Begin typing your search above and press return to search.

అందం కోసం సర్జరీలు చేయించుకున్నానని అన్నారు

చాలా కాలంగా ఎంతో మంది స్టార్స్ గెస్ట్‌ గా హాజరు అవుతూ సాగుతున్న ఈ షో కొత్త సీజన్‌ సాగుతోంది.

By:  Tupaki Desk   |   18 Nov 2023 1:30 AM GMT
అందం కోసం సర్జరీలు చేయించుకున్నానని అన్నారు
X

బాలీవుడ్‌ స్టార్స్ పై ఎప్పుడూ ఏదో ఒక రూమర్‌ వస్తూనే ఉంటుంది. వాటికి ఏదో ఒక వేదిక ద్వారా క్లారిటీ వస్తూ ఉంటుంది. రూమర్స్ కి ఎక్కువగా కాఫీ విత్ కరణ్ షో ద్వారా క్లారిటీ వస్తూ ఉంటుంది. చాలా కాలంగా ఎంతో మంది స్టార్స్ గెస్ట్‌ గా హాజరు అవుతూ సాగుతున్న ఈ షో కొత్త సీజన్‌ సాగుతోంది.

ఎప్పటిలాగే ఈ సీజన్‌ ని కూడా చాలా ఆసక్తికరంగా, రక్తి కట్టించే విధంగా కరణ్‌ జోహార్‌ సాగిస్తూ వస్తున్నాడు. తన షో కి వచ్చిన ప్రతి సెలబ్రిటీ గెస్ట్‌ తో కూడా వ్యక్తిగత విషయాలు కూడా ముచ్చటించే కరణ్‌ తాజాగా ఆలియా భట్‌ తో ముచ్చటించాడు. గతంలో కూడా కరణ్‌ షో లో ఆలియా పాల్గొంది. ఈసారి కొత్త విషయాలను ఆమె చెప్పింది.

తాను అందంగా మారడం కోసం, లావు తగ్గడం కోసం సర్జరీలు చేయించుకున్నట్లుగా కొందరు ప్రచారం చేశారు. చాలా సార్లు నేను తెల్లగా అవ్వడం కోసం మొహం పై సర్జరీ లు చేయించుకున్నట్లుగా కొందరు పదే పదే వ్యాఖ్యలు చేశారు, సోషల్‌ మీడియా ద్వారా విమర్శించారు. నా మనసు నొచ్చుకునే విధంగా నా గురించి ప్రచారం చేశారని ఆలియా ఆవేదన వ్యక్తం చేసింది.

ఇక తనను రణబీర్‌ వేదిస్తున్నాడు అంటూ కూడా కొందరు ప్రచారం చేస్తున్నాను. నేను లిప్‌ స్టిక్ వేసుకోవడం రణబీర్ కి నచ్చదు అంటూ చెప్పడంతో చాలా మంది తప్పుగా అర్థం చేసుకుని ఆలియా ను రణబీర్‌ ఇబ్బంది పెడుతున్నాడు. ఆమెకు వ్యక్తిగత స్వేచ్చ ఇవ్వడం లేదు అంటూ వ్యాఖ్యలు చేశారు. తాము చాలా సంతోషంగా ఉన్నామని ఆలియా చెప్పుకొచ్చింది.