హీరోలంతా తెగ పెంచేస్తున్నారే..కట్ చేసేదెప్పుడో?
క్యారెక్టర్కి తగ్గట్టు హీరోలు మౌల్డ్ అవ్వాల్సిందే. కొన్నిసార్లు అందుకోసం నెలలు తరబడి సమయం తీసు కుంటారు.
By: Tupaki Desk | 23 March 2024 3:30 PM GMTక్యారెక్టర్కి తగ్గట్టు హీరోలు మౌల్డ్ అవ్వాల్సిందే. కొన్నిసార్లు అందుకోసం నెలలు తరబడి సమయం తీసు కుంటారు. బాడీ షేప్ పరంగా మార్పులు కావాలంటే ఆరు నెలలు ముందు నుంచే రెడీ అవుతుంటారు. ఇక సోషషియా ఫాంటసీ...పిరియాడిక్ చిత్రాల కోసమైతే అవసరమైన శిక్షణలు తీసుకుంటారు. తాజాగా తారక్..నాగచైతన్య...రామ్ పోతినేని..బన్నీ లాంటోళ్ల గెటప్ లు చూస్తుంటే? వారు సైతం ఎంతో కమిట్ మెంట్ తోనే ఉన్నట్లు కనిపిస్తుంది.
`దేవర` సినిమా కోసం యంగ్ టైగర్ ఎన్టీఆర్ హెయిర్ స్టైల్ మార్చిన సంగతి తెలిసిందే. అతడి ఒరిజినల్ హెయిర్ స్టైల్ ఇందులో ఉంటుంది. జాలరి పాత్రకి రింగుల జిత్తు అవసరమని సూచించడంతో అదే లుక్ లో కనిపిస్తున్నాడు. అలాగే గెడ్డం లుక్ అంతే ఇంట్రెస్టింగ్ గా ఉంది. బేసిక్ గానే తారక్ శరీరమంతా రింగుల రోమాలు. న్యూ మేకోవర్ లో అతడి లుక్ ఆకట్టుకుంటుంది. గతంలో `రాఖీ`..`యమదొంగ` సినిమాలకు హెయిర్ పెంచాడు. రాఖీలో రింగులున్నా..`యమదొంగ`లో రింగుల జుత్తు తో కనిపించలేదు.
ఆ తర్వాత తారక్ చాలా చిత్రాల్లో సాప్ట్ హెయిర్ స్టైల్ తోనే ఆకట్టుకున్నాడు. యువ సామ్రాట్ నాగచైతన్య తొలి సినిమా `జోష్` లో లాంగ్ హెయిర్ స్టైల్ లో కనిపించాడు. అప్పటికీ మీసాలు కూడా సరిగ్గా మొలవ లేదు. దీంతో హెయిర్ తోనే మ్యానేజ్ చేసారు. ఆ తర్వాత మళ్లీ ఏ సినిమా కోసం హెయిర్ పెంచింది లేదు. తాజాగా `తండేల్` కోసం భారీగానే హెయిర్ పెంచాడు. గెడ్డం కూడా అవసరం కావడంతో గుబురు గెడ్డం కనిపిస్తుంది. గతంలో `మజిలి` సినిమా కోసం రోల్ డిజైన్ చేయడంతో గెడ్డం లుక్ లో కనిపించాడు.
ఇక ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని `డబుల్ ఇస్మార్ట్` లో డిఫరెంట్ హెయిర్ స్టైల్ అండ్ బీయర్డ్ తో ఆకట్టుకు బోతున్నాడు. `ఇస్మార్ట్ శంకర్` లో లుక్ నే ఇందులోనూ కంటున్యూ చేస్తున్నట్లు కనిపిస్తుంది. గతంలో మరి కొన్ని చిత్రాల్లో రామ్ లాంగ్ హెయిర్ లుక్ లో కనిపించాడు. అలాగే ఐకాన్ స్టార్ హెయిర్ స్టైల్ విషయంలో చాలా స్పెషల్ అని చెప్పాల్సిన పనిలేదు. ప్రతీ సినిమాకి డిఫరెంట్ హెయిర్ స్టైల్ తో ఆకట్టు కుంటాడు. `ఆర్య` దగ్గర నుంచి బన్నీ ఒక్కో చిత్రం కోసం న్యూలుక్ నే మెయింటెన్ చేసాడు. తాజాగా `పుష్ప- 2` లో పుష్పరాజ్ పాత్ర డిమాండ్ చేయడంతో మాస్ హెయిర్ స్టైల్ లుక్ లో కనిపిస్తున్నాడు. వీరంతా ఆలుక్ నుంచి బయటకు వచ్చేది పూర్తిగా చిత్రీకరణ పూర్తయిన తర్వాతనే.