Begin typing your search above and press return to search.

నాన్న బ‌యోపిక్ కి అత‌నే న్యాయం చేస్తాడు! నాగ‌సుశీల‌

కానీ ఏఎన్నార్ బ‌యోపిక్ మాత్రం ఎక్క‌డా చ‌ర్చ‌కు రాలేదు. తాజాగా ఈ అంశంపై నేరుగా ఏఎన్నార్ కుమార్తె నాగ‌సుశీల స్పందించ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది.

By:  Tupaki Desk   |   22 Dec 2023 5:18 AM GMT
నాన్న బ‌యోపిక్ కి అత‌నే న్యాయం చేస్తాడు! నాగ‌సుశీల‌
X

లెజెండ‌రీ న‌టుడు అక్కినేని నాగేశ్వ‌ర‌రావు బ‌యోపిక్ అంశం ఇప్ప‌టివ‌ర‌కూ ప్ర‌చారంలోకి రాని సంగ‌తి తెలిసిందే. మూవీ మోఘ‌ల్ రామానాయుడు...ద‌ర్శ‌క‌రత్న దాస‌రి నారాయాణరావు..సూప‌ర్ స్టార్ కృష్ణ ఇలా కొంత‌మంది జీవిత క‌థ‌లు తెర‌కెక్కించే అంశం నెట్టింట ప్ర‌చారంలోకి వ‌చ్చింది త‌ప్ప ఏఎన్నార్ టాపిక్ మాత్రం ఎక్క‌డా రాలేదు. రామానాయుడు క‌థ‌లో వెంక‌టేష్ న‌టిస్తే బాగుంటుంద‌ని...దాస‌రి బ‌యోపిక్ లో ఓపేరున్న న‌టుడు న‌టిస్తే బాగుంటుంద‌ని...కృష్ణ జీవితంలో ఆయ‌న తన‌యుడు మ‌హేష న‌టిస్తే బాగుటుంద‌ని ప్ర‌చారం సాగింది.


ఈ విష‌యాలు సైతం ఆ హీరోల ముందుకు వెళ్లాయి. వాటికి ఆస‌క్తిక‌ర మైన స‌మాధానాలు వ‌చ్చాయి. కానీ ఏఎన్నార్ బ‌యోపిక్ మాత్రం ఎక్క‌డా చ‌ర్చ‌కు రాలేదు. తాజాగా ఈ అంశంపై నేరుగా ఏఎన్నార్ కుమార్తె నాగ‌సుశీల స్పందించ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. ఓ ఇంట‌ర్వ్యూలో ఈ టాపిక్ రావ‌డంతో ఆమె స్పందించారు. ఆవేంటో ఆమె మాట‌ల్లోనే...`పెళ్లైన కొత్తలో నాన్నకి చాలా కోపం ఉండేదని అమ్మ చెప్పేది. మాకు ఊహ తెలిసిన తరువాత ఆయన కోపంగా ఉండటం ఎప్పుడూ చూడలేదు.

మాతో ఎప్పుడూ సరదాగానే మాట్లాడుతూ ఉండేవారు. వేసవి సెలవుల్లో నాన్నగారి సినిమాల షూటింగులకు వెళ్లేవాళ్లం. అప్పట్లో ఊటీలో ఎక్కువగా షూటింగ్స్ జరుగుతూ ఉండేవి. నాన్నగారి సినిమాలు చాలా వరకూ నేను పూర్తిగా చూడలేదు. ఎందుకంటే తెరపై ఆయనని ఎవరైనా కొడుతూ ఉంటే నేను చూడలేక పోయే దానిని. బయట కూడా నాన్నను ఎవరైనా ఏమైనా అంటే? అస్సలు సహించేదానిని కాదు. అనారోగ్య కారణాల వలన అమ్మ వేటిపైనా కూడా పెద్దగా శ్రద్ధ చూపించేది కాదు.

ఇప్పుడు ఎందుకులే అని ఆమె అన్నవన్నీ నాన్న నాతోనే చెప్పించి ఒప్పించేవారు. ఇక మాకంటే కూడా మనవళ్లతో ఆయన ఎక్కువ చనువుగా ఉండేవారు. ఇక‌ నాన్న బయోపిక్ గురించిన ప్రస్తావన ఇంతవరకూ నా దగ్గర ఎవరూ తీసుకురాలేదు. ఒకవేళ తీస్తే ఆ పాత్రను నాగార్జున చేస్తేనే బాగుంటుంది. త‌ను మాత్ర‌మే నాన్న పాత్ర‌కు న్యాయం చేయ‌గ‌ల‌డ‌ని న‌మ్ముతున్నాను. ఎన్నో సినిమాలు చేసిన అనుభ‌వం త‌న‌కి ఉంది. న‌టుడిగా త‌న‌కంటూ ప్ర‌త్యేక‌మైన ఇమేజ్..గుర్తింపు ఉంది. నాన్న పాత్ర‌ను అత‌నే స‌రిపోతాడు` అని అన్నారు.