500 కోట్ల హీరోలు.. లిస్టులో ఎవరెవరున్నారంటే..
అప్పట్లో బాలీవుడ్ సినిమాలు మాత్రమే రూ.100 కోట్ల కలెక్షన్స్ అందుకునేవి కానీ గత కొద్ది సంవత్సరాలుగా సౌత్ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర అదరగొడుతున్నాయి
By: Tupaki Desk | 31 Dec 2023 2:30 AM GMTగత కొన్నేళ్లుగా ఇండియన్ బాక్సాఫీస్ మార్కెట్ చాలా ఎక్కువగా పెరుగుతూ వస్తోంది. ఒకప్పుడు ఓ సినిమా రూ.100 కోట్లు కలెక్ట్ చేయడమే గగనం. అప్పట్లో బాలీవుడ్ సినిమాలు మాత్రమే రూ.100 కోట్ల కలెక్షన్స్ అందుకునేవి కానీ గత కొద్ది సంవత్సరాలుగా సౌత్ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర అదరగొడుతున్నాయి. ఇప్పటి సినిమాలకి రూ.100 కోట్ల నుంచి రూ.300 కోట్లకు రావడానికి ఎంతో సమయం పట్టడం లేదు.
ఇక ఆ తరువాత పాన్ ఇండియా ట్రెండ్ వచ్చాక రూ.500 కోట్ల నుండి వెయ్యి కోట్లు అనేది ఇప్పుడు ఒక ప్రత్యేకమైన టార్గెట్ లుగా మారాయి. ముఖ్యంగా పెద్ద హీరోల సినిమాలు ఇండియా లెవెల్ లో విడుదలైతే తప్పకుండా రూ.500 కోట్లు దాటడం చూస్తూనే ఉన్నాం.ఇక మరికొన్ని సినిమాల్లో అయితే ఈజీగా రూ.1000 కోట్ల వసూళ్లను సాధించడానికి దూసుకుపోతున్నాయి. కాగా ఇప్పటి వరకు ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ఎక్కువసార్లు రూ.500 కోట్ల కలెక్షన్ సాధించిన హీరోలు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం..
1. అమీర్ ఖాన్ : ఈ బాలీవుడ్ అగ్ర హీరో దంగల్, సీక్రెట్ సూపర్ స్టార్, పీకే వంటి సినిమాలతో మూడుసార్లు ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద రూ.500 కోట్లు కొల్లగొట్టాడు.
2. ప్రభాస్ : బాహుబలి, బాహుబలి 2, సలార్ సినిమాలతో ప్రభాస్ కూడా మూడుసార్లు బాక్స్ ఆఫీస్ వద్ద రూ.500 కోట్ల కలెక్షన్స్ సాధించాడు.
3. సల్మాన్ ఖాన్ : సల్మాన్ ఖాన్ కూడా మూడుసార్లు ఈ రేర్ ఫీట్ ని అందుకున్నాడు. ఈ బాలీవుడ్ అగ్ర హీరో నటించిన బజరంగీ భాయ్ జాన్, సుల్తాన్, టైగర్ జిందా హై వంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద రూ.500 కోట్ల వసూళ్ళు అందుకున్నాయి.
4. రజినీకాంత్ : కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ 2.0, జైలర్ సినిమాలతో రెండుసార్లు బాక్స్ ఆఫీస్ వద్ద రూ.500 కోట్ల మార్క్ అందుకున్నారు.
5. షారుక్ ఖాన్ : బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ ఈ ఏడాది పఠాన్, జవాన్ సినిమాలతో రెండుసార్లు బాక్స్ ఆఫీస్ వద్ద రూ.500 కోట్లు కొల్లగొట్టాడు.
6. రణ్ బీర్ కపూర్ : సంజు, యానిమల్ వంటి సినిమాలతో రణ్ బీర్ కూడా రెండుసార్లు రూ.500 కోట్ల కలెక్షన్స్ సాధించాడు.