Begin typing your search above and press return to search.

రాకింగ్ స్టార్ యష్.. అందుకే అందరివాడయ్యాడా?

కేజీఎఫ్ సిరీస్ తో పాన్ ఇండియా హీరోగా తనదైన గుర్తింపు క్రియేట్ చేసుకున్న కన్నడ యాక్టర్ యష్

By:  Tupaki Desk   |   14 Jun 2024 4:22 PM GMT
రాకింగ్ స్టార్ యష్.. అందుకే అందరివాడయ్యాడా?
X

కేజీఎఫ్ సిరీస్ తో పాన్ ఇండియా హీరోగా తనదైన గుర్తింపు క్రియేట్ చేసుకున్న కన్నడ యాక్టర్ యష్. రాకింగ్ స్టార్ గా కన్నడ ప్రేక్షకులకి చేరువ అయిన యష్ ని కేజీఎఫ్ సిరీస్ ఇండియన్ సూపర్ స్టార్ గా మార్చేసింది. కేజీఎఫ్ చాప్టర్ 2 తర్వాత యష్ చాలా గ్యాప్ తీసుకొని రీసెంట్ గా టాక్సిక్ అనే కొత్త సినిమాని ఎనౌన్స్ చేశాడు. గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కనుంది.

వచ్చే ఏడాది ఏప్రిల్ 10న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇదిలా ఉంటే కేజీఎఫ్ స్టార్ యష్ ప్రస్తుతం బాలీవుడ్ రామాయణం సినిమాలో రావణుడిగా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. బాలీవుడ్ ప్రేక్షకులు, అక్కడి దర్శక, నిర్మాతలు కూడా యష్ ని ఓన్ చేసుకున్నారు. దీనికి కారణం ఉంది. గతంలో రాకింగ్ స్టార్ యష్ ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర కామెంట్స్ చేశారు.

ఎప్పటి నుంచి ఇండస్ట్రీలో నార్త్, సౌత్ అనే తేడా ఉంది. సౌత్ రాష్ట్రాల ప్రేక్షకులు హిందీ సినిమాలని తక్కువగా ఆదరిస్తారు. అలాగే నార్త్ ఇండియాలో సౌత్ సినిమాలకి ఆదరణ ఉండేది కాదు. ఆర్టిస్ట్స్ ని చూసే విధానంలో కూడా తేడా ఉంటుందనే అభిప్రాయం ఉండేది. అయితే నార్త్, సౌత్ అనే ఆధిపత్య ధోరణి కంటే ఇండస్ట్రీలో స్నేహపూర్వక పోటీ ఉండాలని యష్ ఇంటర్వ్యూలో పేరొన్నాడు. ఒక్క కేజీఎఫ్ సిరీస్ ఇండస్ట్రీ మొత్తాన్ని మార్చదని తెలిపాడు.

ప్రతి ఒక్కరి నుంచి మంచి సినిమాలు రావాలని, అన్ని ప్రాంతాల ప్రజలు సినిమాలని ఆదరించినపుడు ఇండియన్ సినిమా స్టాండర్డ్స్ పెరుగుతుందని చెప్పుకొచ్చారు. ప్రాంతాల వారీగా విభజించడం వలన ప్రజలలో ఓ రకమైన ద్వేషాన్ని పెంచినట్లు అవుతుంది. నేను అలాంటి పని చేయను. బాలీవుడ్ ఇండస్ట్రీని పాయింట్ చేసి మాట్లాడను. సౌత్ ఇండస్ట్రీలో నేను చాలా విషయాలు నేర్చుకున్న, అలాగే బాలీవుడ్ కూడా ఎన్నో కొత్త విషయాలు నేర్పించిందని తెలిపాడు.

అందరు కలిసి చిత్రపరిశ్రమని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లే ప్రయత్నం చేయాలని యష్ ఆ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ఈ ఇంటర్వ్యూ తర్వాత నార్త్ లో కూడా యష్ ని అభిమానించేవారి సంఖ్య విపరీతంగా పెరిగిందని చెప్పొచ్చు. ఇప్పుడు రామాయణం సినిమాలో నటించడం ద్వారా తనకి నటుడిగా పరిమితులు లేవని కూడా చూపించే ప్రయత్నం చేస్తున్నారు.