గుసగుస.. రైటర్‌తో హీరోయిన్ డీప్ లవ్!
ఒక ప్రముఖ హీరోతో ఆన్-స్క్రీన్ కెమిస్ట్రీ .. ఆఫ్ స్క్రీన్ కెమిస్ట్రీ గురించి ఇంతుకుముందు పుకార్లు వచ్చాయి.
By: Tupaki Desk | 10 Oct 2023 2:45 AM GMTఫలానా హీరో లేదా డైరెక్టర్‌తో హీరోయిన్ డేటింగ్ లో ఉంది! అంటూ కథనాలు రావడం సహజం. కానీ సదరు స్టార్ హీరోయిన్ తన సినిమాకు పని చేసిన రైటర్ తో నిండా ప్రేమలో ఉందంటూ బలమైన పుకార్లు వినిపిస్తున్నాయి. నిజానికి ఆ హీరోయిన్ ఇంతకుముందు తనతో నటించిన స్టార్ హీరోతో ప్రేమలో ఉందని జోరుగా షికార్లు చేస్తోందని పుకార్లు వచ్చాయి. కానీ ఇటీవల కొంతకాలంగా హీరోలతో ఎఫైర్ కహానీలేవీ వినిపించడం లేదు.
ఒక ప్రముఖ రచయితతో నిండా ప్రేమలో మునిగిపోయిందని మీడియాలో పుకార్లు షికార్ చేస్తున్నాయి. ఆ మేరకు ప్రముఖ వెబ్ సైట్లు కథనాలు వెలువరించడం వేడెక్కిస్తోంది. ఒక ప్రముఖ హీరోతో ఆన్-స్క్రీన్ కెమిస్ట్రీ .. ఆఫ్ స్క్రీన్ కెమిస్ట్రీ గురించి ఇంతుకుముందు పుకార్లు వచ్చాయి.
ఆ పుకార్లను వారు అధికారికంగా ధృవీకరించలేదు లేదా తిరస్కరించలేదు. దీంతో స్నేహితులుగా మాత్రమే కొనసాగుతున్నారని అర్థం చేసుకోవాల్సి వచ్చింది. కొన్నేళ్లకు ప్రముఖ ఫోటోగ్రాఫర్ డేటింగ్ చేసిందంటూ ప్రచారమైంది.
ఇద్దరూ తరచుగా ఈవెంట్‌లు, పార్టీలలో కలిసి కనిపించడంతో ఈ పుకార్లు షికార్ చేసాయి. అయితే అలా తనపై పుకార్ వచ్చిన ప్రతిసారీ ఎలా స్పందించిందో ఇప్పుడు కూడా అంతే మౌనంతో దీనిని డీకోడ్ చేయనీకుండా చేస్తోంది సదరు బ్యూటీ. సదరు హీరోయిన్ తన వ్యక్తిగత జీవితం గురించి ఎప్పుడూ మీడియా ఎదుట పెదవి విప్పలేదు.
మీడియాలో ఇంత ప్రచారం వేడెక్కిస్తున్నా కానీ అదే తరహా మౌనం పాటిస్తోంది. ఇటీవల తాను నటించిన బ్లాక్ బస్టర్ చిత్రానికి సహ రచయితగా ఉన్న యువరచయితతో సదరు హీరోయిన్ డేటింగ్ చేస్తోందని కథనాలొస్తున్నాయి.
ఈ జంట ప్రేమాయణంపై ప్రూఫ్ లు పరిమితంగానే లభించాయి. ఇరువురిలో ఎవరూ తమ డేటింగ్ పై అధికారిక ప్రకటనలు చేయలేదు. దీంతో ఊహాగానాలు యథావిధిగా కొనసాగుతున్నాయి. ఆ ఇద్దరూ తమ వ్యక్తిగత జీవితాలను లోప్రొఫైల్ లో ఉంచుతున్నారు.
దానివల్ల వారి మధ్య అనుబంధం ఎలాంటిదో ప్రస్తుతానికి మిస్టరీగా మిగిలిపోయింది. ఈ కొత్త పరిణామం విషయంలో అభిమానులు, మీడియా ఆసక్తిగా ఉన్నారు. అసలింతకీ ఆ ఇద్దరి మధ్యా ఏం జరుగుతోంది? అన్నది ఇప్పటికైతే సస్పెన్స్.