Begin typing your search above and press return to search.

పెళ్లి పీటలు ఎక్కబోతున్న లక్కీ హీరోయిన్‌

హీరోయిన్స్ ప్రేమలో ఉన్నా కూడా తమ కెరీర్‌ ను దృష్టిలో పెట్టుకుని ఆఫర్లు తగ్గేంతవరకు ప్రేమ వ్యవహారం ను బయటకు రానివ్వరు.

By:  Tupaki Desk   |   27 Dec 2023 12:10 PM GMT
పెళ్లి పీటలు ఎక్కబోతున్న లక్కీ హీరోయిన్‌
X

సినిమా ఇండస్ట్రీలో ప్రేమ వ్యవహారాలు కామన్‌ విషయం. హీరోయిన్స్ ప్రేమలో ఉన్నా కూడా తమ కెరీర్‌ ను దృష్టిలో పెట్టుకుని ఆఫర్లు తగ్గేంతవరకు ప్రేమ వ్యవహారం ను బయటకు రానివ్వరు. ఒక వేళ ప్రేమ విషయం బయటకు వచ్చినా కూడా పెళ్లికి టైం తీసుకుంటారు.

ఇండస్ట్రీలో హీరోయిన్‌ గా కొనసాగడం కష్టం.. ఇకపై ఆఫర్లు పెద్దగా రావేమో అనుకున్న సమయంలో మాత్రమే హీరోయిన్స్ పెళ్లికి సిద్ధం అవుతారు. కానీ ఒక హీరోయిన్ మాత్రం లక్కీ బ్యూటీ, గోల్డెన్ లెగ్‌ బ్యూటీ అంటూ పేరు దక్కించుకుని వరుసగా సినిమా ఆఫర్లు వస్తున్న సమయంలో పెళ్లి పీటలు ఎక్కేందుకు రెడీ అవుతోందని వార్తలు వస్తున్నాయి.

ఆ మధ్య తెలుగు లో ఈ అమ్మడు చేసిన సినిమాలన్నీ కూడా బ్యాక్ టు బ్యాక్‌ హిట్‌ అయ్యాయి. దాంతో ఈమె వెంట దర్శక నిర్మాతలు క్యూ కట్టారు. అయితే తన వద్దకు వచ్చిన అందరికీ ఓకే చెప్పకుండా వేచి చూసే ధోరణిలో ఈ అమ్మడు సినిమాలకు నో చెబుతూ వచ్చింది. ఆ సమయంలో చాలా మంది కథ విషయంలో ఆమె నో చెప్పిందేమో అనుకున్నారు.

తాజాగా ఆమె పెళ్లికి సిద్ధం అవ్వడం వల్లే చాలా సినిమాలను తిరష్కరించిందని, ఇటీవల కూడా ఒక టాలీవుడ్‌ యంగ్‌ స్టార్‌ హీరో సినిమాకు కూడా ఆమె నో చెప్పిందనే వార్తలు వస్తున్నాయి. ఆమె నటించిన తెలుగు సినిమా త్వరలో విడుదల అవ్వబోతుంది.

ఆ సినిమా విడుదల తర్వాత సదరు హీరోయిన్ కి మరింతగా క్రేజ్ పెరిగే అవకాశాలు ఉన్నాయి. అయినా కూడా ఆమె పెళ్లి వైపే మొగ్గు చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రేమించిన కుర్రాడిని పెళ్లి చేసుకునేందుకు కుటుంబ సభ్యులను ఒప్పించిన ఆ హీరోయిన్‌ పెళ్లి తర్వాత అయినా సినిమాల్లో నటిస్తుందా అనేది చూడాలి.