Begin typing your search above and press return to search.

అంద‌రూ ప్ర‌భాస్ మీద‌కు తొసేస్తే ఎలా బాస్!

ప్ర‌భాస్ పెళ్లి మిస్ట‌రీ అన్న‌ది ఇప్ప‌ట్లో వీడేది కాదు. కొన్ని సంవ‌త్స‌రాలుగా పెళ్లిపై స‌స్పెన్స్ కొన‌సాగుతూ వ‌స్తోంది

By:  Tupaki Desk   |   20 April 2024 6:43 AM GMT
అంద‌రూ ప్ర‌భాస్ మీద‌కు తొసేస్తే ఎలా బాస్!
X

ప్ర‌భాస్ పెళ్లి మిస్ట‌రీ అన్న‌ది ఇప్ప‌ట్లో వీడేది కాదు. కొన్ని సంవ‌త్స‌రాలుగా పెళ్లిపై స‌స్పెన్స్ కొన‌సాగుతూ వ‌స్తోంది. చివ‌రికి విసిగి విసిగి అడ‌గ‌డం కూడా మానేసారు. అయితే అవుతుంది? కాక‌పోతో కాదులే? పెళ్లి గురించి డార్లింగ్ ని అడిగి ఇబ్బంది పెట్టాలా? అనే వ‌ర‌కూ స‌న్నివేశం వ‌చ్చేసింది. దీనికి తోడు సోష‌ల్ మీడియాలో ఓ ఫేమ‌స్ జ్యోతిష్యుడు అత‌డి పెళ్లి వ్య‌వ‌హారాన్ని నెట్టింట ఎత ర‌చ్చ చేసాడో కూడా తెలిసిందే. జాత‌కం పేరుతో అత‌డు చేసిన వ్యాఖ్య‌లు నెట్టింట పెద్ద సంచ‌ల‌న‌మే అయ్యాయి.

ప్ర‌భాస్ పెళ్లి ఎప్పుడు చేసుకుంటాడు? అన్న‌ది అత‌ని వ్య‌క్తిగ‌త ఇష్టం. కానీ డార్లింగ్ పెళ్లి పేరుతో సినిమాల్ని తెలివిగా ప్ర‌మోట్ చేసుకుంటున్నారు. ఆ మ‌ధ్య శ‌ర్వానంద్ పెళ్లి చేసుకోనంత కాలం ప్ర‌భాస్ పేరు చెప్పుకునే తిరిగాడు. ప్ర‌భాస్ పెళ్లి అయిన త‌ర్వాత నేను చేసుకుంటాన‌నేవాడు. స‌రిగ్గా అది ఓ సినిమా ఈవెంట్ లో చోటు చేసుకుంది. తాజాగా విశాల్ కూడా అలాగే హైలైట్ అవుతున్నాడు. విశాల్ క‌థానాయ‌కుడిగా హ‌రి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన 'ర‌త్నం' ప్ర‌మోష‌న్ లో టీమ్ బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే.

విశాల్ పెళ్లి ఎప్పుడు అంటే ? ప్ర‌భాస్ గారు చేసుకున్న త‌ర్వాత చేసుకుంటాన‌ని తేల్చేసాడు. త‌న మొద‌టి వెడ్డింగ్ కూడా ఆయ‌నకే అందిస్తాన‌ని అన్నారు. స‌రైన స‌మ‌యం వ‌చ్చినప్పుడు ఆ విష‌యం ముందుగా మీడియాకే చెబుతాన‌న్నాడు. దీంతో ఆ ఇద్ద‌రు పెళ్లి చేసుకున్న‌ట్లే? నంటూ నెటి జ‌నులు స‌ర‌దాగా కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు. ఇంత‌కు ముందే విశాల్ కి ఓ అమ్మాయితో నిశ్చితార్ధ‌మైన సంగ‌తి తెలిసిందే. కానీ ఆ బంధం పెళ్లి పీఠ‌ల వ‌ర‌కూ వెళ్ల‌లేదు.

తాను ఆర్ధికంగా బ‌ల‌ప‌డాల‌ని విశాల్ వెయిట్ చేస్తున్న‌ట్లు గ‌తంలో చెప్పాడు. త‌మిళ నిర్మాతల కోసం నడిగర్ సంఘం భవనాన్ని నిర్మించడం వల్ల తన వివాహ ప్రణాళికలు వాయిదా పడ్డాయని అన్నారు. అలాగే కొంత మంది పిల్ల‌ల బాధ్య‌త కూడా త‌న‌పై ఉంద‌ని వారిని పూర్తి చేసిన త‌ర్వాత ఓ ఇల్లు కూడా కట్టుకున్న త‌ర్వాత వివాహం చేసుకుంటాన‌న్నాడు. తాజాగా ఇప్పుడు ప్ర‌భాస్ పెళ్లి త‌ర్వాత చేసుకుంటాన‌ని మ‌రింతగా వాయిదా వేసాడు.