ఆయనతో హీరోయిన్లకు అంత కంపర్ట్ గానా?
ఒకనొక దశలో చిరంజీవి, రజనీకాంత్ లాంటి స్టార్ హీరోలకే పోటా పోటీగా సినిమాలు చేసిన నటుడు
By: Tupaki Desk | 18 July 2024 6:46 AM GMTఒకప్పటి హీరో కం అందగాడు సుమన్ గురించి పరిచయం అవసరం లేదు. ఒకనొక దశలో చిరంజీవి, రజనీకాంత్ లాంటి స్టార్ హీరోలకే పోటా పోటీగా సినిమాలు చేసిన నటుడు. అప్పటి యువతలో విపరీతమైన ఫాలోయింగ్ నటుడు. గాళ్స్ గుండెల్లో సైతం గుబులు పుట్టించిన హ్యాండ్ సమ్ హీరో కూడా. హీరో అంటే సుమన్ లా ఉండాలని ఓ బ్రాండ్ ఇమేజ్ ని సంపాదించిన నటుడాయన.
ఇదంతా ఒక జర్నీ అయితే భర్తిరస చిత్రాల్లో దేవుళ్లు పాత్రలు పోషించాలంటే? అది కేవలం సుమన్ తోనే సాధ్యమని నమ్మే దర్శక-నిర్మాతలెంతో మంది. అందుకే రాముడు అయ్యాడు..శ్రీకృష్ణుడు అయ్యాడు. వెంకటేశ్వర స్వామిగా మారారు. ఇలా దేవుడు పాత్ర అంటే సుమన్ కి ఇచ్చేయాల్సిందే అన్నంతగా ఫేమస్ అయ్యారు అలాగే ప్రతి నాయకుడిగానూ సత్తా చాటి నటుడాయన. `శివాజీ` లాంటి సినిమా అతనికి మంచి గుర్తింపును తీసుకొచ్చింది.
అంబార్ పేట ఆదిగా సుమన్ ఎంతో చక్కగా అలరించారు. ఇలా సినిమాల్లో అన్ని రకాల పాత్రలు పోషించి నటుడిగా సుమన్ కి పేరుంది. పాజిటివ్ పాత్రలు అంతే గుర్తింపును తీసుకొచ్చాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో సుమన్ పాత రోజుల్లోకి వెళ్లిపోయారు. హీరోయిన్ల గుండెల తన స్థానం ఎలాంటిందన్నది చెప్పే ప్రయత్నం చేసారు. అదేంటో ఆయన మాటల్లోనే..
` నా నిర్మాతలు , నా దర్శకులు, నన్ను రిపీట్ చేశారు. ఎంతోమంది హీరోలు ఉన్నప్పటికీ వాళ్లు నన్ను వెతుక్కుంటూ వచ్చేవారు. ఇక హీరోయిన్స్ లో విజయశాంతి , భానుప్రియ నాతో ఎక్కువ సినిమాలు చేశాను. నేను స్క్రీన్ పైనే తప్ప ఏ హీరోయిన్ తోనూ ప్రేమలో పడలేదు. ట్రాక్ మారిపోతే కెరియర్ దెబ్బ తింటుందని నాకు తెలుసు. అందువల్ల నా లిమిట్స్ లో నేను ఉండేవాడిని. అందువల్లనే నాతో చేయడానికి హీరోయిన్స్ కి కంఫర్ట్ గా ఉండేది. ఈ కారణంగానే నాతో చేయనని ఏ హీరోయిన్ ఎప్పుడూ చెప్పలేదు` అని అన్నారు.