Begin typing your search above and press return to search.

కథానాయికలు ప్రత్యేకత చాటాల్సిందే..!

సౌత్ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చే ప్రతి హీరోయిన్ స్టార్ అవ్వాలనే కలలు కంటుంది. కానీ వారి ఫేట్ అనేది వారు ఎంపిక చేసుకునే కథలను బట్టి ఉంటుంది.

By:  Tupaki Desk   |   18 July 2024 12:30 AM GMT
కథానాయికలు ప్రత్యేకత చాటాల్సిందే..!
X

ఒక సినిమాకు హీరో డైరెక్టర్ నిర్మాత ఇలా అందరితో పాటు హీరోయిన్ కూడా చాలా అవసరం. చాలా తక్కువ సినిమాలకు హీరోయిన్ అనే ఆలోచన లేకుండా చేస్తారు. ఐతే సినిమాకు గ్లామర్ తీసుకొచ్చే కథానాయికలు కొన్ని సినిమాల్లో ఎంత ప్రాధాన్యత కలిగి ఉంటాయో.. కొన్ని సినిమాల్లో అంత బలహీనంగా ఉంటాయి. దీని వెనుక ప్రత్యేక రీజన్స్ అనేవి ఏమి ఉండవు కానీ ఒక్కో హీరోయిన్ ఆమె ఎంపిక చేసుకునే కథలు, సినిమాలను బట్టి ఉంటుందని చెప్పొచ్చు.

సినిమా హీరోయిన్ అంటే ఏదో నాలుగు సీన్లు, ఐదారు పాటల కోసమే అన్న లెక్క కూడా ఉంది. అసలేమాత్రం సినిమాలు లేకపోవడం కన్నా ఏదో ఒక సినిమాలో అలా కనిపించడం బెటర్ అని అనుకుంటారు. ఐతే కొందరు హీరోయిన్స్ మాత్రం ప్రత్యేకమైన పాత్రలు కావాలని అనుకుంటారు. హీరోయిన్స్ అంటే ఏదో సినిమాలో కనిపించాం అన్నట్టు కాకుండా వారి ప్రత్యేకత చాటేలా ఉండాలని చూస్తారు. అలాంటి హీరోయిన్స్ చాలా తక్కువ ఉంటారని చెప్పొచ్చు.

సౌత్ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చే ప్రతి హీరోయిన్ స్టార్ అవ్వాలనే కలలు కంటుంది. కానీ వారి ఫేట్ అనేది వారు ఎంపిక చేసుకునే కథలను బట్టి ఉంటుంది. ఒకటి రెండు సినిమాలు కాదు కాన్ స్టంట్ గా తమ సత్తా చాటే సినిమాలు చేస్తేనే కెరీర్ స్ట్రాంగ్ అవుతుంది. ఐతే కొంతమంది హీరోయిన్స్ కెరీర్ మొదట్లో అలా పట్టు బిగించి ఉన్నా అవకాశాలు రాకపోవడంతో తమ ఆలోచన మార్చుకుని ఎలాంటి సినిమా అయినా చేసే పరిస్థితికి వస్తారు.

ఐతే కొందరు హీరోయిన్స్ మాత్రం ఫిమేల్ సెంట్రిక్ సినిమాలు చేస్తూ తమ కెరీర్ మరింత స్ట్రాంగ్ గా చేసుకుంటారు. ఐతే వారికి ఎప్పుడు అలాంటి సినిమాలు వస్తాయని చెప్పడం కష్టమే. కమర్షియల్ సినిమా ఛాన్సులు వచ్చినా అందులో కూడా వారి ప్రతిభ చాటి ప్రేక్షకుల మనసులు దోచేస్తారు. ఐతే ఎవరు ఎలా చేసినా హీరోయిన్ గా స్టార్ స్టేటస్ అందుకోవాలంటే మాత్రం భామలకు టాలెంట్ తో పాటు లక్ కూడా తోడవ్వాల్సిందే. అలా లక్ యాడ్ అయితేనే హీరోయిన్స్ వారు చేస్తున్న పాత్రలు.. ఎంపిక చేసిన సినిమాలు సక్సెస్ అవుతాయి. అలా సక్సెస్ లు వరుసగా అందుకున్న హీరోయిన్ కే మళ్లీ మళ్లీ ఛాన్సులు వస్తుంటాయి.