Begin typing your search above and press return to search.

కన్నీళ్లు ఆపుకోలేక పోతున్న హీరోయిన్‌

తాజాగా పాయల్‌ రాజ్ పూత్‌ తనకు ఆ ఆనందం దక్కింది.. అలాంటి విజయం అందింది అంటూ సోషల్‌ మీడియా ద్వారా వీడియో షేర్‌ చేసింది.

By:  Tupaki Desk   |   17 Nov 2023 4:36 PM GMT
కన్నీళ్లు ఆపుకోలేక పోతున్న హీరోయిన్‌
X

హీరోలు, హీరోయిన్స్ కి సక్సెస్‌ అనేది చాలా బూస్ట్ ని ఇస్తుంది. ఒక్క విజయంతో వారు పడ్డ కష్టం అంతా కూడా మరచిపోతారు. అలాంటి విజయాలు చాలా అరుదుగా మాత్రమే అందుతాయి. తాజాగా పాయల్‌ రాజ్ పూత్‌ తనకు ఆ ఆనందం దక్కింది.. అలాంటి విజయం అందింది అంటూ సోషల్‌ మీడియా ద్వారా వీడియో షేర్‌ చేసింది.

ఆర్‌ఎక్స్ 100 సినిమాతో హీరోయిన్‌ గా గుర్తింపు దక్కించుకున్న పాయల్‌ ఆ తర్వాత మళ్లీ ఆ స్థాయి లో విజయాలను దక్కించుకోలేదు. అయితే ఆ సినిమా తో వచ్చిన ఇమేజ్ మరియు స్టార్‌ డమ్‌ కారణంగా ఇన్నాళ్లు సినిమాలు చేస్తూ వచ్చింది. పాయల్‌ ను జనాలు పట్టించుకోవడం మానేస్తున్నారు అనుకుంటున్న సమయంలో మంగళవారం చేసింది.

తన హిట్‌ మూవీ ఆర్‌ఎక్స్ 100 సినిమా దర్శకుడు అజయ్‌ భూపతి దర్శకత్వంలో రూపొందిన మంగళవారం సినిమా విషయంలో మొదటి నుంచి కూడా పాయల్‌ చాలా నమ్మకంగా ఉంది. సినిమా ప్రీమియర్ చూసిన తర్వాత పాయల్‌ ఏడుపు ఆపుకోలేక పోయింది. ఇలాంటి సినిమాలో తాను భాగస్వామ్యం అయినందుకు సంతోషంగా ఉందని కన్నీళ్లు పెట్టుకుంది.

ఈ సినిమా మీ అందరికి కూడా తప్పకుండా నచ్చుతుంది. ఇంతటి విజయాన్ని అందించిన ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు అంటూ ఆమె పేర్కొంది. మొత్తానికి మంగళవారం సినిమాతో మరో అయిదు ఆరు ఏళ్ల పాటు పాయల్‌ రాజ్‌ పూత్‌ కెరీర్‌ లో ముందుకు వెళ్లవచ్చు అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు మరియు యూనిట్‌ సభ్యులు అంటున్నారు.