Begin typing your search above and press return to search.

టాప్ స్టోరి: స‌ర్జ‌రీతో రూపం నాశ‌న‌మైన హీరోయిన్లు

కాస్మెటిక్ సర్జరీ తర్వాత కొంద‌రు నటీమణులు తమ రూపాన్ని నాశనం చేసుకున్నారు.

By:  Tupaki Desk   |   2 Oct 2023 3:45 AM GMT
టాప్ స్టోరి: స‌ర్జ‌రీతో రూపం నాశ‌న‌మైన హీరోయిన్లు
X

కాస్మెటిక్ సర్జరీ తర్వాత కొంద‌రు నటీమణులు తమ రూపాన్ని నాశనం చేసుకున్నారు. అందం మెరుగుద‌ల పేరుతో ఉచ్చులో చిక్కుకుని గిల‌గిల‌లాడిన ప‌లువురు క‌థానాయిక‌ల గురించి చ‌ర్చిస్తే.. వివ‌రాలు ఇలా ఉన్నాయి. ఇందులో బాలీవుడ్ నటీమణులదే మెజారిటీ వాటా. కాస్మెటిక్ సర్జరీ తప్పుగా జరిగ‌డంతో వీరంతా వికృతంగా మారి అభిమానుల్ని భ‌య‌పెట్టారు. ఆ త‌ర్వాత కెరీర్ కూడా నాశ‌న‌మైంది.

అయేషా టాకియా:

ఈ బ్యూటీ కింగ్ నాగార్జున స‌ర‌స‌న సూప‌ర్ చిత్రంలో న‌టించింది. త‌నదైన హాటెస్ట్ అవ‌తార్ తో గుబులు రేపిన అయేషా ట‌కియా ఆ త‌ర్వాత తెలుగులో పెద్ద‌గా న‌టించ‌లేదు. సూప‌ర్ చిత్రంలో అనుష్క‌కు ధీటుగా అందాలు ఆర‌బోసింది ట‌కియా. స‌ల్మాన్ వాంటెడ్ లోను అయేషా ట‌కియా హీరోయిన్ గా న‌టించింది. ట‌కియాకు పెదవుల పెరుగుదల రాంగ్ గా మారింది. త‌న‌ పెదవులు స‌ర్జ‌రీ త‌ర్వాత చాలా పెద్దవిగా అసహజంగా మారాయి. అందుకు సంబంధించిన ఫోటోలు అంత‌ర్జాలంలో వైర‌ల్ అయ్యాయి. అయేషా ట‌కియా కెరీర్ ఆల్మోస్ట్ నాశ‌నమైంది. క‌నీసం చాలామంది హీరోయిన్ల త‌ర‌హాలో తిరిగి కంబ్యాక్ కోసం కూడా ప్ర‌య‌త్నించ‌లేదు.

సోఫియా హయత్:

సోఫియా హయత్ ఇంత‌కుముందు మ‌హేష్ సినిమాలో ఐట‌మ్ నంబ‌ర్ లో న‌ర్తించింది. కానీ తెలుగులో ఛాన్సులేవీ రాలేదు. ఈ భామ పెద్ద‌ పెదవుల వెన‌క మ‌త‌ల‌బ్ ఎవ‌రికీ అర్థం కాదు. పెద‌వులు రాంగ్ సైడ్ పెరుగుదలకు కార‌నం శస్త్రచికిత్స తప్పుగా జర‌గ‌డ‌మేన‌ని ప్ర‌చార‌మైంది. త‌న‌ పెదవులు నిండుగా ఉబ్బినట్లుగా కనిపిస్తాయి.

కోయెనా మిత్ర:

కొయెనా మిత్రకు ముక్కు ఆకృతి తేడా కొట్టింది. రాంగ్ స‌ర్జ‌రీ వ‌ల్ల‌నే ఈ ఫ‌లితం అని మీడియాలో క‌థ‌నాలొచ్చాయి. అందాల క‌థానాయిక‌ ముక్కు అసహజంగా వికృతంగా మారిపోయాక సినిమాల‌కు దూర‌మైంది. ఛాన్సులిచ్చేవాళ్లు లేక ఇబ్బంది ప‌డింది.

అనుష్క శర్మ:

విరాట్ కోహ్లీని పెళ్లాడిన అనుష్క శర్మ కాస్మోటిక్ స‌ర్జ‌రీ వైఫ‌ల్యంపైనా చాలా చ‌ర్చ సాగింది. త‌న‌ పెదాలకు శ‌స్త్ర చికిత్స జరిగింది. అయితే అనుష్క‌ పెదవులు చాలా తేడాగా ఉన్నాయని ప్ర‌చార‌మైంది. అయితే మారిన రూపం త‌న కెరీర్ ని ఇబ్బంది పెట్ట‌లేదు. అనుష్క శ‌ర్మ ఇప్పుడు రెండో బిడ్డ‌కు జ‌న్మ‌నివ్వ‌నుంది. స్టార్ హీరోయిన్ గా కెరీర్ ని కొన‌సాగిస్తూనే ఉంది.

