Begin typing your search above and press return to search.

పని మనిషిని కొట్టిన హీరోయిన్.. పోలీసు కేసు బుక్

దీంతో కోర్టును ఆశ్రయించి మరీ పోలీసుల చేత కేసు నమోదు చేసిన వైనం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

By:  Tupaki Desk   |   24 Sep 2024 4:18 AM GMT
పని మనిషిని కొట్టిన హీరోయిన్.. పోలీసు కేసు బుక్
X

మలయాళ చిత్రాల్లోనే కాదు తమిళ.. కన్నడ చిత్రాల్లోనూ హీరోయిన్ గా నటిస్తూ.. క్రేజ్ సొంతం చేసుకున్న పార్వతి నాయర్ ఇప్పుడో వివాదంలో ఇరుక్కున్నారు. ఆమె దగ్గర పని చేసిన పని మనిషి ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేసిన పరిస్థితి. ఆమెతో పాటు.. మరో నలుగురిపైనా సదరు పనిమనిషి ఫిర్యాదు చేశారు. అయితే.. అతగాడి కంప్లైంట్ ను పోలీసులు పట్టించుకోలేదు. దీంతో కోర్టును ఆశ్రయించి మరీ పోలీసుల చేత కేసు నమోదు చేసిన వైనం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇంతకూ అసలేం జరిగిందంటే..

కేజేఆర్ స్టూడియోలో సుభాష్ చంద్రబోస్ అనే వ్యక్తి హెల్పర్ గా పని చేసేవాడు. 2022 నుంచి పార్వతి నాయర్ ఇంట్లో పని మనిషిగా పని చేస్తున్నాడు. అయితే.. అదే ఏడాది అక్టోబరులో చెన్నైలోని పార్వతి నాయర్ ఇంట్లో చోరీ జరిగింది. ఇందులో భాగంగా రూ.9 లక్షలు విలువైన రెండు వాచీలు.. రూ.1.5 లక్షలు విలువైన యాపిల్ ఫోన్ తో పాటు రూ.2 లక్షలు విలువైన ల్యాప్ టాప్ పోయింది.

ఈ చోరీకి కారణం తన వద్ద పని చేసే సుభాష్ గా ఆరోపిస్తూ పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. దీంతో.. అతడ్ని అరెస్టు చేసిన పోలీసులు రిమాండ్ కు తరలించారు. ఆ తర్వాత కాలంలో జైలు నుంచి విడుదలయ్యాడు. ఇక్కడి వరకు ఇలా జరిగితే.. ఆ తర్వాతే అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. జైలు నుంచి విడుదలైన తర్వాత తాను గతంలో పని చేసిన కేజేఆర్ స్టూడియోలో పనికి చేరాడు.

షూటింగ్ కోసం స్టూడియోకు వచ్చిన పార్వతి నాయర్ తనపై దాడి చేసిందని పేర్కొంటూ సుభాష్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే.. అతడి ఫిర్యాదును పోలీసులు పట్టించుకోలేదు. అయితే.. ఆమెతో ఉన్న నలుగురు తనపై దాడికి పాల్పడినట్లుగా ఆరోపించారు. తీవ్రమైన బూతులు తిట్టినట్లుగా పేర్కొన్నారు. ఈ ఫిర్యాదును పెద్దగా పట్టించుకోని పోలీసుల తీరుతో కోర్టును ఆశ్రయించారు. న్యాయస్థానం నుంచి అందిన ఆదేశాల నేపథ్యంలో హీరోయిన్ పార్వతి నాయర్ తో పాటు మరో నలుగురు మీదా కేసు నమోదు చేశారు పోలీసులు. ఈ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. తదుపరి చర్యలు విచారణ పూర్తి చేసిన తర్వాతే చేపడతామని పోలీసులు పేర్కొన్నారు.