Begin typing your search above and press return to search.

మెగా హీరోతో శ్రీలీల.. అదిరిపోయే స్టెప్పులు

ఆదికేశవ టీమ్​.. సాంగ్స్​, టీజర్స్​ అందించిన రెస్పాన్స్​తో సినిమా పక్కాగా బ్లాక్​ బాస్టర్ హిట్ అవుతుందని కాన్ఫిడెంట్​గా ఉన్నారు.

By:  Tupaki Desk   |   11 Oct 2023 12:30 PM GMT
మెగా హీరోతో శ్రీలీల.. అదిరిపోయే స్టెప్పులు
X

పంజా వైష్ణవ్‌ తేజ్‌ - యంగ్ సెన్సేషనల్ బ్యూటీ శ్రీలీల జంటగా నటిస్తున్న లేటెస్ట్​ మూవీ ఆదికేశవ. ఈ సినిమా మరి కొన్ని రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా సినిమా నుంచి 'హే బుజ్జి బంగారం' లిరికల్ వీడియోను తాజాగా చిత్ర బృందం విడుదల చేసింది.


ఈ పాట వింటుంటే ఎంతో రిఫ్రెషింగ్​గా ఉంది. శ్రీలీల పంజా వైష్ణవ్​ తేజ్ డ్యాన్స్​ మూమెంట్స్​ కూడా బాగున్నాయి. లిరిక్స్​ కూడా కచ్చితంగా ప్రతిఒక్కరి రొమాంటిక్ ప్లేలిస్ట్​లో ఉండేలా ఉన్నాయి. జీవీ ప్రకాశ్​ అందించిన మ్యూజిక్​ రొమాంటిక్​ ఫీల్​, ఫ్రెష్ వైబ్స్​ అందించాయి. ఆర్మాన్ మాలిక్​-యామిని ఘంటశాల అద్భుతంగా ఆలపించారు. సరస్వతి పుత్ర రామజోగయ్యా శాస్త్రి అందించిన లిరిక్స్ ఎమోషన్స్​ను ఎక్స్​ప్రెస్​ చేసేలా మంచి మీనింగ్ ఫుల్​గా ఉన్నాయి. సినిమాలోని లొకేషన్స్ కూడా అద్భుతంగా ఉన్నాయి. అంతేకాకుండా పాట చాలా కలర్‌ఫుల్‌గా కనిపిస్తుంది.


ఆదికేశవ టీమ్​.. సాంగ్స్​, టీజర్స్​ అందించిన రెస్పాన్స్​తో సినిమా పక్కాగా బ్లాక్​ బాస్టర్ హిట్ అవుతుందని కాన్ఫిడెంట్​గా ఉన్నారు. ప్రేక్షకులు బాగా ఆదరిస్తారని నమ్ముతున్నారు. ఇకపోతే యాక్షన్‌ నేపథ్యంలో డైరెక్టర్​ శ్రీకాంత్‌ ఎన్‌. రెడ్డి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.

ఈ చిత్రంతో ఆయన దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు. ఓ గుడి చుట్టూ సాగే కథతో రూపొందిన చిత్రమిది. వైష్ణవ్‌తేజ్‌.. రుద్ర కాళేశ్వర్‌ రెడ్డిగా శక్తిమంతమైన పాత్రలో కనిపించనున్నారు.

ఈ చిత్రంలో వైష్ణవ్‌ సరసన శ్రీలీల సందడి చేయనుంది. మలయాళ యాక్టర్​ జోజు జార్జ్‌, అపర్ణాదాస్‌, రాధిక తదితరులు కీలక పాత్రలు పోషించారు. సితార ఎంటర్​టైన్మెంట్స్​పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నవీన్​ నూలి ఎడిటింగ్​ బాధ్యతలు చూసుకుంటున్నారు. సినిమా దీపావళి కానుకగా నవంబర్ 10న గ్రాండ్​గా రిలీజ్ కానుంది.

ఇకపోతే వైష్ణవ్​ తేజ్ చివరగా​.. రంగరంగ వైభవంగా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ చిత్రం ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేదు. మరి ఆదికేశవ ఎలాంటి రిజల్ట్​ను అందుకుంటుందో చూడాలి..