Begin typing your search above and press return to search.

ప్రభాస్ అలా పొలాల్లో.. వైరల్ పిక్

కల్కి 2898ఏడీ మూవీ ప్రపంచ వ్యాప్తంగా అద్భుతమైన ఆదరణ సొంతం చేసుకుంటూ కలెక్షన్స్ పరంగా దూసుకుపోతోంది.

By:  Tupaki Desk   |   17 July 2024 4:05 AM GMT
ప్రభాస్ అలా పొలాల్లో.. వైరల్ పిక్
X

డార్లింగ్ ప్రభాస్ ప్రస్తుతం ఇండియాలోనే బిగ్గెస్ట్ స్టార్ గా ఉన్నాడు. సినిమాల పరంగా అత్యధిక మార్కెట్ వేల్యూ ఉన్న హీరోగా యంగ్ రెబల్ స్టార్ ఉన్నాడు. సలార్, కల్కి 2898ఏడీ సినిమాలతో వరుసగా రెండు సక్సెస్ లు అందుకొని ఆకాశం అంత ఎత్తుకి ఎదిగిపోయాడు. వెయ్యి కోట్లకి పైగా కలెక్షన్స్ రెండు సార్లు అందుకున్న సౌత్ ఇండియా స్టార్ గా ప్రభాస్ ఉన్నాడు. కల్కి 2898ఏడీ మూవీ ప్రపంచ వ్యాప్తంగా అద్భుతమైన ఆదరణ సొంతం చేసుకుంటూ కలెక్షన్స్ పరంగా దూసుకుపోతోంది.

నెక్స్ట్ అతని నుంచి రాబోయే సినిమాలు అన్ని కూడా 300+ కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్నవే కావడం విశేషం. ప్రభాస్ రెమ్యునరేషన్ కూడా 100 కోట్లకి పైగా అందుకుంటున్నాడు. ప్రభాస్ లైన్ అప్ లు నాలుగు సినిమాలు ఉన్నాయి. వాటిలో రెండు సీక్వెల్స్ కావడం విశేషం. ఇవి రిలీజ్ అయితే హాలీవుడ్ రేంజ్ కి ప్రభాస్ ఇమేజ్ పెరిగిపోవడం ఖాయం అనే మాట వినిపిస్తోంది. అయితే ప్రభాస్ టాప్ స్టార్ గా ఉన్న కూడా అతని వ్యక్తిత్వం, మాటలు డౌన్ టూ ఎర్త్ ఉంటాయనేది చాలా మంది చెప్పే మాట.

ప్రభాస్ తో వర్క్ చేసే ప్రతి ఒక్కరు కూడా ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉంటారు. అలాగే సొంతూరు మొగల్తూరు కూడా ఎప్పటికప్పుడు ప్రభాస్ వెళ్తూ ఉంటాడు. గతంలో అయితే సంక్రాంతి వస్తే సొంతూరు వెళ్లిపోయేవాడు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదని చెప్పాలి. తాజాగా ప్రభాస్ కి కి సంబందించిన ఒక పాత ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మొగల్తూరులో తన అన్న ప్రమోద్ తో పాటు మరికొంతమంది ఫ్రెండ్స్, కుటుంబ సభ్యులతో కలిసినపుడు క్యాజువల్ గా దిగిన ఫొటోని ఎవరో ట్విట్టర్ లో షేర్ చేశారు.

ఈ ఫోటోలో యంగ్ లుక్ లో ప్రభాస్ చాలా హ్యాండ్ సమ్ గా ఉన్నాడు. అలాగే సింపుల్ గా కనిపిస్తున్నాడు. ఈ లుక్ డార్లింగ్ సినిమా సమయంలోంది అని కొంతమంది నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. రెబల్ మూవీకి ముందు అని కొంతమంది అంటున్నారు. మెజారిటీ నెటిజన్స్ మాత్రం మిస్టర్ పెర్ఫెక్ట్ షూటింగ్ కి ముందు ప్రభాస్ ఈ లుక్ లో ఉన్నాడని కామెంట్స్ చేస్తున్నారు. మరికొంతమంది అయితే ప్రభాస్ రెండో సినిమా రాఘవేంద్ర దగ్గరకి వెళ్లిపోతున్నారు. కొంతమంది మిర్చి అని కామెంట్స్ చేస్తున్నారు.

అయితే ఈ ఫోటో 2011లో దిగినట్లు తెలుస్తోంది. దీనిని బట్టి మిస్టర్ పెర్ఫెక్ట్ మూవీకి ముందు దిగిన ఫోటో అనే మాట వినిపిస్తోంది. ఈ ఫోటోలని ప్రభాస్ అభిమాని తన బ్లాగ్ లో 2011లో పోస్ట్ చేశారు. ఆ టైంలో ప్రభాస్ డార్లింగ్ మూవీ కంప్లీట్ చేసుకొని మిస్టర్ పెర్ఫెక్ట్ సినిమా చేస్తున్నాడు. 2013లో మిర్చి మూవీ రిలీజ్ అయ్యింది. కాబట్టి డార్లింగ్ తర్వాత మిస్టర్ పెర్ఫెక్ట్ కి ముందు ప్రభాస్ దిగిన ఫోటోలుగా అర్ధమవుతోంది. ఈ లుక్ లో ప్రభాస్ కటౌట్ అదిరిపోయిందనే మాట వినిపిస్తోంది.