కొత్త ట్రెండ్ షురూ... తెలుగు హీరోయిన్స్ లో మార్పు
ఒకప్పుడు లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేసే హీరోయిన్స్ అతి కొద్ది మంది మాత్రమే ఉండేవారు.
By: Tupaki Desk | 15 May 2024 6:00 AM GMTఒకప్పుడు స్టార్ హీరోయిన్స్ నుంచి చిన్న హీరోయిన్స్ వరకు ఎక్కువ శాతం మంది హీరోల పక్కన పాటలకు, కొన్ని సన్నివేశాలకు, కొన్ని రొమాంటిక్ సీన్స్ కు మాత్రమే పరిమితం అయ్యి ఉండేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. ఒకప్పుడు లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేసే హీరోయిన్స్ అతి కొద్ది మంది మాత్రమే ఉండేవారు.
ప్రస్తుతం ఉన్న స్టార్ హీరోయిన్స్ లో దాదాపు అందరూ కూడా లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేస్తూ వస్తున్నారు. కెరీర్ ఆరంభంలోనే కొందరు లేడీ ఓరియంటెడ్ స్క్రిప్ట్ లకు ఓకే చెప్పడం మనం చూస్తున్నాం. ఒకప్పుడు కేవలం స్టార్ హీరోయిన్స్ కెరీర్ చివరి దశలో లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేసిన దాఖలాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది.
అనుష్క నుంచి మొదలుకుని సమంత, తాప్సి, కాజల్, రష్మిక మందన్న ఇలా ప్రతి ఒక్కరు కూడా లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేస్తూ యాక్షన్ సన్నివేశాలను చేస్తూ ప్రేక్షకులను హీరోల మాదిరిగా ఫిదా చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం లేడీ ఓరియంటెడ్ సినిమాలతో ముద్దుగుమ్మలు తెగ సందడి చేస్తున్నారు.
ఇప్పటికే సమంత పలు లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేసింది. ఇప్పుడు బంగారం అనే లేడీ ఓరియంటెడ్ సినిమా ని చేస్తుంది. అందులో యాక్షన్ సన్నివేశాలు ఓ రేంజ్ లో ఉంటాయని ఫస్ట్ లుక్ తోనే అర్థం అయ్యింది. ఇక తమన్నా ఇప్పటి వరకు చేసిన పాత్రలకు చాలా విభిన్నమైన పాత్రను ఓదెల 2 లో చేస్తుంది. అందులో యాక్షన్ తో అదరగొట్టబోతుంది.
ఇటీవల క్రిష్ దర్శకత్వంలో అనుష్క హీరోయిన్ గా కన్ఫర్మ్ అయిన కొత్త సినిమా కూడా యాక్షన్ ప్రధానంగా సాగబోతుంది అంటూ వార్తలు వస్తున్నాయి. అనుష్క కూడా మరోసారి యాక్షన్ తో అలరించబోతోంది. కాజల్ అగర్వాల్ ను తన రాబోయే సినిమాలో యాక్షన్ సన్నివేశాల్లో చూడబోతున్నాం.
శృతి హాసన్ మరియు కీర్తి సురేష్ లు ప్రస్తుతం చేస్తున్న సినిమాల కోసం మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ పొందుతున్నారు. కనుక వారి సినిమాల్లో కచ్చితంగా హింస చాలానే ఉండే అవకాశాలు ఉన్నాయి అంటూ సినీ వర్గాల వారు అంటున్నారు.
మొత్తానికి ముద్దుగుమ్మల్లో మార్పు వచ్చి కొత్త ట్రెండ్ కు శ్రీకారం చుట్టారు. సుకుమారంగా ఉండే ముద్దుగుమ్మలు యాక్షన్ చేస్తే కచ్చితంగా చూడముచ్చటగా ఉంటుంది. అందుకే ముందు ముందు రాబోతున్న ఈ ముద్దుగుమ్మల యాక్షన్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సొంతం చేసుకునే అవకాశాలు ఉన్నాయి.