మహేష్ సహా హీరోలంతా కఠోరమైన శిక్షణలో!
సినిమాలో వాస్తవాన్ని ఆవిష్కరించే క్రమంలో రిస్క్ కి సైతం వెనుకాడరు.
By: Tupaki Desk | 22 July 2023 5:22 AM GMTకొన్నిసార్లు హీరోలు తెరపైనే కాదు..రియల్ లైఫ్ లోనూ సాహసోపేతమైన యాక్షన్ సన్నివేశాల్లో పాల్గొని రియల్ హీరోలు అనిపిస్తుంటారు. సినిమాలో వాస్తవాన్ని ఆవిష్కరించే క్రమంలో రిస్క్ కి సైతం వెనుకాడరు. అందుకోసం నెలలు తరపబడి కఠోరమైన శిక్షణ తీసుకుంటారు. ట్రైనర్ల ఆధ్వర్యంలో సన్నివేశాలకు ఎంత అవసరమో అంతవరకూ ప్రత్యేక శిక్షణ తీసుకుంటారు.
ఈ విషయంలో హీరోయిన్లు కూడా ఏ మాత్రం తక్కువ కాదు. హీరోలకు ధీటుగా వారు కూడా యాక్షన్ సన్నివేశాల్లో రియలిస్టిక్ స్టంట్స్ తో మెప్పిస్తున్నారు. సూపర్ స్టార్ మహేష్... మాలీవుడ్ స్టార టోవినో థామస్.. యంగ్ హీరో వైష్ణవ్ తేజ్..చందమామ కాజల్ అగర్వాల్ కూడా కొన్ని సన్నివేశాల కోసం ప్రత్యేక శిక్షణ తీసుకున్నట్లు తెలుస్తోంది.
మహేష్ కథానాయకుడిగా రాజమౌళి దర్శకత్వంలో భారీ యాక్షన్ థ్రిల్లర్ తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఆప్రికన్ అడవుల నేపథ్యంలో సాగే అడ్వెంచర్ చిత్రం కావడంతో మహేష్ సినిమా కోసం ప్రత్యేకంగా సన్నదం కావాల్సి ఉంది.
ఈ నేపథ్యంలో మూడు నెలలు పాటు బ్యాంకాక్ లో మిక్స్ డ్ మార్షల్ ఆర్స్ట్ శిక్షణ కి రెడీ అవుతున్నట్లు తెలిసింది. ట్రైనింగ్ తో పాటు హైకింగ్..ట్రెక్కింగ్ వంటి వాటిపైనే శిక్షణ ఉంటుందని తెలిసింది. బ్యాంకాంక్ స్టంట్ టీమ్ కి ఓ హాలీవుడ్ స్టంట్ మాస్టర్ నేతృత్వం వహిస్తారని సమాచారం. 'గుంటూరు కారం' షూటింగ్ పూర్తయిన వెంటనే మహేష్ బ్యాంకాంక్ ట్రైనింగ్ బయల్దేరు తారని తెలుస్తోంది.
ఇక యంగ్ హీరో వైష్ణవ్ తేజ్ 'ఆదికేశవ' కోసం థాయ్ లాండ్ లో ఇప్పటికే మిక్స్ డ్ మార్షళ్ ఆర్స్ట్ ట్రైనింగ్ తీసుకున్నట్లు తెలిసింది. హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ కావడంతో దర్శకుడు శ్రీకాంత్ ఎన్. రెడ్డి ఆదేశాల మేరకు శిక్షణ పూర్తిచేసి షూటింగ్ లో పాల్గొంటున్నట్లు తెలుస్తోంది.
అలాగే మాలీవుడ్ స్టార్ టోవినో థామస్ కూడా 'అజయంతే రందం మోషణం' సినిమా కోసం కేరళలో ప్రత్యేకమైన కళ మార్షల్ ఆర్స్ట్ వర్గానికి చెందిన 'కలరి' అనే నైపుణ్యంలో ఆరితేరినట్లు సమాచారం.
ఇది ఎంతో ఏకాగ్రతతో నేర్చుకోవాల్సి న విద్య అని తెలుస్తోంది. ఇక' ఇండియన్ -2' కోసం చందమామ కాజల్ అగర్వాల్ కూడా మార్షల్ ఆర్స్ట్ లో కొంత శిక్షణ తీసుకున్నట్లు తెలుస్తోంది. కొన్ని యాక్షన్ సన్నివేశాల కోసం దర్శకుడు శంకర్ ఆదేశించడంతో కాజల్ కూడా అంతే శ్రద్దగా నేర్చుకున్నట్లు తెలుస్తోంది.
ఇదే సినిమా కోసం గుర్రపు స్వారీ కూడా నేర్చుకుంది. 'భారతీయుడు' కోసం కమల్ అప్పట్లో నర్మకళ అనే విలువిద్య నేర్చుకున్నారు. 'ఇండియన్ -2' లోనూ అదే కళని రిపీట్ చేస్తారా? కొత్త కళ వైపు వెళ్లారా? అన్నది సస్పెన్స్.