అందమైన భామలే కాదు...ఆస్తుల్లోనూ అంతకు మించే!
ఆరంభంలో హీరోయిన్ల కెరీర్ వేల నుంచి మొదలై అటు పై లక్షలకు, కోట్లకు పడగెత్తుతుంది. అలా కెరీర్ ప్రారంభించి కోట్ల రూపాయల ఆస్తులు కూడబెట్టిన భామలెంతో మంది.
By: Tupaki Desk | 20 July 2024 10:30 AM GMTసక్సెస్ అయితే హీరోయిన్లకు డిమాండ్ పీక్స్ లో ఉంటుంది. ఫేం లో ఉన్నంత కాలమే సంపాదిం చుకోవాలి అన్న రూల్ ప్రకారమే దాదాపు హీరోయిన్లు అంతా పనిచేస్తారు. ఆరంభంలో హీరోయిన్ల కెరీర్ వేల నుంచి మొదలై అటు పై లక్షలకు, కోట్లకు పడగెత్తుతుంది. అలా కెరీర్ ప్రారంభించి కోట్ల రూపాయల ఆస్తులు కూడబెట్టిన భామలెంతో మంది. అందాల త్రిష రెండు దశాబ్దాల చిత్ర పరిశ్రమలో కొనసాగుతోంది.
కొంత కాలంగా అమ్మడు ఒక్కో సినిమాకి 6 నుంచి 10 కోట్ల మధ్యలో ఛార్జ్ చేస్తోంది. మొత్తం ఆస్తుల విలువ 100కోట్లు. ప్రస్తుతం త్రిష చిరంజీవి, కమల్ హాసన్ సినిమాల్లో నటిస్తోంది. ఇంకా కొత్త సినిమాలు కమిట్ అయింది. వాటి వివరాలు ప్రకటించాల్సి ఉంది. అలాగే పూజాహెగ్డే కెరీర్ పీక్స్ లో ఉండగా టాలీవుడ్ నుంచి బాలీవుడ్ కి వెళ్లి రేసులో వెనుకబడింది. ప్రస్తుతం అమ్మడి డిమాండ్ ఒక్కో సినిమాకి నాలుగు కోట్ల వరకూ డిమాండ్ చేస్తోంది. తెలుగు, తమిళ్ లో ఒక్కో సినిమా చొప్పున పని చేస్తోంది.
పూజాహెగ్డే ఆస్తుల విలువ రూ.55 నుంచి రూ.60 కోట్ల వరకూ ఉన్నట్లు అంచనా. అలాగే చందమామ కాజల్ అగర్వాల్ సుదీర్గ కాలంగా నటిగా కొనసాగుతోంది. ఈ భామ మూడు నుంచి 4 కోట్ల మధ్యలో తీసుకుం టుంది. ఈ అమ్మడి ఆస్తుల విలువ రూ.60 నుంచి రూ.65 కోట్ల వరకు ఉంటాయట. ఇక నేషనల్ క్రష్ రష్మిక మందన్న కెరీర్ కొన్నాళ్లగా జెట్ స్పీడ్ తో దూసుకుపోతుంది. పట్టిందల్లా బంగారమే అవుతోంది.
ఈ అమ్మడు సినిమాకు రూ.5 నుంచి రూ.6 కోట్లు తీసుకుంటోందిట. ఆమె ఆస్తుల విలువ రూ.70 నుంచి రూ.80 కోట్ల మధ్యలో ఉన్నట్లు సమాచారం. అలాగే రకుల్ ప్రీత్ సింగ్ సినిమాకు రూ.3.5 కోట్ల వరకు తీసుకుంటుందిట. ఆమె ఆస్తుల విలువ రూ.50 నుంచి రూ.55 కోట్ల మధ్యలో ఉంటుందని అంచనా. అలాగే కీర్తి సురేష్ అలియాస్ మహానటి కెరీర్ ఆ మధ్య స్లో అయినా మళ్లీ స్పీడందుకుంది. బాలీవుడ్ అవకాశాలు కూడా అందుకుంటుంది.
ఒక్కో సినిమాకు రూ.4 కోట్ల వరకూ తీసుకుంటుందని సమాచారం. ఆమె ఆస్తుల విలువ రూ.50 కోట్లకుపైగా ఉంటుందిట. ఇక లేడీ సూపర్ స్టార్ నయనతార రేంజ్ గురించి చెప్పాల్సిన పనిలేదు. అమ్మడు డిమాండ్ చేయాలేగానీ ఎంతైనా ఇవ్వడానికి నిర్మాతలు రెడీగా ఉన్నారు. కానీ ఆమె 10 నుంచి 12 కోట్లు తీసుకుం టుందిట.
ఆమె ఆస్తుల విలువ రూ.300 కోట్లకు పైగా ఉంటుందని సమాచారం. ఈ అమ్మడికి ప్రయివేట్ జెట్ కూడా ఈమెకు ఉంది. ఇక సమంత 8 కోట్లు పారితోషికం తీసుకుంటుండగా, ఆమె ఆస్తుల విలువ 110 కోట్లగా ఉందిట. ఇక అనుష్క శెట్టి 5 కోట్లు పారితోషికంగా తీసుకుంటుంది. ఆమె ఆస్తులు రూ.135 కోట్లుగా ఉన్నట్లు అంచనా. అలాగే తమన్నా సినిమాకు రూ.5 కోట్లు తీసుకుంటోంది. ఆమె ఆస్తుల విలువ రూ.140 కోట్ల వరకు ఉంటుందని అంచనా.