అభిమానం హద్దులు దాటితే అంతేనా?
హీరో జడ్డ్ మెంట్ గురించి తనదైన శైలిలో వెల్లడించే ప్రయత్నం చేసాడు. ఆ వేవ్ లో కాస్త ఎమోషనల్ అయినట్లు కనిపించాడు.
By: Tupaki Desk | 17 July 2023 7:38 AM GMTఎలాంటి చెడు అయినా చెవిలో చెప్పాలి.. ఎంత మంచి విషయమైనా అందరిముందు చెప్పాలి అంటారు. అదీ రివర్స్ లో జరిగినా...చెప్పడంలో తేడా వచ్చినా? సీన్ మొత్తం రివర్స్ అవుతుంది. ఇప్పుడో రచయిత.. ఓ స్టార్ హీరో విషయంలో అలాంటిందే జరిగిందని ఫిలిం సర్కిల్స్ లో చర్చకొస్తుంది.
ఆ మధ్య ఓ స్టార్ హీరో చేసిన సినిమా బాక్సాఫీస్ వద్ద దారుణమైన పరాభవాన్ని చూసింది. ఎన్నో అంచనాల మధ్య వచ్చిన సినిమా ఊహించని ఫలితాలు సాధించింది. ఆ స్టార్ కెరీర్ లో మరో డిజాస్టర్ గా మిగిలింది.
దర్శకుడకి అది తొలి డిజాస్టర్. అప్పటివరకూ ఆ డైరెక్టర్ కి వైఫల్యం అన్నదే తెలియదు. కానీ ఆ సినిమా రూపంలో ప్లాప్ ఎదురైంది. దీనికి కారణాలు దర్శకుడితో పాటు ...అందులో హీరో కూడా ప్రధాన కారణమని అప్పట్లో ఓ వార్త వచ్చింది.
ఆయన ఫింగరింగ్ కారణంగానే సినిమా అలాంటి ఫలితాలు సాధించిందని విమర్శలు తెరపైకి వచ్చాయి. ఏది ఏమైనా ఆ సినిమా వైఫల్యం అన్నది ఇద్దరకీ చేదు అనుభవం లాంటిందే.
సహజంగా ఇలాంటివి జరిగినప్పుడు ప్రేక్షకుల్లోకి కాస్త నెగిటివ్ వెళ్తుంది. దాన్ని అంత పట్టించుకోవాల్సిన పని ఉండదు. కానీ ఓ రచయిత ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుని అభిమానం పేరుతో బరస్ట్ అయి ఆ ప్లాప్ సినిమా గురించి మరింత ఆలోచించేలా చేసాడు.ఓ వేదికలో ఆ హీరో ముందు అతన్ని ప్రశంసి స్తూ..పొగిడేస్తూ వీర లెవల్లో స్పీచ్ ఇచ్చాడు. పనిలో పనిగా ఆ సినిమా గురించి పరోక్షంగా స్పందించాడు.
హీరో జడ్డ్ మెంట్ గురించి తనదైన శైలిలో వెల్లడించే ప్రయత్నం చేసాడు. ఆ వేవ్ లో కాస్త ఎమోషనల్ అయినట్లు కనిపించాడు. సరిగ్గా ఇక్కడే ఆ హీరోని మరింత డైలమాలోకి..డిపెన్స్ లోకి నెట్టినట్లు అయింది.
జరిగిందేదో జరిగిపోయిందని వదిలేసిన విషయాన్ని గుర్తు చేసి మరోసారి ఆ హీరోని హైలైట్ చేసే ప్రయత్నంలా కనిపించింది. హీరోపై అభిమానంతో మాట్లాడిన ఎమోషన్ కంటెంట్ హైలైట్ అవ్వడంతో హీరో కూడా ఎమోనల్ సన్నివేశానికి జారుకున్నట్లు కనిపించింది.