ఇరాన్, కెనడా, హాకాంగ్ లో వీరమల్లు!
ఈ నేపథ్యంలో పోస్ట్ ప్రొడక్షన్ కూడా పెద్దగా గ్యాప్ తీసుకోకుండానే మొదలు పెట్టారు. పీరియాడిక్ సోషియా ఫాంటసీ చిత్రం కావడంతో సీజీ ఎక్కువగా ఉంది.
By: Tupaki Desk | 4 April 2025 7:23 AMపవన్ కళ్యాణ్ కథానాయకుడిగా నటిస్తోన్న `హరిహర వీరమల్లు` రిలీజ్ తేదీ ప్రకటించిన సంగతి తెలిసిందే. మే 9న రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా స్పీడందు కున్నట్లు కనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ పై కొంత షూటింగ్ మినహా టాకీ అంతా పూర్తయింది. ఈ నేపథ్యంలో పోస్ట్ ప్రొడక్షన్ కూడా పెద్దగా గ్యాప్ తీసుకోకుండానే మొదలు పెట్టారు. పీరియాడిక్ సోషియా ఫాంటసీ చిత్రం కావడంతో సీజీ ఎక్కువగా ఉంది.
ఈ నేపథ్యంలో పోస్ట్ ప్రొడక్షన్ పనులు మూడు దేశాల్లో జరుగుతున్నట్లు తెలిసింది. ఇరాన్, కెనడా, హాకాంగ్ లో సీజీ పనులు జరుగుతున్నాయని యూనిట్ వర్గాల నుంచి తెలిసిందే. మూడు లోకేషన్లలో ఒకే కంపెనీకి ఈ బాధ్యతలు అప్పగించారట. ఒకో చోట ఏక కాలంలో ఒకేసారి సీజీ వీలుపడని నేపథ్యంలో వర్క్ ని ఇలా స్ప్లిట్ చేసినట్తు తెలుస్తోంది. అలాగే కొంత వర్క్ హైదరాబాద్ , చెన్నై స్టూడియోల్లో కూడా చేస్తున్నారుట.
పవన్ కళ్యాణ్ సినిమాకి సంబంధించి ఇంతవరకూ ఏ సినిమాకు ఇన్ని దేశాల్లో సీజీ జరగలేదు. ఇప్పటి వరకూ ఆయన చేసిన చిత్రాలన్నీ రొటీన్ కమర్శియల్ చిత్రాలు కావడంతో ఆ ఛాన్స్ రాలేదు. వీరమల్లు పూర్తిగా పీరియాడిక్ స్టోరీ కావడంతో సీజీ కి ప్రాధాన్యత ఏర్పడింది. విజువల్ ఎపెక్స్ట్ ఏ సినిమాకైనా కీలకం. యాక్షన్ సన్నివేశాల్లో సహజత్వాన్ని హైలైట్ చేసేది అదే.
మరి `వీరమల్లు` లో యాక్షన్ సన్నివేశాలు ఎలాంటి అనుభూతిని పంచుతాయో చూడాలి. ఈ సినిమాకి ఇంకా పవన్ కళ్యాణ్ కొన్ని రోజులు డేట్లు ఇవ్వాల్సి ఉంది. ఆ పార్ట్ కి సంబంధించి షూటింగ్ పూర్తి చేయాలి. అవసరం మేర అక్కడా సీజీ వర్క్ ఉంటుంది. మరి పవన్ హెక్టిక్ షెడ్యూల్ నడుమ డేట్లు ఎప్పుడు కేటాయిస్తారో చూడాలి.