Begin typing your search above and press return to search.

కీర్తి సురేష్ ఫోన్ నంబ‌ర్ అడిగిన హీరోలు ఎవరు?

అవును.. ప్ర‌ముఖ హీరోయిన్ కీర్తి సురేష్‌తో డేటింగ్ కోసం బేబి జాన్ హీరోని ఫోన్ నంబ‌ర్ అడిగారు.

By:  Tupaki Desk   |   25 Dec 2024 6:38 AM GMT
కీర్తి సురేష్ ఫోన్ నంబ‌ర్ అడిగిన హీరోలు ఎవరు?
X

అవును.. ప్ర‌ముఖ హీరోయిన్ కీర్తి సురేష్‌తో డేటింగ్ కోసం బేబి జాన్ హీరోని ఫోన్ నంబ‌ర్ అడిగారు. సాటి హీరోలు ఆ హీరోయిన్ తో స్నేహం కోసం త‌పించిపోయార‌ట‌. అయితే త‌న‌ను నంబ‌ర్ అడిగిన స‌హ‌చ‌ర హీరోల‌కు 'బేబి జాన్' హీరో వ‌రుణ్ ధావ‌న్ ఫోన్ నంబ‌ర్ షేర్ చేయ‌లేద‌ని తెలిపాడు. ఇటీవ‌లే త‌న స్నేహితుడు కం దుబాయ్ బిజినెస్ మేన్ ఆంటోనీని పెళ్లాడి సంసార జీవ‌నంలోకి అడుగుపెట్టిన కీర్తి తో పెళ్లికి ముందు డేటింగ్ కోసం చాలా మంది హీరోలు ప్ర‌య‌త్నించార‌ట‌. కొంద‌రు హీరోలు 'బేబి జాన్'లో కీర్తి కోస్టార్ అయిన‌ వ‌రుణ్ ధావ‌న్ ని ఫోన్ నంబ‌ర్ అడిగార‌ట‌.

ఈ విష‌యాల‌న్నీ వ‌రుణ్ తాజా ఇంట‌ర్వ్యూలో వెల్ల‌డించారు. ముంబైలో తామిద్ద‌రూ షూటింగ్ చేస్తున్న‌ప్పుడు చాలామంది హీరోలు కీర్తి ఫోన్ నంబ‌ర్ పంపించ‌మ‌ని అడిగార‌ని, అయితే త‌న బేబిని కాపాడుకునే బాధ్య‌త త‌న‌ది కాబ‌ట్టి ఎవ‌రికీ ఫోన్ నంబ‌ర్ పంప‌లేద‌ని తెలిపాడు. బేబి జాన్ షూటింగ్ స‌మ‌యంలో కీర్తి పెళ్లి గురించి చాలా చ‌ర్చ సాగింద‌ని కూడా వ‌రుణ్ తెలిపాడు.

ఇదే ఇంట‌ర్వ్యూలో కీర్తి సురేష్ మాట్లాడుతూ త‌న డేటింగ్ గురించి ఎవరికీ తెలియ‌కూడ‌ద‌ని అనుకున్న‌ట్టు తెలిపింది. కానీ అట్లీకి, అత‌డి భార్య‌కు త‌న డేటింగ్ గురించి తెలుసున‌ని, బేబి జాన్ షూటింగ్ స‌మ‌యంలో వ‌రుణ్ ధావ‌న్ కి కూడా తెలిసింద‌ని కీర్తి వెల్ల‌డించింది. వ‌రుణ్ ధావ‌న్- కీర్తి జంట‌గా న‌టించిన బేబి జాన్ డిసెంబ‌ర్ 25 నుంచి థియేట‌ర్ల‌లో అందుబాటులోకి వ‌చ్చింది.