మినిషా లాంబా:

మినీషా లాంబా ముక్కుకు శ‌స్త్ర చికిత్స చేయించుకుంద‌ని ప్ర‌చార‌మైంది. పెదవుల క‌రెక్ష‌న్ కోసం శస్త్రచికిత్స జరిగింది. రెండు చికిత్స‌లు తప్పుగా జరిగాయి. లాంబా ముక్కు ఇప్పుడు చాలా చిన్నదిగా మార‌గా, పెదవులు చాలా పెద్దవిగా కనిపిస్తున్నాయి. మినీషా ఇటీవ‌ల న‌ట‌న‌కు దూరంగానే ఉంది.

రాఖీ సావంత్:

బోల్డ్ బ్యూటీ రాఖీ సావంత్‌కు అనేక కాస్మెటిక్ సర్జరీలు జరిగాయి. వాటిలో చాలా తప్పులు దొర్లాయి. ఆమె పెదవులు నిండుగా బొద్దుగా కనిపిస్తున్నాయి. ముక్కు వంకరగా కనిపిస్తుంది. ఆమె బుగ్గలు ఉబ్బినట్లు కనిపిస్తున్నాయి. దీనిపై హిందీ మీడియాలో నిరంత‌రం బోలెడంత రచ్చ సాగింది.

మహిమా గిరోత్రా:

మ‌హిమా గిరోత్రా ముక్కుకు శ‌స్త్ర చికిత్స చేయించుకుంది. కానీ అది విక‌టించింది. ముక్కు చాలా చిన్నదిగా చిటికెడు సైజుకు మారిందని క‌థ‌నాలొచ్చాయి.

అయితే బాలీవుడ్ క‌థానాయిక‌ల్లో శ‌స్త్ర చికిత్స‌ల గురించి బాలీవుడ్ మీడియా ప్ర‌చారాన్ని పూర్తిగా న‌మ్మ‌లేం. అవ‌న్నీ కేవలం పుకార్లు, ఆరోపణలు మాత్రమేనని గమనించాలి. ఈ నటీమణులు ఎవరూ కాస్మెటిక్ సర్జరీని ధృవీకరించలేదు లేదా తిరస్కరించలేదు. వారిలో ఎవరూ ప్రతికూల ఫలితాల గురించి బహిరంగంగా మాట్లాడలేదు.

సౌత్ బ్యూటీస్ స‌ర్జ‌రీలు విక‌టించ‌లేదు:

సౌత్ లో శ్రుతిహాస‌న్ త‌న ముక్కుకు శ‌స్త్ర చికిత్స చేయించుకున్నాన‌ని ప‌బ్లిగ్గా అంగీక‌రించింది. తన అందం మెరుగుద‌ల కోసం స‌ర్జ‌రీ చేయించుకుంటే ఇత‌రుల‌కు ఎందుకు నొప్పి? అని కూడా ప్ర‌శ్నించింది. ఆ త‌ర్వాత శ్రుతి గురించి ఎవ‌రూ కామెంట్ చేసే సాహ‌సం చేయ‌లేదు. న‌య‌న‌తార పెద‌వుల‌కు శ‌స్త్ర చికిత్స జ‌రిగింద‌ని అప్ప‌ట్లో క‌థ‌నాలొచ్చాయి. అతిలోక సుంద‌రి శ్రీ‌దేవి ముక్కుకు శ‌స్త్ర చికిత్స‌పై చాలా కాలం ప్ర‌చార‌మైంది. ఇంకా చాలామంది ద‌క్షిణాది క‌థానాయిక‌లు ఈ జాబితాలో ఉన్నారు. అందం ఆకృతి కోసం ప్ర‌య‌త్నించి వీళ్ల‌లో చాలా మంది స‌క్సెస‌య్యారు.

అంతఃసౌంద‌ర్యం ముఖ్యం:

అయితే కాస్మెటిక్ సర్జరీ వల్ల కలిగే నష్టాల గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. అత్యంత అర్హత కలిగిన సర్జన్లు కూడా తప్పులు చేయగలరు. ప్రమాదం ముప్పు ఎల్లప్పుడూ ఉంటుంది. ఏదైనా కాస్మెటిక్ సర్జరీ ప్రక్రియలో పాల్గొనే ముందు మీ శ‌రీరం గురించి మీరు తెలుసుకోవ‌డం, పరిశోధన చేయడం ఆపై నష్టాన్ని త‌గ్గించుకోవ‌డం చాలా అవ‌స‌రం. ప్రయోజనాలను జాగ్రత్తగా పరిశీలించడం చాలా ముఖ్యం. అందం అనేది ఆత్మాశ్రయమని, బాహ్య కార‌క‌మ‌ని గుర్తుంచుకోవడం కూడా ముఖ్యం. ఒక వ్యక్తి లోపంగా భావించిన‌ దానిని మరొక వ్యక్తి అందంగా భావించవచ్చు. అంతిమంగా ప్రతి వ్యక్తి తన రూపంతో సంతోషంగా ఉన్నారా లేదా అనేది నిర్ణయించుకోవాలి. బాహ్య సౌంద‌ర్యం కంటే అంతః సౌంద‌ర్యం చాలా ముఖ్యం.