Begin typing your search above and press return to search.

నితిన్ కి అలాంటి కోరిక‌లు లేవుట‌!

టాలీవుడ్ అంటే పాన్ ఇండియా రేంజ్. అన్ని భాష‌ల్లోనూ తెలుగు సినిమాల‌కు మంచి డిమాండ్ క‌నిపిస్తుంది

By:  Tupaki Desk   |   7 Dec 2023 7:40 AM GMT
నితిన్ కి అలాంటి కోరిక‌లు లేవుట‌!
X

టాలీవుడ్ అంటే పాన్ ఇండియా రేంజ్. అన్ని భాష‌ల్లోనూ తెలుగు సినిమాల‌కు మంచి డిమాండ్ క‌నిపిస్తుంది. తెలుగు న‌టుల‌తో...ద‌ర్శ‌కుల‌తో క‌లిసి ప‌నిచేయ‌డానికి అన్ని భాష‌ల న‌టులు ఎదురు చూస్తు న్నారు. ఇక తెలుగు నుంచైతే? హీరోలంతా పాన్ ఇండియా సినిమా ఎప్పుడు చేద్దాం? అని ఎదురు చూస్తు న్నారు. కొంద‌రు హీరోలు కంటెంట్ ఎలా ఉన్నా ముందు పాన్ ఇండియా ప్రాజెక్ట్ ప్ర‌క‌ట‌న ఇచ్చేస్తున్నారు.

ఇలా కొంత కాలంగా టాలీవుడ్ లో పాన్ ఇండియా ట్రెండ్ కొన‌సాగుతుంది. తాజాగా యూత్ స్టార్ నితిన్ ముందుకు ఓ ఇంట్రెస్టింగ్ క్వ‌శ్చ‌న్ ముందుకెళ్లింది. పోరుగు భాష‌లు..పాన్ ఇండియా సినిమాల‌పై దృష్టి పెట్టే ఆలోచ‌న ఉందా? అంటే ఆస‌క్తిక‌ర స‌మాధానం ఇచ్చారు. ఆర్ ఆర్ ఆర్ లాంటి సినిమాలు చేయాల‌ని.. ఆస్కార్ వ‌ర‌కూ వెళ్లాల‌నే పెద్ద పెద్ద కోరిక‌లు నాకు లేవు. తొలి ప్రాధాన్య‌త తెలుగు భాష‌కే.

నేను న‌టించిన సినిమాలు ఇక్క‌డ మ‌న ప్రేక్ష‌కుల‌కు న‌చ్చితే వాటిని ఇత‌ర భాష‌ల్లోకి బ‌డ్ చేస్తాం. అంత‌కు మించి పాన్ ఇండియాని దున్నేసే సినిమాలు చేయాలి అన్న ఉత్సాహం నాలో లేదు ' అని అన్నారు. నితిన్ ఈ విష‌యంలో చాలా బ్యాలెన్స్ గా మాట్లాడిన‌ట్లు క‌నిపిస్తుంది. యూత్ స్టార్ కి కొంత కాలంగా స‌రైన స‌క్సెస్ లేని సంగ‌తి తెలిసిందే. భీష్మ త‌ర్వాత చాలా సినిమాలు చేసాడు.

కానీ అవేవి పెద్ద విజ‌యం సాధించ‌లేదు. ఈ నేప‌థ్యంలో వ‌క్కంతం వంశీతో క‌లిసి 'ఎక్స్ ట్రా ఆర్డిన‌రీ' అనే సినిమా చేసాడు. ఇది ప‌క్కా క‌మ‌ర్శియ‌ల్ చిత్రమని ఇప్ప‌టికే ప్ర‌చార చిత్రాల్ని బ‌ట్టి తెలుస్తుంది. సినిమా పై యూనిట్ చాలా న‌మ్మ‌కంగా ఉంది. మ‌రి బాక్సాఫీస్ వ‌ద్ద ఎలాంటి ఫ‌లితాలు సాధిస్తుంది అన్న‌ది చూడాలి. హీరో..డైరెక్ట‌ర్ ఇద్ద‌రు రొటీన్ కి భిన్న‌మైన వాళ్లే. కానీ వాళ్లు చేసిన మాస్ ప్ర‌య‌త్నం మాత్రం ఆలోచ‌న‌లో ప‌డేస్తుంది.