యశ్.. ఆ పాత్రలను ఒప్పుకోవడం సరైనదేనా?
బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి తన తర్వాతి సినిమాను మహాభారతం ఆధారంగా తెరకెక్కించనున్నట్లు తెలిపారు
By: Tupaki Desk | 24 Oct 2023 2:30 PM GMTబాలీవుడ్ స్టార్ డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి తన తర్వాతి సినిమాను మహాభారతం ఆధారంగా తెరకెక్కించనున్నట్లు తెలిపారు. కన్నడ రచయిత ఎన్.ఎల్.బైరప్ప మహాభారతం ఆధారంగా రచించిన పర్వ అనే పుస్తకాన్ని సినిమా రూపంలో అందించనున్నారు. అయితే ఇందులో కన్నడ రాకింగ్ స్టార్ యశ్ నటిస్తే బాగుంటుందంటూ తన మనసులోని మాటను బయటపెట్టారు.
యశ్ గ్రేటెస్ట్ యాక్టర్ అని కొనియాడారు. తన సినిమాలో ఆయన నటించడం తన కోరికని చెప్పారు. అయితే ఈ కామెంట్స్‌పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అగ్నిహోత్రి చాలా సార్లు తాను స్టార్‌డమ్‌ను నమ్మనని, కథను మాత్రమే దృష్టిలో పెటుకుని ముందుకు వెళ్తానని చెప్పారు. కానీ ఇప్పుడు తన సినిమాకు దేశవ్యాప్తంగా క్రేజ్ ఉన్న హీరో యశ్ కావాలని కోరుకుంటున్నారు.
ఒకవేళ అగ్రిహోత్రి కోరుకున్నట్టే.. యశ్ ఈ సినిమాకు గ్రీన్ ఇచ్చారనుకోండి.. ఇది ఎంత వరకు సరైందనే ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. యశ్ ఇప్పుడు దేశవ్యాప్తంగా ఎటువంటి నెగిటివిటీ లేని ఫుల్ క్రేజ్ ఉన్న పాన్ ఇండియా హీరో. ఆయనకు అన్ని వర్గాల ఆడియెన్స్‌లో అభిమానులు ఉన్నారు. కానీ అగ్రిహోత్రి తీసే సినిమాలు కేవలం ఓ వర్గానికి చెందిన వారే చూస్తారు. మిగతా వారు చూడటానికి ఇష్టపడరు. ఎందుకంటే ఆయన చిత్రాల్లో కమ్యూనల్ యాంగిల్ ఉంటుంది. ఆయన చిత్రాలను చాలా మంది సినీ ప్రియులు బాయ్ కాట్ చేస్తుంటారు.
మరి అలాంటి డైరెక్టర్‌తో యశ్ సినిమా చేస్తే.. సినీ ప్రియులు రిసీవ్ చేసుకునే అవకాశం ఎక్కువగా ఉండదు. చాలా మంది అభిమానులను, సినీప్రియులను ఆయన కోల్పోవాల్సి ఉంటుంది. అనవసరమైన నెగిటివిటీ పెరుగుతుంది. కాబట్టి యశ్.. అగ్రిహోత్రి లాంటి డైరెక్టర్స్‌తో సినిమా చేసే ముందు ఆచితూచి నిర్ణయం తీసుకోవాలి. దాదాపుగా ఒప్పుకోకపోవడమే మంచిదన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
అసలే యశ్ ఇప్పటికే.. బాలీవుడ్లో నితీశ్ తివారి తెరకెక్కించబోతున్న రామాయణ చిత్రంలో రావణ పాత్ర పోషించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై అధికార ప్రకటన రాలేదు. ఒకవేళ ఇది కనుక నిజమైన యశ్ మరో మైథాలజికల్ ఫిల్మ్‌ను సెలెక్ట్ చేసుకోవడాన్ని ఆడియెన్స్ రిసీవ్ చేసుకోలేకపోవచ్చు. కాబట్టి యశ్ తన బ్రాండ్ ఇమేజ్ను దృష్టిలో పెట్టుకుని ప్రాజెక్ట్‌ను ఓకే చేయాలి. ఏదేమైనా ఈ ప్రాజెక్ట్స్‌ను యశ్ ఓకే చేశారా లేదా అనేది తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగితేనే తెలుస్తుంది.