Begin typing your search above and press return to search.

మ‌ల‌బ‌ద్ద‌కానికి మందులు ఇస్తానంటూ హీరో కౌంట‌ర్

ఇత‌ర భాష‌ల్లో డంకీని ప్లాన్ చేయ‌న‌ప్పటికీ ప్ర‌భాస్ సినిమాలంటే హిందీలోనూ మంచి డిమాండ్ అన్న సంగ‌తి తెలిసిందే.

By:  Tupaki Desk   |   7 Dec 2023 12:15 PM GMT
మ‌ల‌బ‌ద్ద‌కానికి మందులు ఇస్తానంటూ హీరో కౌంట‌ర్
X

'పఠాన్'..'జ‌వాన్' విజ‌యాల‌తో రేసులో దూసుకుపోతున్న షారుక్ ఖాన్ `డంకీ`తోనూ బ్లాక్ బ‌స్ట‌ర్ అందుకుని ఏడాది హ్యాట్రిక్ హీరోగా నిల‌బ‌డ‌తాడ‌ని అభిమానులు భారీ ఆశ‌లు..అంచ‌నాలు పెట్టుకుని ఎదురు చూస్తు న్నారు. 'స‌లార్' తో పాటు 'డంకీ' కూడా ఒకేసారి రిలీజ్ అవ్వ‌డంతో రెండు సినిమా మ‌ధ్య నార్త్ రీజియ‌న్ లో పోటీ నువ్వా? నేనా? అన్న రేంజ్ లో ఉంటుందని అంచ‌నాలున్నాయి. ఇత‌ర భాష‌ల్లో డంకీని ప్లాన్ చేయ‌న‌ప్పటికీ ప్ర‌భాస్ సినిమాలంటే హిందీలోనూ మంచి డిమాండ్ అన్న సంగ‌తి తెలిసిందే.

తెలుగు లో ప్లాప్ అయిన `సాహో` హిందీలో ఏ రేంజ్ లో వ‌సూళ్లు రాబ‌ట్టిందో తెలిసిందే. ఆ న‌మ్మ‌కంతోనే షారుక్ కి పోటీగా డార్లింగ్ దిగేస్తున్నాడు. ఈ నేప‌థ్యంలో షారుక్ నెట్టింట అభిమానుల‌తో చిట్ చాట్ చేసాడు. రిలీజ్ కి ముందు ఇలా అభిమానుల‌తో ముచ్చ‌టించ‌డం అన్న‌ది షారుక్ కి ఎప్ప‌టి నుంచో ఉన్న అల‌వాటు. వ్య‌క్తిగ‌త ప‌నుల్లో ఎంత బిజీగా ఉన్నా! అభిమానుల‌కంటూ సోష‌ల్ మీడియా ద్వారా కొంత స‌మ‌యాన్ని కేటాయిస్తారు. వారితో స‌ర‌దాగా మాట్లాడుతుంటారు.

తాజాగా అలాంటి సంభాష‌ణ నేప‌థ్యంలో షారుక్ ఖాన్ కి చిర్రెత్తుకొచ్చే ఓ ప్ర‌శ్న వేసారొక‌రు. ప‌ఠాన్..జ‌వాన్ మంచి విజ‌యం సాధించాయి. అందుకు కార‌ణం మీ పీఆర్ టీమ్ బాగా పనిచేడం వ‌ల్లే . డంకీ హిట్ అవుతుందంటారా? అని అడిగాడు. దీంతో షారుక్ కూడా అదే తీరున స‌మాధానం ఇచ్చారు. `సాధార‌ణంగా మీలాంటి తెలివైన వారికి నేను స‌మాధానం చెప్ప‌ను. కానీ మీరు మాత్రం మిన‌హాయింపు.

ఎందుకంటే మీరు మ‌ల‌బ‌ద్ద‌కం కోసం చికిత్స తీసుకోవాల్సి ఉంటుంద‌ని భావిస్తున్నా. నా పీఆర్ టీమ్ బృందానికి మందులు పంపించ‌మ‌ని చెబుతా. మీరు త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ఆశిస్తున్నా` అంటూ బ‌ధులిచ్చారు. ప్ర‌స్తుతం ఈ వ్యాఖ్య‌లు నెట్టింట హాట్ టాపిక్ గా మారాయి. ఇలాంటి వారికి అలాగే స‌మాధానం చెప్పాలి సార్ అంటూ షారుక్ వ్యాఖ్య‌ల‌కు మ‌ద్ద‌తు ప‌లుకుతున్నారు.