Begin typing your search above and press return to search.

ఆరుగురు ఖాళీ.. అదే కంటిన్యూ అయితే ఇక కష్టమే!

2024 వేసవిలో సినిమాల కన్నా ఎన్నికలు, ఐపీఎల్ హడావుడే ఎక్కువ కనిపించింది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు కంప్లీట్ అయ్యాయి

By:  Tupaki Desk   |   21 May 2024 11:30 PM GMT
ఆరుగురు ఖాళీ.. అదే కంటిన్యూ అయితే ఇక కష్టమే!
X

2024 వేసవిలో సినిమాల కన్నా ఎన్నికలు, ఐపీఎల్ హడావుడే ఎక్కువ కనిపించింది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు కంప్లీట్ అయ్యాయి. మరికొన్ని రోజుల్లో ఐపీఎల్ కూడా పూర్తవుతుంది. దీంతో సినీ ప్రియులు.. తమ దృష్టంతా సినిమాలపై మెల్లగా పెట్టనున్నారు. మే 25వ తేదీన లవ్ మీతోపాటు మే31వ తేదీన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సహా అనేక చిత్రాలు విడుదల కానున్నాయి. ఆ తర్వాత మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్టులన్నీ వరుసగా రిలీజ్ అవ్వనున్నాయి.

అయితే ఇప్పటికే ఎన్నికల్లో కాస్త బిజీగా ఉన్న మెగా హీరోలంతా సెట్స్ లోకి అడుగుపెట్టారు. వారితో పాటు మిగతా హీరోలు కూడా తమ సినిమాలను పూర్తి చేసే పనిలో ఉన్నారు. అనుకున్న తేదీలకు తమ చిత్రాలను రిలీజ్ చేసేందుకు మేకర్స్ కు పూర్తిగా సహకరిస్తున్నారు. ఫ్యాన్స్ కూడా తమ అభిమాన హీరోల సినిమాలు చూసేందుకు రెడీ అవుతున్నారు. కానీ ఇప్పుడు ఇండస్ట్రీలో ఆరుగురు హీరోలు.. చేతిలో ఒక్క సినిమా కూడా లేకుండా ఉన్నారని తెలుస్తోంది.

అందుకు అనేక కారణాలు ఉన్నా.. ముఖ్య కారణం మాత్రం రెమ్యునరేషన్. చాలా మంది హీరోలు తమ పారితోషికాన్ని తగ్గించుకోవడానికి ఇష్టపడడం లేదట. మీడియం, చిన్న స్థాయి హీరోలు మూడు కోట్ల నుంచి ముప్పై కోట్ల రూపాయల వరకు డిమాండ్ చేస్తున్నారని టాక్. ఇక రెమ్యునరేషన్ తో పాటు ప్రొడక్షన్ ఖర్చు, డిజిటల్ డీల్స్ తగ్గడం వంటి కారణాలతో పలువురు హీరోలతో వర్క్ చేసేందుకు మేకర్స్ ముందుకు రావడం లేదని తెలుస్తోంది.

ఓ హీరో రెమ్యునరేషన్ రూ.3 కోట్లు అడుగుతున్నారట. కానీ సదరు నటుడికి థియేటర్ మార్కెట్ కూడా అంత లేదు. ప్రొడక్షన్ ఖర్చు రూ.15 కోట్లు అయ్యే అవకాశం ఉంది. అలాంటి సమయంలో పెట్టుబడి వెనక్కి వస్తుందో లేదో తెలియక మేకర్స్ అడుగు ముందుకు వేయడం లేదట. సినిమాలు హిట్ అయితే తప్ప లాభాలు రావు. చిన్న, మీడియం రేంజ్ హీరోల మూవీలన్నీ హిట్ అవుతాయని చెప్పలేం. కాబట్టి మేకర్స్ చాలా ఆలోచిస్తున్నారని టాక్.

ఇండస్ట్రీలో వరుసగా ఫ్లాపులు మూటగట్టుకుంటున్నా.. సీనియర్ హీరోలు కూడా బడ్జెట్ ను తగ్గించుకోవడం లేదని వార్తలు వస్తున్నాయి. మీడియం రేంజ్ హీరోలేమో రూ.10 కోట్ల వరకు అడుగుతున్నారట. దీంతో తమకు నష్టాలు వస్తున్నాయని పలువురు నిర్మాతలు వాపోతున్నారు. చిన్న హీరోలు కూడా అప్పుడప్పుడు డిమాండ్ చేస్తున్నట్లు చెబుతున్నారు. అలా ఇప్పటికే ఆరుగురు టాలీవుడ్ మీడియం, చిన్న రేంజ్ హీరోలు ఖాళీగా ఉన్నారని సమాచారం.

ఇప్పుడు ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారగా.. సినీ పండితులు స్పందిస్తున్నారు. హీరోలు కచ్చితంగా రెమ్యునరేషన్ తగ్గించుకోవాలని సూచిస్తున్నారు. డైరెక్టర్లు కూడా తమ ప్రొడక్షన్ కాస్ట్ ను తగ్గించుకుని, ప్రాజెక్టులను ప్లాన్ చేసుకోవాలని చెబుతున్నారు. లేకుంటే నటీనటులకు డిమాండ్ పూర్తిగా తగ్గిపోతుందని అంటున్నారు. అదే జరిగితే ఇండస్ట్రీ పరిస్థితి అంతా తారుమారు అవుతుందని హెచ్చరిస్తున్నారు. మరి హీరోలు, డైరెక్టర్లు భవిష్యత్తులో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి.