. కథ కొత్తగా చెప్పే సినిమాల కన్నా క్యారెక్టరైజేషన్ డ్రైవెన్ స్టోరీస్ కు ఎక్కువ డిమాండ్ ఏర్పడుతుంది. మంచి కథ అందుకు తగిన తారాగణం.. సినిమా కథనానికి సహాయం చేసే మ్యూజిక్ ఇలా అన్ని అంశాలు కుదిరితే సినిమా సక్సెస్ అవుతుంది.

కానీ కొన్ని సినిమాలు చూస్తే కొత్త క్యారెక్టరైజేషన్ తో వచ్చినా ఫలితం సూపర్ హిట్ అవుతుంది. ముఖ్యంగా ఆడియన్స్ ఆ క్యారెక్టర్ కు కనెక్ట్ అయ్యేలా చేయడంతో సినిమాను వాళ్లు బాగా రిలేట్ చేసుకుని అలాంటి సినిమాలు హిట్ చేస్తున్నారు. అర్జున్ రెడ్డి, యానిమల్ సినిమాల ఫలితాలే వీటికి బెస్ట్ ఎక్సాంపుల్ అని చెప్పొచ్చు. ఐతే ఈ క్యారెక్టరైజేషన్ తో నడిచే సినిమాల్లో మరో రిస్క్ ఏంటంటే ఆ క్యారెక్టరైజేషన్ ఆడియన్స్ కు కనెక్ట్ అయితేనే సినిమా సక్సెస్ అవుతుంది లేకపోతే మాత్రం రివర్స్ అవుతుంది.

అయితే కొత్త కథతో వస్తే అలాంటి ఇబ్బంది ఉండదు. ఎలాగు కథ డిఫరెంట్ గా ఉంటుంది కాబట్టి ఎలాంటి కాస్టింగ్ అయినా వర్క్ అవుట్ అవుతుంది. మొత్తానికి ఈమధ్య వస్తున్న సినిమాలు కొత్త కథతో విజువల్ ఫీస్ట్ గా కొన్ని వస్తుంటే.. కేవలం క్యారెక్టరైజేషన్ ని కొత్తగా రాసుకుని ఆడియన్స్ ని అలరిస్తున్నారు. ఈ పంథా ఎన్నాళ్లు కొనసాగుతుందే ఏమో కానీ తెర మీద అద్భుతమైన కథలు.. కొత్త కొత్త పాత్ర స్వభావాలను చూసి సగటు సినీ ప్రేక్షకుడు ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ రెండు కాకుండా జస్ట్ ఎంటర్టైన్ అందించి థియేటర్ కు వచ్చే ఆడియన్స్ కు ఫన్ పంచే సినిమాలు కూడా కొన్ని వర్క్ అవుట్ అవుతున్నాయి. అయితే అలాంటి సినిమాలు ప్రేక్షకుల దాకా వెళ్లాలంటే సరైన ప్రమోషన్స్ అవసరమని చెప్పొచ్చు.