Begin typing your search above and press return to search.

పాన్ ఇండియాలో భామ‌ల‌ జాక్ పాట్

ఇది టాలీవుడ్ రేంజును అమాంతం పెంచింది. బ‌హుబ‌లి త‌ర్వాత కీల‌క ప‌రిణామ‌మిది.

By:  Tupaki Desk   |   10 April 2024 2:45 AM GMT
పాన్ ఇండియాలో భామ‌ల‌ జాక్ పాట్
X

ఇటీవ‌ల పాన్ ఇండియా ట్రెండ్ చ‌ర్చ‌నీయాంశంగా మారింది. భారీత‌నం నిండిన కాన్సెప్టులు ఎంచుకుంటూ యూనివ‌ర్శ‌ల్ అప్పీల్ తో సినిమాలు తీయ‌డానికి ద‌ర్శ‌క‌ నిర్మాత‌లు అల‌వాటు ప‌డుతున్నారు. ఫార్ములాటిక్ సినిమాల కంటే ప్ర‌యోగాల‌కు ఆస‌క్తిగా ఉన్నారు. బ‌డ్జెట్ల రేంజు పెంచి, పాన్ ఇండియాలో సినిమాల్ని రిలీజ్ చేస్తున్నారు. తెలుగు-హిందీ స‌హా ఇత‌ర ద‌క్షిణాది భాష‌ల్లో సినిమాల‌ను విడుద‌ల చేస్తున్నారు. ఇది టాలీవుడ్ రేంజును అమాంతం పెంచింది. బ‌హుబ‌లి త‌ర్వాత కీల‌క ప‌రిణామ‌మిది.

అయితే పాన్ ఇండియా ట్రెండ్ ఎవ‌రికి క‌లిసొచ్చింది? ముఖ్యంగా క‌థానాయిక‌ల్లో పాన్ ఇండియా ట్రెండ్ తో లాభ‌ప‌డిన వారు ఎవ‌రున్నారు? అంటే.. దానికి స‌రైన జ‌వాబు దొరికింది. నిజానికి పాన్ ఇండియా ట్రెండ్ తో కొన్ని చెప్పుకోద‌గ్గ అవ‌కాశాలు అందుకుంది మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా. బాహుబ‌లి లో అవంతిక‌గా న‌టించిన త‌మ‌న్నాకు అంత‌కుముందు స‌రైన అవ‌కాశాల్లేవ్. కెరీర్ అంతంత మాత్రంగానే ఉంది. కానీ బాహుబ‌లితో దేశవ్యాప్తంగా గుర్తింపు ద‌క్క‌డ‌మే గాక‌, అటుపై హిందీలోను అవ‌కాశాలొచ్చాయి. ఇటీవ‌ల వెబ్ సిరీస్ ల‌తోను పాన్ ఇండియాలో పాపులారిటీ పెంచుకుంది.

స‌మంత రూత్ ప్ర‌భుకి పాన్ ఇండియా ట్రెండ్ బాగా క‌లిసొచ్చింద‌ని చెప్పాలి. ముఖ్యంగా రాజ్ అండ్ డీకే ఫ్యామిలీమ్యాన్ సీజ‌న్ 2తో పాన్ ఇండియాలో స‌మంత పేరు మార్మోగిపోయింది. అంత‌కుముందే పుష్ప‌లో ఊ అంటావా పాట‌తోను ఒక ఊపు ఊపింది. ఇక ఇదే హుషారులో ఇప్పుడు హిందీ చిత్ర‌సీమ‌లో స‌మంత అడుగుపెడుతోంది. అక్క‌డ స‌ల్మాన్ స‌ర‌స‌న ఈ బ్యూటీకి అవ‌కాశం ఉంద‌ని తెలిసింది. ప‌లు నిర్మాణ సంస్థ‌లు స‌మంత‌కు అవ‌కాశాలు క‌ల్పించాయ‌ని ప్ర‌చార‌మ‌వుతోంది. ఫ్యామిలీమ్యాన్ 2 త‌ర్వాత సిటాడెల్- హ‌నీ బ‌న్నీ త‌న‌కు పెద్ద అస్సెట్ కానుంది. ఇప్పుడు పాన్ ఇండియా స్టార్‌డ‌మ్ తో దూసుకుపోనుంది.

అందాల తాప్సీ - సెల‌క్టివ్ పాత్ర‌ల‌తో పాన్ ఇండియాలో గుర్తింపు తెచ్చుకుంది. బాలీవుడ్ లో కొన్ని ఫైనెస్ట్ సినిమాల్లో న‌టించిన తాప్సీ కంటెంట్ డ్రివెన్ సినిమాల‌తో అంద‌రి మెప్పును అందుకుంది. ఇటీవ‌ల తాప్సీ బిజీయెస్ట్ హీరోయిన్ గా మారింది. సౌత్ లో త‌న‌కు ఆశించిన స్టార్ డ‌మ్ ద‌క్క‌లేదు. ఇక్క‌డ‌ ద‌క్క‌నిది పాన్ ఇండియా ట్రెండ్ వ‌ల్ల ద‌క్కించుకుంద‌ని చెప్పాలి.

న‌య‌నతార `జ‌వాన్` స‌క్సెస్‌తో పాన్ ఇండియా స్టార్‌గా పాపుల‌రైంది. అంత‌కుముందు సౌత్ సినిమాల‌తోను న‌య‌న్ హిందీ ఆడియెన్ కి సుప‌రిచితురాలు. పాన్ ఇండియాలోకి ప్ర‌వేశించ‌క ముందే న‌య‌న్ బిజీ న‌టి. అయితే షారూఖ్ స‌ర‌స‌న జ‌వాన్ లో న‌టించాక త‌న పారితోషికం రేంజ్ అమాంతం పెంచేసింద‌ని తెలుస్తోంది. న‌య‌న్ క్రేజ్ ఇప్పుడు రెట్టింపైంది.

పాన్ ఇండియా ట్రెండ్ లో చ‌క్క‌ని అవ‌కాశం ద‌క్కించుకున్న బ్యూటీ ఎవ‌రంటే రాశీ ఖ‌న్నా పేరు చెప్పాలి. రాజ్ అండ్ డీకే లాంటి క్రేజీ డైరెక్ట‌ర్లు రూపొందించిన `ఫ‌ర్జీ` త‌న కెరీర్ కి కీల‌క‌ బూస్ట్ గా మారింది. రాజ్ అండ్ డీకేతో ప‌ని చేయ‌డం రాశీకి ప్ల‌స్ గా మారింది. త‌దుప‌రి రాశీ ఖ‌న్నా వ‌రుస‌గా భారీ చిత్రాల్లో న‌టించే అవ‌కాశాలు అందుకుంటోంది. ఇటీవ‌ల సిద్ధార్థ్ మ‌ల్హోత్రాతో యోధ లాంటి భారీ చిత్రంలో న‌టించిన సంగ‌తి తెలిసిందే. సౌత్ లో రాశీ కెరీర్ అంతంత‌మాత్రంగానే ఉన్న క్ర‌మంలో ఇది త‌న కెరీర్ కి కీల‌క మ‌లుపు.

వీళ్ల‌తో పాటు ప‌లువురు అందాల క‌థానాయిక‌ల‌కు పాన్ ఇండియాలో క్రేజ్ పెరిగింది. వీళ్ల‌కు ఇప్పుడు అవ‌కాశాల విస్తృతి మ‌రింత పెరిగిందే కానీ త‌గ్గ‌లేదు.