Begin typing your search above and press return to search.

రెండు భాగాల సినిమా.. హీరోయిన్లకు అన్యాయమేనా..?

కానీ అసలు విషయం ఏంటంటే ఆ సినిమాల వల్ల వారికి ఎలాంటి ఉపయోగం ఉండదు.

By:  Tupaki Desk   |   10 Jan 2025 5:44 AM GMT
రెండు భాగాల సినిమా.. హీరోయిన్లకు అన్యాయమేనా..?
X

టాలీవుడ్ లో ఈమధ్య వస్తున్న స్టార్ సినిమాలు అన్నీ కూడా పాన్ ఇండియా రిలీజ్ అవుతున్నాయి. ఐతే ఆ సినిమాల వల్ల హీరోల ఇమేజ్ డబుల్ ట్రిపుల్ అవుతుంది కానీ అందులో నటించే హీరోయిన్స్ పరిస్థితి మాత్రం అసలే మాత్రం బాగాలేదు. రెండు భాగాల సినిమా అన్నప్పుడు డైరెక్టర్స్ అంతా కూడా హీరో పాత్ర మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. హీరో క్యారెక్టరైజేషన్ గురించి డిఫరెంట్ గా ఆలోచిస్తున్నారు తప్ప ఆ కథలో కొనసాగుతున్న హీరోయిన్స్ గురించి అసలేమాత్రం పట్టించుకోవట్లేదు. ఏదో రెండు పార్ట్ లో హీరోయిన్ ఉండాలి కాబట్టి అందుకోసమే అన్నట్టు ఉంది.

పాన్ ఇండియా సినిమాల్లో ముఖ్యంగా టూ పార్ట్స్ సినిమా అంటే హీరోయిన్స్ కూడా క్రేజీగా ఫీల్ అవుతున్నారు. కానీ అసలు విషయం ఏంటంటే ఆ సినిమాల వల్ల వారికి ఎలాంటి ఉపయోగం ఉండదు. పాన్ ఇండియా లెవెల్ లో సినిమా రిలీజ్ అనే హంగామా తప్ప అందులో నటించే కథానయికలకు పెద్దగా ప్రాధాన్యత ఉండదు. ఎవరో ఒకరిద్దరికి అది కూడా కథలో భాగమయ్యే కథానాయిక పాత్ర దొరుకుతుంది కానీ మిగతా వారికి అలాంటి పాత్రలు దొరకడం చాలా కష్టం. ఐతే ఈ విషయంలో కొందరు లక్కీ అవుతుంటే మరికొందరు మాత్రం అన్ లక్కీ అవుతున్నారు.

నేషనల్ వైడ్ గా సినిమా రిలీజ్ అనుకుంటూ సంతోషంగా సినిమాలు ఒప్పుకునే హీరోయిన్స్ సినిమా రెండు భాగాల్లో తమ స్క్రీన్ స్పేస్ చూసి షాక్ అవుతున్నారు. కొందరేమో రెమ్యునరేషన్ కోసం ఇలాంటి సినిమాలు చేస్తుంటే నిజంగా కెరీర్ మీద కాస్త భయభక్తులు ఉన్న వారు మాత్రం రిస్క్ ఫేస్ చేస్తున్నారు. అందుకే పాన్ ఇండియా సినిమా అయినా అది రెండు భాగాలుగా వస్తున్నా సరే కథలో తమ పాత్ర వెయిట్ ఉంటేనే సినిమాలు చేయాలని కొందరు హీరోయిన్స్ ఫిక్స్ అయ్యారు. అలా తమ దాక వచ్చిన కొన్ని ఛాన్స్ లను మిస్ చేసుకున్న హీరోయిన్స్ కూడా ఉన్నారు.

రెండు భాగాల సినిమా హీరోలకే ప్లస్ అవుతుంది కానీ హీరోయిన్స్ కి కాదు. ఈ విషయంలో ఇప్పుడిప్పుడే కథానాయికలకు ఒక క్లారిటీ వస్తుంది. తప్పకుండా ఇలాంటి సినిమాల్లో హీరోయిన్ పాత్రల విషయంలో దర్శక నిర్మాతలు తమ నిర్ణయం మార్చుకునేలా చేయాలని చూస్తున్నారు. మరి అది ఎప్పటికి సాధ్యపడుతుందో చూడాలి.